Rakhi : ఈ ఆగస్టు 9న.. ఏ టైంలో రాఖీ కడితే మంచిది?

Rakhi : అన్నాచెల్లెళ్ల , అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక.. రక్షాబంధన్ అని చెబుతారు.

Rakhi : అన్నాచెల్లెళ్ల , అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక.. రక్షాబంధన్ అని చెబుతారు. ఈ పండుగ శ్రావణ పౌర్ణమి రోజున వస్తుంది. రాఖీ అంటే కేవలం దారం కాదు, అది ప్రేమకు, రక్షణకు గుర్తు. అక్కాచెల్లెళ్లు తమ అన్నదమ్ముల చేతికి కట్టే రాఖీ .. వాళ్ల ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కోరుకునే ఓ అపురూప వారధి . అలాగే సోదరీమణులకు తోడుగా, అండగా ఉంటామని చెప్పే ఒక బంధం. ఈసారి ఆగస్టు 9న రాఖీ పండుగ వచ్చింది. మరి ఈసారి ఆరోజు ఏ సమయంలో రాఖీ(Rakhi ) కట్టాలన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి.

Rakhi

శ్రావణ మాసం వచ్చిందంటే చాలు.. ఫెస్టివల్ వైబ్స్ స్టార్ట్ అయినట్లే. ఈ నెలలో వచ్చే పండుగల్లో రాఖీ పండుగ స్పెషల్. ఇంట్లో అక్కచెల్లెళ్లు అన్నదమ్ముల చేతికి రాఖీ కట్టడానికి రెడీ అవుతారు. ప్రతి సంవత్సరం ఈ రాఖీ పౌర్ణమి(Shravana Purnima) కోసం తోబుట్టువులు ఎంతగానో ఎదురుచూస్తారు. ఎంత దూరం ఉన్నా అన్నదమ్ములు ఇంటికి వచ్చి, ఈ బంధాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. చిన్నపిల్లల్లా మారి, ఒకరికొకరు రాఖీ కట్టుకుంటూ, సుఖసంతోషాలతో ఉండాలని ఆశీర్వదిస్తారు.

ఈ ఏడాది, ఆగస్టు 9న రాఖీ పౌర్ణమి వస్తుంది. పండితులు చెప్పిన ప్రకారం, శ్రావణ నక్షత్రం మధ్యాహ్నం వరకు ఉంటుంది కాబట్టి, తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రాఖీ కట్టడానికి మంచి ముహూర్తం(Auspicious Time) అని చెబుతున్నారు. ఈ సమయం దాటితే రాఖీ కట్టడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, పౌరాణిక కథల ప్రకారం.. రాక్షసి శూర్పణఖ తన అన్నయ్య రావణుడికి అశుభ సమయంలో రాఖీ కట్టడం వల్లే అతను తన సామ్రాజ్యాన్ని కోల్పోయాడని చెబుతారు.

ఆ రోజు సోదరీమణులు తమ సోదరుడికి రక్షా దారాన్ని కట్టి, ఎల్లప్పుడూ తనను కాపాడమని కోరుకుంటారు. పూజ విధి ఎలా చేయాలంటే: ముందుగా మీ తమ్ముడు లేదా అన్నయ్యను తూర్పు దిక్కుగా కూర్చోబెట్టండి. ఆ తర్వాత నుదుట తిలకం పెట్టి..కొద్దిగా అక్షింతలు తలపై వేయండి. దీపం వెలిగించి, సోదరునికి హారతి ఇవ్వండి. ఆ తర్వాత రక్షా బంధనాన్ని (రాఖీని) చేతికి కట్టి, ఏదైనా స్వీట్ తినిపించండి. మీరు అక్క అయితే తమ్ముడిని ఆశీర్వదించండి. చెల్లెలు అయితే అన్నయ్య నుంచి ఆశీర్వాదం తీసుకోండి.

ఈ రక్షా బంధన్ పండుగ మీ ఇంట్లో ఆనందం, ప్రేమను నింపాలని కోరుకుంటున్నాం. అందరికీ ముందుగానే హ్యాపీ రక్షాబంధన్.

Exit mobile version