Khajjiar:మన దేశంలో మినీ స్విట్జర్లాండ్ ఉందని తెలుసా? ఈ అందాలను చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే!

Khajjiar: శీతాకాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి వెండి కొండలా మెరిసిపోయే ఖజ్జియార్‌ ప్రాంతం.. వేసవిలో మాత్రం పచ్చదనంతో నిండిపోయి కళ్లకు కనువిందు చేస్తుంది.

Khajjiar

హిమాచల్ ప్రదేశ్ లోని చంబా జిల్లాలో ఉన్న ఖజ్జియార్‌ను (Khajjiar) .. భారత దేశపు మినీ స్విట్జర్లాండ్ అని పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 6500 అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్రదేశం ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన గమ్యస్థానంగా చెబుతారు.

చుట్టూ దట్టమైన దేవదారు వృక్షాలు, మధ్యలో పచ్చని మైదానం..అంతేనా ఆ మైదానం మధ్యలో ఒక చిన్న సరస్సు.. ఈ దృశ్యం చూస్తుంటే మనం ఏదో విదేశంలో ఉన్నామనే అనుభూతి ప్రతీ ఒక్కరికీ కలుగుతుంది.

Khajjiar

ఇక్కడి వాతావరణం ఏడాది పొడవునా ఆహ్లాదకరంగా ఉంటుంది. శీతాకాలంలో ఈ ప్రాంతమంతా మంచుతో కప్పబడి వెండి కొండలా మెరిసిపోయే ఈ ప్రాంతం.. వేసవిలో మాత్రం పచ్చదనంతో నిండిపోయి కళ్లకు కనువిందు చేస్తుంది.

ఖజ్జియార్ లో పారాగ్లైడింగ్, హార్స్ రైడింగ్ , జోర్బింగ్ వంటి సాహస క్రీడలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి. ఇక్కడ ఉన్న ఖజ్జీ నాగ్ ఆలయం చాలా పురాతనమైనది. దీనికి ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంది.

అంతేకాదు ట్రెక్కింగ్ ఇష్టపడే వారికి ఇక్కడి కొండలు మంచి అనుభవాన్ని ఇస్తాయి. డల్ హౌసీ నుంచి కేవలం 24 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ప్రదేశం ఫ్యామిలీ ట్రిప్స్‌కి ఎంతో అనువైనది. ఇక్కడి ప్రశాంతత, పక్షుల కిలకిల రావాలు మనసులోని అలసటను పూర్తిగా పారద్రోలుతాయి.

రద్దీగా ఉండే నగర జీవితం నుంచి దూరంగా ప్రకృతి ఒడిలో గడపాలనుకునే వారికి ఖజ్జియార్ ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. తక్కువ ఖర్చుతో స్విట్జర్లాండ్ లాంటి అనుభూతిని పొందాలంటే ఖజ్జియార్ వెళ్లాల్సిందే.

Braille:లూయిస్ బ్రెయిలీ లిపికి 200 ఏళ్లు.. ఎన్నో జీవితాలను మార్చిన ఆరు చుక్కల అద్భుతం

Exit mobile version