Trump’s Offer: అమెరికా వీడితే రూ. 2.7 లక్షలు.. ట్రంప్ ఇచ్చిన ఆఫర్ వెనుక అసలు ఇదే..

Trump's Offer: ఎవరైనా అక్రమ వలసదారులు తమంతట తాముగా అమెరికాను విడిచి స్వదేశాలకు వెళ్లిపోతే, వారికి భారీగా నగదు బహుమతి ఇస్తామని తెలిపింది.

Trump’s Offer

అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారుల విషయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump’s Offer) ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అయితే, బలవంతంగా వారిని దేశం నుంచి వెళ్లగొట్టడం వల్ల ప్రభుత్వానికి ఖర్చు పెరుగుతుందని భావించిన ట్రంప్ సర్కార్, ఒక వింతైన ఆఫర్‌ను ప్రకటించింది.

ఎవరైనా అక్రమ వలసదారులు తమంతట తాముగా అమెరికాను విడిచి స్వదేశాలకు వెళ్లిపోతే, వారికి భారీగా నగదు బహుమతి ఇస్తామని తెలిపింది. ఈ క్రిస్మస్ , న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఆఫర్‌ను ప్రకటించారు. దీని ప్రకారం, డిసెంబర్ 31వ తేదీ లోపు అమెరికాను విడిచి వెళ్లిపోవడానికి అంగీకరించే అక్రమ వలసదారులకు 3 వేల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో సుమారు 2.7 లక్షల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుంది.

అంతేకాకుండా, అమెరికా నుంచి తిరిగి వెళ్లడానికి అయ్యే వన్ వే విమాన టికెట్ ఛార్జీలను కూడా ప్రభుత్వ(Trump’s Offer)మే భరిస్తుంది. వీసా గడువు ముగిసినా అమెరికాలో ఉన్నందుకు విధించే జరిమానాలను కూడా పూర్తిగా రద్దు చేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది.

అయితే, ఈ(Trump’s Offer) ఆఫర్‌ను వాడుకోకుండా అమెరికాలోనే అక్రమంగా ఉంటూ పట్టుబడితే మాత్రం, వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడమే కాకుండా, భవిష్యత్తులో ఎప్పుడూ అమెరికాలోకి అడుగు పెట్టకుండా శాశ్వత నిషేధం విధిస్తామని ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది.

ఈ పథకాన్ని వినియోగించుకోవాలనుకునే వారు ఒక ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అక్రమ వలసదారులను సాధ్యమైనంత త్వరగా పంపించి వేయడమే లక్ష్యంగా ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల విషయంలో తీసుకున్న ఈ వింతైన నిర్ణయం వెనుక చాలా లోతైన ఆర్థిక కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఒక అక్రమ వలసదారుడిని గుర్తించి, వారిని అరెస్ట్ చేసి, ఆ తర్వాత కోర్టులో విచారణ జరిపి, చివరకు విమానం ఎక్కించి పంపించాలంటే అమెరికా ప్రభుత్వానికి తల ప్రాణం తోకకు వస్తుంది.

Trump’s Offer

దీనికోసం ఒక్కో వ్యక్తిపై ప్రభుత్వం దాదాపు పది నుంచి పదిహేను వేల డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. లక్షలాది మంది వలసదారులను ఇలా పంపించాలంటే అమెరికా ఖజానా ఖాళీ అయిపోతుంది. అందుకే ట్రంప్ ఒక తెలివైన వ్యాపారవేత్తలా ఆలోచించి ఈ నగదు బహుమతి పథకాన్ని తెచ్చారు.

అంటే, పది వేల డాలర్లు ఖర్చు చేసి బలవంతంగా పంపించే కంటే, మూడు వేల డాలర్లు వాళ్ల చేతిలో పెట్టి “మీ అంతట మీరే వెళ్ళిపోండి” అని చెప్పడం వల్ల ప్రభుత్వానికి భారీగా నిధులు ఆదా అవుతాయి. ఇది కేవలం మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం కాదు, పక్కాగా ఖర్చును తగ్గించుకోవడానికి చేసిన ప్లాన్.

ఈ నిర్ణయం వల్ల వలసదారులకు లాభమా నష్టమా అని ఆలోచిస్తే, ఇందులో రెండు కోణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి అమెరికాలో అక్రమంగా ఉంటూ నిత్యం పోలీసులకు దొరికిపోతామేమో అన్న భయంతో బతికే కంటే, మూడు వేల డాలర్లు (సుమారు 2.7 లక్షల రూపాయలు) తీసుకుని గౌరవంగా తన సొంత దేశానికి వెళ్ళిపోవడం ఒక రకంగా లాభమే.

ఆ డబ్బుతో వారు తమ దేశంలో ఏదైనా చిన్న వ్యాపారం మొదలుపెట్టుకోవచ్చు. అలాగే జైలు పాలు కాకుండా, విమాన టికెట్ ఖర్చులు కూడా మిగిలిపోతాయి.

కానీ మరో కోణంలో చూస్తే ఇది పెద్ద నష్టమే. ఎందుకంటే వేలాది మంది వలసదారులు అప్పులు చేసి, ప్రాణాలకు తెగించి అమెరికా కలలతో అక్కడికి వెళ్తారు. వారు అక్కడ ఉండి సంపాదించే దానితో పోలిస్తే ఈ రెండు మూడు లక్షల రూపాయలు చాలా చిన్న మొత్తం. ఒక్కసారి ఈ(Trump’s Offer) పథకం కింద డబ్బు తీసుకుని బయటకు వెళ్లిపోతే, భవిష్యత్తులో మళ్లీ అమెరికా గడ్డపై అడుగు పెట్టే అవకాశం శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం ఉంది.

ఇక దీని ఫలితాల విషయానికి వస్తే, ప్రస్తుతం అమెరికాలో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఎప్పుడైనా పెద్ద ఎత్తున అరెస్టులు మొదలవుతాయని అక్రమ వలసదారులు భయపడుతున్నారు. ఈ భయం వల్ల చాలా మంది “జైలుకు వెళ్ళడం కంటే ఈ డబ్బు తీసుకుని వెళ్ళిపోవడమే మేలు” అని భావిస్తున్నారు.

అందుకే రిజిస్ట్రేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే దీనివల్ల అమెరికాలోని హోటల్ రంగం, వ్యవసాయం , నిర్మాణ రంగాలపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ తక్కువ కూలీకి పని చేసేది వీరే. వీరంతా ఒక్కసారిగా వెళ్ళిపోతే ఆ పనులన్నీ ఆగిపోయి అమెరికాలో వస్తువుల ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా, ట్రంప్ తన దేశాన్ని అక్రమ వలసదారుల నుంచి క్లీన్ చేయడమే లక్ష్యంగా ఈ ‘క్యాష్ ఆఫర్’ అస్త్రాన్ని ప్రయోగించారు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version