China
ప్రపంచంలో మిగిలిన దేశాలతో పోలిస్తే జనాభా విషయంలో చైనా ఎప్పుడూ ముందే ఉంటుంది. చాలా ఏళ్ల పాటు అత్యధిక జనాభా కలిగిన దేశంగా తన ఆధిపత్యం కొనసాగిస్తూనే ఉంది., అయితే 2023 నుంచి పరిస్థితి మారిపోయింది. జనాభా విషయంలో భారత్ టాప్ ప్లేస్ కు వెళితే.. చైనా(China) రెండో స్థానానికి పడిపోయింది. అప్పటి నుంచీ తమ జనాభా పెంచుకునేందుకు చైనా(China) చేయని ప్రయత్నాలు లేవు. ఎక్కువ మంది పిల్లలను కంటే తల్లితండ్రులకు రాయితీలు, ఇతర సౌకర్యాలు వంటి ఆఫర్స్ ప్రకటిస్తూ వచ్చింది.
గతంలో ఒకరికి ఒక బిడ్డే అన్న రూల్ తెచ్చి , జనాభా నియంత్రణ ప్రోత్సహించిన అదే చైనా ఇప్పుడు పిల్లలను కనమంటూ ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక వస్తువులపై భారీగా పన్నులు పెంచాలని నిర్ణయించింది. కండోమ్స్ పై పన్ను శాతం పెంచింది. అలాగే గర్భనిరోధక మాత్రలపైనా ట్యాక్స్ రెట్టింపు చేసింది. ఇలాంటి నిర్ణయాలతో జనాభా పెరుగుదలను ప్రోత్సహిస్తోంది. గతంలో ఏడాదికి 1.88 కోట్ల జననాలు నమోదవ్వగా.. ఇప్పుడు 95.4 లక్షలకు పడిపోయింది.
చైనా జనాభాలో వృద్ధులు పెరిగిపోగా…ఆర్థిక పరిస్థితులు మందగించి యువత పెళ్లి చేసుకునేందుకు వెనుకాడుతున్నారు. కొత్త దంపతులు పిల్లలను కనేందుకు ఇష్టపడడం లేదు. పిల్లల పెంపకానికి అయ్యే ఖర్చే దీనికి కారణం. 18 ఏళ్ల వరకూ పిల్లల్ని పెంచేందుకు భారత కరెన్సీలో రూ.68 లక్షలు ఖర్చవుతున్నట్లు అంచనా. ఈ ఖర్చు వెచ్చించలేక ఎక్కువమంది పిల్లలను కనేందుకుఎవ్వరూ ముందుకు రావడం లేదు. దీంతో జనాభా పెంచేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
ఇదిలా ఉంటే జనాభా పెంపు కోసం చైనా తీసుకున్న కండోమ్స్ పై పన్ను పెంపు నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తున్నారు. ఈ కారణంగా హెచ్ఐవీ కేసులు మరిన్ని పెరిగే ప్రమాదముందని హెచ్చిరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఎయిడ్స్ కేసులు తగ్గుముఖం నచ్చాయి. కానీ చైనా(China)లో మాత్రం ఈ పరిస్థితి భిన్నంగా ఉది. గడిచిన 20 ఏళ్లతో పోల్చి చూస్తే.. హెచ్ఐవీ కేసుల సంఖ్య పెరిగింది.ఇలాంటి పరిస్థితుల్లో కండోమ్స్ పై పన్ను విధించడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.
