Mexico
ఒక చిన్న దేశం తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం, ప్రపంచంలోని పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థలను ఎలా కదిలిస్తుందో తెలుసా? అమెరికా, చైనా మధ్య జరిగే పంతానికి, మన ఇండియన్ కారు ఎగుమతి వ్యాపారం ఎందుకు బలి కావాలి? మెక్సికో(Mexico) అనే దేశం తన ఇంటి తలుపులు మూసేసి, “ఇకపై 50% ట్యాక్స్ కట్టి లోపలికి రండి” అని బెదిరిస్తోంది. ఇది కేవలం టారిఫ్ కాదు , ఇది భారత్‌ను టార్గెట్ చేసిన ఒక కొత్త ట్రేడ్ గేమ్. మన దేశం ఈ షాక్‌ను ఎలా ఎదుర్కొనబోతోంది? ఎదురుదాడి చేస్తుందా, లేక డీల్ చేసుకుంటుందా?
మెక్సికో (Mexico)50% వరకు ఇంపోర్ట్ టారిఫ్ పెంపు కథ అనేది కేవలం ఒక్క బిల్లు గురించి కాదు. ఇది అమెరికా, చైనా మధ్య ఉన్న టెన్షన్, నార్త్ అమెరికా సప్లై చైన్ (వస్తువుల సరఫరా గొలుసు), భారత్ ఒక ట్రేడ్ పవర్ గా ఎదుగుదల..ఇవన్నీ కలిసిన ఒక కొత్త ట్రేడ్ యుద్ధం ఎపిసోడ్ లాంటిది.
అసలు మెక్సికో (Mexico)ఏం చేసింది? మెక్సికో పార్లమెంట్ ఇటీవల ఒక బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దాదాపు 1,400 నుంచి 1,463 రకాల ప్రొడక్ట్‌లపై ఇంపోర్ట్ డ్యూటీని (దిగుమతి సుంకాన్ని) 5% నుంచి గరిష్టంగా 50% వరకు పెంచవచ్చు. ఈ నిర్ణయం టార్గెట్ చేసే దేశాలు ఏవంటే, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ (FTA) లేని దేశాలు..ముఖ్యంగా ఇండియా, చైనా, బ్రెజిల్ ,మరికొన్ని ఏషియన్, లాటిన్ దేశాలు.
ఆటోమొబైల్స్, ఆటో పార్ట్స్, టెక్స్‌టైల్, గార్మెంట్స్, ప్లాస్టిక్, స్టీల్, ఫుట్‌వేర్, ఫర్నీచర్, గ్లాస్ వంటి సెక్టార్‌లలో ఈ ట్యారిఫ్ భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు, కార్లపై డ్యూటీ 20% నుంచి ఏకంగా 50%కి జంప్ అవుతోంది. ఈ కొత్త నిబంధన 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. మధ్యలో ఇంకా లోయర్ హౌస్ ఆమోదం, టెక్నికల్ నోటిఫికేషన్ వంటి చిన్న ఫార్మాలిటీస్ మాత్రమే మిగిలి ఉన్నాయి.
ఇండియా, మెక్సికో (Mexico)ట్రేడ్‌పై దీని డైరెక్ట్ ప్రభావం ఎలా ఉంటుంది? 2024–25లో మెక్సికోకు ఇండియా ఎగుమతులు దాదాపు 5.7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇండియాకు మెక్సికోతో ట్రేడ్ సర్ప్లస్ (ఎక్కువ ఎగుమతి) సుమారు 2.8 బిలియన్ డాలర్లు ఉంది..అంటే ఇండియా అక్కడ నెట్ గెయినర్. కానీ థింక్ ట్యాంక్ లెక్కల ప్రకారం, ఈ కొత్త డ్యూటీలతో ఇండియా ఎగుమతుల్లో దాదాపు 75% విలువ టారిఫ్ ఇంపాక్ట్‌కు లోనవుతాయి. మెజారిటీ కేటగిరీలలో డ్యూటీ 0–15% నుంచి సగటు 35% రేంజ్‌కే పెరుగుతుంది.
సుమారు 1 బిలియన్ డాలర్ల విలువ ఉన్న కార్ ఎగుమతులు..ముఖ్యంగా Volkswagen–Skoda, Hyundai, Maruti Suzuki, Nissan వంటి కంపెనీల వాహనాలు..డైరెక్ట్‌గా సిగ్నిఫికంట్ రిస్క్ జోన్‌లోకి వెళ్తున్నాయి. అయితే, ఫార్మా సెక్టార్ మాత్రం కొంచెం సేఫ్‌గా ఉంది. అక్కడ డ్యూటీ 0–5% నుంచి గరిష్టంగా 10% వరకే ఉంది.
