Quiet Quitting
కార్పొరేట్ ప్రపంచంలో క్వైట్ క్విట్టింగ్(Quiet Quitting) అనే పదం చాలా తరచుగా వినిపిస్తూ ఒక కొత్త చర్చకు దారితీస్తోంది. చాలా మంది దీనిని ఉద్యోగానికి రిజైన్ చేయడం అని అనుకుంటారు. కానీ నిజానికి ఇది పని పట్ల చూపే ఒక రకమైన వ్యతిరేకత అన్నమాట.
అంటే ఆఫీసులో తమకు కేటాయించిన పనిని మాత్రమే పూర్తి చేసి, అంతకు మించి ఒక్క పని కూడా చేయకపోవడమే ఈ మెంటాలిటీ మెయిన్ ఉద్దేశ్యం. గతంలో ఉద్యోగులు ప్రమోషన్ల కోసం లేదా గుర్తింపు కోసం ఎక్స్ట్రా అవర్స్ పనిచేయడం, కొత్త బాధ్యతలు తీసుకోవడం చేసేవారు.
కానీ ఇప్పుడు మారుతున్న కాలంలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పేరుతో, కంపెనీపై ఉన్న వ్యతిరేకతను తెలియజేయడానికి కేవలం జీతానికి తగ్గట్టుగా మాత్రమే పనిచేస్తున్నారు. మిగిలిన సమయాన్ని తమ పర్సనల్ లైఫ్ కోసం కేటాయిస్తున్నారు. దీనినే నిపుణులు సైకలాజికల్ గా నిశ్శబ్ద నిష్క్రమణ లేదా క్వైట్ క్విట్టింగ్(Quiet Quitting) అని పిలుస్తున్నారు.
అయితే ఈ పద్ధతి వల్ల దీర్ఘకాలంలో కెరీర్ కొంత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. ఒక కంపెనీలో కెరీర్ గ్రోత్ కావాలనుకునే వారు ఇలా ఉండకూడదు. ఒక ఉద్యోగి కేవలం చెప్పిన పనికే పరిమితం అవుతారో, అప్పుడు మేనేజ్మెంట్ దృష్టిలో పడరు.
కంపెనీలో తొలగింపులు (Layoffs) వంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఇలాంటి వారి పైనే మొదటి వేటు పడే అవకాశం ఉంటుంది. అలాగే కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన కూడా ఆటోమేటిక్‌గా తగ్గడం వల్ల వృత్తిపరమైన స్కిల్స్ మరుగున పడిపోతాయి.
కాబట్టి జాబ్ పట్ల విరక్తి పెరిగినప్పుడు అక్కడే ఉండి ఇలా క్వైట్ క్విట్టింగ్ చేయడం కంటే.. నిశ్శబ్దంగా బయటకు వచ్చేయడం మంచిది. మనకు నచ్చిన ఫీల్డ్‌ను ఎంచుకోవడం అయినా చేయాలి. లేదంటే పని ఒత్తిడిపై , శాలరీ విషయాల గురించి పై అధికారులతో చర్చించాలి. బర్న్ అవుట్ నుంచి తప్పించుకోవడానికి హద్దులు విధించుకోవాలి కానీ, అది మీ కెరీర్ గ్రోత్‌ను అడ్డుకోకుండా జాగ్రత్త పడాలి.
