Rakhi: రక్షాబంధన్ తర్వాత రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి?

Rakhi:రాఖీని ఎన్ని రోజులకు తీసివేయాలనేది వ్యక్తిగత నమ్మకాలు, పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటుంది.

Rakhi

రక్షాబంధన్ రోజున సోదరి తన సోదరుడికి కట్టే రాఖీ (Rakhi)కేవలం ఒక దారం మాత్రమే కాదు, అది వారి మధ్య ఉండే ప్రేమ, నమ్మకం, గౌరవానికి ప్రతీక. ఈ పండుగను భక్తితో, ఉత్సాహంగా జరుపుకొంటారు. అయితే, రాఖీ కట్టించుకున్న తర్వాత(Rakhi after festival) దానిని తీసేయడం విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ పడేయడం సరైనదేనా? రాఖీని ఎన్ని రోజుల వరకు ఉంచుకోవచ్చు? తీసేసిన తర్వాత ఏమి చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.

రాఖీని ఎన్ని రోజులకు తీసివేయాలనేది వ్యక్తిగత నమ్మకాలు, పరిస్థితుల బట్టి ఆధారపడి ఉంటుంది. అయినా కూడా మతపరమైన, శాస్త్రీయ కోణంలో కొన్ని నియమాలు, నమ్మకాలు ఉన్నాయంటారు పెద్దలు.

Rakhi

రాఖీని తీసివేయడానికి ఒక కచ్చితమైన సమయం అంటూ ఏమీ లేదు. కానీ, శ్రావణ పూర్ణిమ నుంచి శ్రావణ అమావాస్య వరకు, అంటే సుమారు 15 రోజుల పాటు రాఖీని ఉంచుకోవచ్చని పండితులు చెబుతారు. కొంతమంది అది ఊడిపోయేవరకూ ఉంచుతారు. అది వారి బంధానికి,ప్రేమకు నిదర్శనంగా భావిస్తారు.

కొందరు తమ నమ్మకాల ప్రకారం 3, 7 లేదా 11 రోజుల తర్వాత తీసివేస్తారు. చాలామంది జన్మాష్టమి లేదా గణేష్ చతుర్థి రోజున రాఖీని తీస్తారు. అయితే, కనీసం 24 గంటల పాటు చేతిలో ఉంచుకోవడం మంచిదని చెబుతారు. పితృ పక్షం ప్రారంభానికి ముందే రాఖీని తప్పకుండా తీసివేయాలి.

Rakhi

శాస్త్రీయ కోణం నుంచి చూస్తే, రాఖీని ఎక్కువ రోజులు చేతిలో ఉంచుకోవడం మంచిది కాదు. రాఖీ సాధారణంగా నూలు లేదా పట్టు దారంతో తయారు చేస్తారు. దీనిపై నీరు, దుమ్ము పడటం వల్ల మురికిగా మారి, బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, రాఖీని శుభ్రంగా ఉన్నంతవరకు ఉంచుకుని, ఆ తర్వాత తీసివేయడం మంచిది.

అయితే రాఖీ ఒక పవిత్రమైన బంధాన్ని సూచిస్తుంది కాబట్టి, దానిని పవిత్రంగానే చూడాలి. తీసేసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. తీసివేసిన రాఖీని ఒక పవిత్రమైన దారంలా భావించి, దానిని పారే నీటిలో వేయాలి. అలాగే, చెట్టు కొమ్మలకు కట్టవచ్చు లేదా మొక్కలు ఉన్న మట్టిలో ఉంచవచ్చు. ఇది రాఖీకి ఇచ్చే గౌరవంగా భావిస్తారు.

Rakhi

 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలు, సంప్రదాయాల ఆధారంగా మాత్రమే ఉంటుంది. దయచేసి ఏదైనా నమ్మకాన్ని పాటించే ముందు మీ కుటుంబ పెద్దలను లేదా సంబంధిత నిపుణులను సంప్రదించండి.

 

Exit mobile version