Rakhi: రాశి ప్రకారం మీ సోదరుడికి ఏ రంగు రాఖీ కట్టాలి?

Rakhi: మీ సోదరుడి రాశికి అనుగుణంగా రంగు(Rakhi colors)ను ఎంచుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు.

Rakhi

పండుగల నెల అయిన శ్రావణ మాసంలో ముఖ్యమైన పండుగలలో రక్షాబంధన్ ఒకటి. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను కొన్ని నియమాలు పాటిస్తూ జరుపుకుంటే జీవితాంతం ఆనందం, ఐక్యత ఉంటాయని పండితులు చెబుతున్నారు. రాఖీ పండుగ సందర్భంగా పాటించాల్సిన ముఖ్య నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.

మార్కెట్‌లో రకరకాల డిజైన్లలో, రంగుల్లో రాఖీలు లభిస్తుంటాయి. అయితే రాఖీ ఎంపికలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. దేవుళ్ల చిత్రాలు ఉన్న రాఖీలను ఎంచుకోకూడదని పండితులు చెబుతున్నారు. అలాంటి రాఖీ కట్టుకున్న చేతితో కొన్నిసార్లు చేయకూడని పనులు చేసినప్పుడు అది అపశకునంగా భావించబడుతుంది. అందువల్ల సాధారణ డిజైన్‌లలో ఉండే రాఖీలను ఎంచుకోవడం మంచిది.

మీ సోదరుడి రాశికి అనుగుణంగా రంగు(Rakhi colors)ను ఎంచుకుంటే శుభ ఫలితాలు లభిస్తాయని చెబుతారు. మేషం, వృశ్చికం రాశివారికి ఎరుపు రంగు, వృషభం, మకరం, కుంభం రాశుల వారికి నీలం రంగులో రాఖీ, మిథునం, కన్య రాశులవారికి ఆకుపచ్చ రంగులో రాఖీ కడితే మంచిది.

Rakhi

అలాగే కర్కాటకం, తుల రాశులవారికి తెలుపు లేదా లేత నీలం రంగులో, సింహ రాశివారికి ఆరెంజ్ కలర్లో ఇక ధనుస్సు, మీన రాశుల వారికి పసుపు రంగు రాఖీ కడితే మంచిది.

రాఖీ కట్టే(Raksha Bandhan) సమయంలో పాటించాల్సిన కొన్ని నియమాలు కొన్ని ఉంటాయని..అవి తప్పక పాటించాలని పండితులు చెబుతారు.ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు సోదరుడు తూర్పు లేదా ఉత్తర దిశలో కూర్చోవాలి. సోదరి అతడికి అభిముఖంగా ఉండాలి.

ఈ వేడుకను పూజ గది సమీపంలో జరుపుకోవడం వల్ల దైవ అనుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. ఇది ఇంట్లో సానుకూల వాతావరణాన్ని, మానసిక శాంతిని పెంచుతుంది.

Rakhi

ఈ నియమాలను పాటించడం ద్వారా అన్నాచెల్లెళ్ల, అక్కా తమ్ముళ్ల బంధం మరింత బలపడి, జీవితాంతం సంతోషంగా ఉంటారని నమ్మకం. ఈ పండుగ రోజున సోదరీమణులు పుట్టింటికి వచ్చి ఇంట్లో సంతోషాన్ని, ఉత్సాహాన్ని నింపుతారు.

 

Exit mobile version