Blue Zone
ప్రపంచవ్యాప్తంగా మనుషుల సగటు ఆయుష్షు డెబ్బై నుంచి ఎనబై ఏళ్లు దాటడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో.. జపాన్‌లోని ఒకినావా, ఇటలీలోని సార్డినియా, గ్రీస్‌లోని ఇకారియా వంటి కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఈజీగా వందేళ్లకు పైగా జీవిస్తున్నారు. అంతేకాదు, వందేళ్లు దాటినా వారు ఎంతో ఉత్సాహంగా, ఆరోగ్యంగా తమ పనులు తామే చేసుకోవడం ప్రపంచ శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
ఇక్కడి ప్రజల సుదీర్ఘ జీవితానికి కారణం కేవలం జన్యువులు, అలాగే వారు తినే ఆహారం మాత్రమే కాదు.. వారి అద్భుతమైన మానసిక స్థితితో పాటు వారు పాటించే బ్లూ జోన్స్(Blue Zone) అనే కొన్ని ప్రత్యేక జీవన సూత్రాలని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
దీనిలో మొదటి రహస్యం ‘ఇకిగాయ్’ (Ikigai). ఇది జపనీస్ పదం. దీని ప్రకారం మనం ‘జీవించడానికి ఒక ఉద్దేశ్యం’ అని అర్థం. అంటే ఉదయాన్నే నిద్రలేవడానికి మనకు ఒక బలమైన కారణం ఉండాలట. అది చిన్నదైనా, పెద్దదైనా మన మనసును చురుగ్గా ఉంచుతుందట. అందుకే బ్లూ జోన్ల(Blue Zone)లో వృద్ధులు కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటూ ఉంటారు.
రెండోది ‘సామాజిక బంధం’. ఇక్కడ ప్రజలు ఒంటరిగా గడపడానికి అస్సలు ఇష్టపడరు. వారు ప్రతిరోజూ తమ స్నేహితులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ కనీసం గంటల తరబడి ముచ్చట్లు పెడతారు. మనస్తత్వ శాస్త్రం ప్రకారం, మంచి సామాజిక సంబంధాలు ఉన్నవారిలో గుండె జబ్బులు , మతిమరుపు (Dementia) వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
ఆహారపు అలవాట్ల విషయానికి వస్తే, వీరు కచ్చితంగా 80 శాతం నియమాన్నిపాటిస్తారు. అంటే కడుపు నిండా తినకుండా, ఆకలి కొంచెం ఉండగానే భోజనం ఆపేస్తారు. అలాగే తినే ఆహారంలో ఎక్కువగా మొక్కల ఆధారిత పదార్థాలు, అంటే కూరగాయలు, ధాన్యాలు , పప్పు దినుసులు ఉంటాయి.
వీరు ఎప్పుడూ జిమ్‌లకు వెళ్లి వ్యాయామం చేయడం వంటివి చేయరట. ఎందుకంటే వారు నివసించే కొండ ప్రాంతాలు, తోటల పనుల వల్ల వారికి తెలియకుండానే శరీరానికి తగినంత ఎక్సర్‌సైజ్ లభిస్తుంది. వీరు జీవితంలో దేనికీ కూడా హడావిడి పడరు. ప్రతి క్షణాన్ని ప్రశాంతంగా ఆస్వాదించడం వీరి ప్రత్యేకత. ఈ మానసిక ప్రశాంతత వల్ల బాడీలో ఒత్తిడి కలిగించే హార్మోన్లు తగ్గి, రోగనిరోధక శక్తి పెరుగుతుందని వీరి నమ్మకం.
RBI :తెలుగు రాష్ట్రాలకు ఆర్‌బీఐ హెచ్చరిక..దేనికోసం? మరి దీనికి పరిష్కారం ఉందా?