అందుకే ఇండియన్ జనరిక్ మందులు ఇంకా పోటీ ఇవ్వగలిగే అవకాశముంది. ఈ టారిఫ్ పెంపు ఎగుమతిదారులకు ఏమి చెబుతోందంటే, ఇకపై మార్జిన్‌లు పలుచబడతాయి. కొంత బిజినెస్ చైనాకు లేదా లోకల్ మెక్సికో ప్రొడక్షన్‌కు షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. కొత్త ప్రైసింగ్, సప్లై స్ట్రాటజీలను డిజైన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇండియా రియాక్షన్ ఏమిటి? ఇండియా దీన్ని “సైలెంట్ విక్టిమ్” లాగా చూడడం లేదు. న్యూఢిల్లీ చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చింది: “ఇంత పెద్ద MFN (Most Favored Nation) టారిఫ్ హైక్ ముందస్తు చర్చల లేకుండా పెడితే, ఇది మన సహకార భావనకు సరిపోదు; అవసరమైతే అప్రోప్రియేట్ మెజర్స్ తీసుకుంటాం” అని చెప్పింది.
కామర్స్ సెక్రటరీ రాజేశ్ అగర్వాల్, మెక్సికో వైస్–మినిస్టర్ ఆఫ్ ఎకానమీతో ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. ఆ తర్వాత టెక్నికల్ టీమ్‌లు ఇంపాక్ట్, ఎక్సెంప్షన్, ప్రాధాన్యత రూట్‌ల గురించి నెగోషియేట్ (బేరం) చేస్తున్నారు. ఇండియన్ ఎంబసీ సెప్టెంబర్ నుంచే మెక్సికో గవర్నమెంట్‌కు నోట్లు పంపి, ఇండియాకు స్పెషల్ కన్సెషన్ ఇవ్వండి లేదా ఆటో, టెక్స్‌టైల్ వంటి సెక్టార్‌లపై అత్యధిక స్లాబ్ తప్పించండని ప్రయత్నం చేస్తోంది. దీనికి సమాంతరంగా, ఇండియా, మెక్సికో ప్రిఫరెన్షియల్ ట్రేడ్ అగ్రిమెంట్ లేదా FTA గురించి చర్చలు ప్రారంభమయ్యాయి. అంటే ఘర్షణతో పాటు డీల్ కోసం డోర్ ఓపెన్ అనే స్ట్రాటజీని ఇండియా వాడుతోంది.
“అప్రోప్రియేట్ మెజర్స్” అంటే ఏమిటి అంటే ప్రస్తుతం వివరాలు బయటకు రాలేదు. కానీ ఆప్షన్స్ ప్రధానంగా మూడు ఉంటాయి.. మెక్సికో నుంచి వచ్చే కొన్ని వస్తువులపై ఇండియా కూడా తిరిగి టారిఫ్ పెంచడం. WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్) లో “కన్సల్టేషన్” డిమాండ్ చేసి, రాజకీయ ఒత్తిడిని పెంచడం. లేదా మెక్సికోను బైపాస్ చేసి US, కెనడా మార్కెట్లకు డైరెక్ట్ ఎగుమతిని స్ట్రెంగ్తెన్ చేయడం, ఇతర లాటిన్ అమెరికన్ మార్కెట్లను టార్గెట్ చేయడం. ఇండియా వైఖరి చూస్తుంటే, రివెంజ్ కంటే “ఒత్తిడి + నెగోషియేషన్ + డైవర్సిఫికేషన్” అనే మిక్స్‌డ్ స్ట్రాటజీ వైపు వెళ్తోంది.
ఈ టారిఫ్ వెనుక అమెరికా హ్యాండ్ ఉందా అనే ప్రశ్నలకు రిపోర్ట్‌లు చెబుతున్న దాని ప్రకారం చూస్తే.. దీని వెనుక ప్రధానంగా US ఒత్తిడి ఉంది. ట్రంప్ ప్రభుత్వం చైనా వస్తువులు మెక్సికో ద్వారా US మార్కెట్‌లోకి ప్రవేశిస్తాయనే ఆందోళనతో ముందే మెక్సికోపై కూడా 30% టారిఫ్ పెంచింది. ఇప్పుడు మెక్సికో, USMCA రివ్యూ ముందు చైనా మీద కఠినంగా ఉన్నాం అని చూపించడానికి నాన్–FTA ఆసియన్ దేశాలపై టారిఫ్ పెంచింది.
