Dried shrimp ఎండు రొయ్యలు తింటే ఇన్ని ఉపయోగాలా? తెలిస్తే అస్సలు వదలిపెట్టరు..

Dried shrimp 100 గ్రాముల ఎండు రొయ్యలలో సుమారు 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Dried shrimp

సాధారణంగా మనం మాంసాహారంలో ప్రోటీన్ కోసం ఎక్కువగా మటన్, చికెన్ లేదా గుడ్లను తింటాం. కానీ, తక్కువ ఖర్చుతో, రుచితో పాటు లెక్కలేనన్ని పోషకాలను అందించే మరొక అద్భుతమైన ఆహారం ఉంది. అదే సముద్రపు సంపదైన ఎండిన రొయ్యలు. ఒకవేళ మీరు వీటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే, వెంటనే వీటిని మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకుంటారని అంటున్నారు నిపుణులు.

ఎండు రొయ్యలు(dried shrimp) ప్రోటీన్‌కు ఒక గొప్ప వనరు. 100 గ్రాముల ఎండు రొయ్యలలో సుమారు 60 నుంచి 80 గ్రాముల ప్రోటీన్ లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అధిక ప్రోటీన్ కండర ద్రవ్యరాశిని మెరుగుపరచడంలో, శరీర కణాల నిర్మాణానికి, గాయాలను త్వరగా నయం చేయడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది పిల్లల పెరుగుదలకు, పోషకాహార లోపం ఉన్నవారికి మంచి బలాన్ని ఇస్తుంది.

dried shrimp

ప్రోటీన్ మాత్రమే కాదు, ఎండు రొయ్య(dried shrimp)ల్లో మన శరీరానికి అత్యవసరమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, జింక్, సెలీనియం, అయోడిన్, రాగి, మాంగనీస్ , సోడియం వంటివి శరీరానికి కావలసిన శక్తిని అందిస్తాయి. ముఖ్యంగా, ఇందులో ఉండే అయోడిన్ థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. అలాగే, సెలీనియం క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అధ్యయనాలు సూచించాయి.

ఎండు రొయ్యలు(dried shrimp) బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఒక మంచి ఎంపిక. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేయడంతో పాటు, శరీరంలో వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండు రొయ్యల్లో ఉండే జింక్ , ఇతర పోషకాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ లెక్కలేనన్ని పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఎండిన రొయ్యలు నిజంగా ఒక అద్భుతమైన ఆహారం కాబట్టి నాన్ వెజ్ లవర్స్ వీలయినంత ఎక్కువగా వీటిని మెనూలో యాడ్ చేసుకోండి.

Breakfast: రూ.5కే బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్..ఎప్పటి నుంచి అమలవుతుందో తెలుసా?

Exit mobile version