Trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. తాజాగా ట్రంప్ మరోసారి తనదైన శైలిలో వార్తల్లో నిలిచారు. స్టేట్ ఆఫ్ ది యూనియన్ ప్రసంగంలో ఏకంగా 107 నిమిషాల పాటు ట్రంప్ ప్రసంగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.
అయితే ప్రపంచవ్యాప్తంగా శాంతిని నెలకొల్పడంలో తాను కీ రోల్ పోషిస్తున్నానని చెప్పుకున్న డొనాల్డ్ ట్రంప్, తన ప్రసంగంలో చేసిన కొన్ని కామెంట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురవుతున్నాయి. ముఖ్యంగా భారతదేశం,పాకిస్తాన్ మధ్య అణు యుద్ధాన్ని నిరోధించింది తానేనని ట్రంప్ ప్రకటించినపుడు చేసిన కామెంట్లు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
తాను రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పదవీకాలం మొదలైన మొదటి పది నెలల్లోనే తాను8 యుద్ధాలను ఆపానని ట్రంప్(Trump) అన్నారు. అందులో కంబోడియా-థాయిలాండ్ గొడవలు, అలాగే భారత్-పాక్ మధ్య జరగాల్సిన అణు యుద్ధం కూడా ఉందని అమెరికా అధ్యక్షుడు చెప్పుకొచ్చారు.
అయితే తాను మధ్యవర్తిత్వం వహించకపోతే, పాకిస్తాన్ ప్రధాని చనిపోయేవారు.. ఆయనతో పాటు మరో 35 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోయేవారంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలే.. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో హెడ్‌లైన్స్‌గా మారిపోయాయి.
ఎందుకంటే ఈ ప్రసంగంలో ట్రంప్ ఒక చిన్న పొరపాటు చేశారు. పాకిస్తాన్ ప్రధాని అని సంబోధించారు. నిజానికి ట్రంప్ పాక్ సైన్యాధినేత ఆసిమ్ మునీర్ గురించి మాట్లాడాల్సిన ట్రంప్ ప్రధాని అని చెప్పడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్‌లో అసలైన అధికారమంతా సైన్యాధినేత చేతుల్లోనే ఉంటుందనే విషయం జగమెరిగిన సత్యం.
కానీ ట్రంప్ మాత్రం పీఎం పేరు అనడంతో లిబరల్ మీడియా ట్రంప్‌పై విరుచుకుపడుతోంది. ట్రంప్‌నకు దక్షిణాసియా రాజకీయాల మీద కనీస అవగాహన లేదని.. ప్రధాని ఎవరో, సైన్యాధినేత ఎవరో కూడా ఆయనకు తెలియదంటూ సీఎన్ఎన్, న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలు ఫ్యాక్ట్-చెక్ వీడియోలతో సహా ఆయన్ని ట్రోల్ చేస్తున్నాయి.
నిజానికి 2025లో కాశ్మీర్ , బలూచిస్తాన్ సరిహద్దుల్లో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన మాట వాస్తవమే. ఆ సమయంలో అమెరికా ఒత్తిడి , చైనా జోక్యం వల్ల పరిస్థితులు సద్దుమణిగాయి. కానీ ట్రంప్ మాత్రం ఆ క్రెడిట్ అంతా తన ఖాతాలోన వేసుకుని, తానే సూపర్ హీరో అన్నట్లుగా చెప్పుకోవడం అలవాటుగా మార్చుకున్నారు. అలా ఇప్పుడు కూడా చెప్పుకున్నారు. అయితే ఈ ప్రసంగంలో ట్రంప్ సుమార 20 కి పైగా తప్పుడు వాదనలు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ , పాకిస్తాన్ మీడియాలో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. అమెరికాలోని కన్సర్వేటివ్ మీడియా మాత్రం.. ట్రంప్ శాంతిని తీసుకువస్తే దానిని మెచ్చుకోకుండా, ఆయన పొరపాటుగా వాడిన పదాలను పట్టుకుని విమర్శిస్తారా?” అంటూ ట్రంప్‌నకు మద్దతుగా నిలుస్తోంది. ఇటు పాకిస్తాన్ మీడియా మాత్రం పాక్ ప్రధానిని.. ట్రంప్ తక్కువ చేసి మాట్లాడారంటూ ఫైర్ అవుతోంది. ఏదేమైనా, పాలసీల కంటే కూడా పర్సనల్ కామెంట్స్‌తోనే వార్తల్లో ఉండటం ఆయనకు అలవాటే అని ఈ ట్రంప్ ప్రసంగం మరోసారి నిరూపించింది.
#WATCH | Addressing the 2026 State of the Union, United States President Donald Trump says, "… In my first 10 months, I ended eight wars… Pakistan and India would have had a nuclear war. 35 million people said the Prime Minister of Pakistan would have died if it were not for… pic.twitter.com/GnrgJKtjID
— ANI (@ANI) February 25, 2026