చైనాపై ఒత్తిడి వేయాలనే ప్రయత్నంలో ఇండియా కూడా సైడ్ కాలటరల్ డ్యామేజ్‌గా చిక్కుకుంది. అయితే US డైరెక్ట్‌గా ఇండియన్ ఎగుమతుల్ని ఇష్టపడుతుందా అంటే, అలానే కాదు. US కూడా కొన్ని నెలల క్రితం స్టీల్, అల్యూమినియం, టెక్ ప్రొడక్ట్స్‌పై 50% వరకూ టారిఫ్ పెంచింది. కానీ దీన్ని ఇండియాకు పాజిటివ్‌గా వాడుకునే ఆప్షన్ కూడా ఉంది. చైనా, మెక్సికో కాంబినేషన్ కట్ అయితే, కొన్ని సెక్టార్‌ల్లో US నేరుగా ఇండియాలోని ప్లాంట్లతో డీల్ చేయాల్సి వస్తుంది.
ట్రేడ్ రిలేషన్స్‌పై దీని దీర్ఘకాల ప్రభావం ఇలా ఉంటుంది. ఇండియా, మెక్సికోల మధ్య: తక్షణంలో కార్ల, ఆటో పార్ట్స్ ఎగుమతి కొంచెం తగ్గవచ్చు. ఎగుమతిదారులు మెక్సికో(Mexico)లో ఉన్న చిన్న అసెంబ్లీ ప్లాంట్ల ద్వారా “లోకల్ ప్రొడక్షన్ + భాగం భారత నుంచి” అనే మోడల్‌కి మారవచ్చు. మిడ్టర్మ్‌లో FTA/ప్రీఫరెన్షియల్ ట్రేడ్ డీల్ కుదిరితే, హై టారిఫ్‌ని కొంతవరకు న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. లేదంటే, ఇండియా తన సప్లైను బ్రెజిల్, చిలీ, పెరూ లేదా ఆఫ్రికా మార్కెట్లకు మళ్లించడం మొదలుపెట్టొచ్చు.
గ్లోబల్ ట్రేడ్ ఆర్కిటెక్చర్‌పై మెక్సికో (Mexico)స్టెప్ రెండు మెసేజ్‌లు పంపుతోంది.. ఒకటి “నియర్–షోరింగ్ + ప్రొటెక్షనిజం” – US సప్లై చైన్‌లో ఉన్న దేశాలు కూడా ఇప్పుడు హై టారిఫ్ గుండు పేల్చగలవు. రెండోది, WTO రూల్స్ ఉన్నా, పెద్ద దేశాలు MFN స్లాబ్‌లతో ఒత్తిడి పెంచే కొత్త పధ్ధతులు వెతుకుతున్నాయి. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఇండియా “జస్ట్ ఎగుమతి మార్కెట్” కాదని, పెద్ద మార్కెట్ + మాన్యుఫ్యాక్చరింగ్ బేస్ + జియోపాలిటికల్ బ్యాలెన్సర్ అంటూ తన ప్రత్యేక స్థానం బలపరచుకోవాల్సిన సమయం ఇది.
ఓవరాల్‌గా చెప్పాలంటే, మెక్సికో(Mexico) టారిఫ్ షాక్ షార్ట్ టర్మ్‌లో ఇండియన్ ఎగుమతిదారులకు కష్టమే. ముఖ్యంగా కార్ల, టెక్స్‌టైల్ రంగాల్లో మార్జిన్ ప్రెజర్ తప్పదు. కానీ ఇదే సమయంలో, ఇండియా తన ఎగుమతి మ్యాప్‌ను రీడ్రా చేసుకునే, US–లాటిన్ మార్కెట్లో నేరుగా డీప్‌గా ప్రవేశించే, అలాగే మెక్సికోతో ఒప్పందాల ద్వారా “న్యూ నార్మల్” సెట్ చేసే అవకాశం కూడా ఉంది. ఇండియా ఇప్పుడు గ్లోబల్ స్టేజ్‌పై “మాతో ట్రేడ్ చెయ్యాలంటే రూల్స్ ఫెయిర్‌గా ఉండాలి; లేకుంటే మేమూ మా మార్గం చూసుకుంటాం” అనే మెసేజ్‌ను స్పష్టంగా వినిపిస్తోంది.
