D.K. Shivakumar : సీఎం రేసు నుంచి తగ్గిన డి.కె.శివకుమార్..సిద్ధరామయ్యకే పూర్తి ఐదేళ్లు

D.K. Shivakumar : ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కానుండటంతో, డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మంత్రులు నాయకత్వ మార్పు జరగాల్సిందేనంటూ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చారు.

D.K. Shivakumar

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో కొన్ని నెలలుగా గరంగరంగా ఉన్న నాయకత్వ మార్పు, అధికార పంపిణీ వ్యవహారంపై ప్రస్తుతానికి తెరపడినట్లు కనిపిస్తోంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పూర్తి ఐదేళ్ల పదవీకాలాన్ని కొనసాగిస్తానని బలంగా ప్రకటించడం, దీనికి ప్రతిగా ఉపముఖ్యమంత్రి డి.కె. శివకుమార్(D.K. Shivakumar) ఆయనకు సహకరిస్తానని స్పష్టం చేయడంతో, కాంగ్రెస్ శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠ ప్రస్తుతానికి సద్దుమణిగినట్లు అయ్యింది.

అధికార పంపిణీ వివాదం ఎందుకు మొదలైంది?.. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, సిద్ధరామయ్య , డి.కె. శివకుమార్‌ల మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం తీవ్ర పోటీ నెలకొంది. అంతిమంగా, సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్ ఉపముఖ్యమంత్రిగా , కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌గా (KPCC Chief) కొనసాగడానికి అధిష్టానం ఒక ‘ఫార్ములా’ను అమలు చేసింది. ఈ ఫార్ములాలో, ఐదేళ్ల పాలనలో రెండున్నరేళ్లు ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి పగ్గాలు డీకే శివకుమార్‌(D.K. Shivakumar)కు అప్పగించవచ్చనే అంతర్గత ఒప్పందం ఉన్నట్లు విస్తృతంగా ప్రచారం జరిగింది.

ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి కానుండటంతో, డీకే శివకుమార్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు , మంత్రులు నాయకత్వ మార్పు జరగాల్సిందేనంటూ డిమాండ్‌ను తెరమీదకు తీసుకొచ్చారు.

D.K. Shivakumar

ఈ వ్యవహారం నడుస్తున్న క్రమంలో, ఇందిరా గాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడిన డీకే శివకుమార్, తాను కర్ణాటక కాంగ్రెస్ చీఫ్‌ పదవిలో శాశ్వతంగా ఉండలేనని అనడం ఈ చర్చకు మరింత హీట్ పెంచింది. ఆయన మద్దతుదారులు ఢిల్లీకి వెళ్లి, డీకే శివకుమార్‌కు సీఎం పగ్గాలు అప్పగించాలని అధిష్టానంపై ఒత్తిడి కూడా తెచ్చారు.

ఈ రాజకీయ డ్రామా తారాస్థాయికి చేరుకున్న సమయంలో, ఇటు సిద్ధరామయ్య, అటు డీకే శివకుమార్ (D.K. Shivakumar)వర్గాలు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలైన మల్లికార్జున ఖర్గే , రాహుల్ గాంధీలతో భేటీ అయ్యారు.

అక్కడ ఏం చర్చలు జరిగాయో తెలియదు కానీ.. సిద్ధరామయ్య ఈ భేటీ తర్వాత ఐదేళ్లు తానే సీఎంగా కొనసాగుతానని స్పష్టం చేశారు. అంతేకాకుండా, ఆయన కేబినెట్ విస్తరణ కోసం అధిష్టానం నుంచి అనుమతి కోరారు. ఇది మరో ఏడాదిన్నర పాటు తన పదవి సురక్షితమని భావించడానికి ఆయనకు బలం చేకూర్చింది.

సిద్ధరామయ్య ప్రకటన వెలువడిన వెంటనే, డీకే శివకుమార్ (D.K. Shivakumar)ఎటువంటి అసంతృప్తిని ప్రదర్శించకుండా, ముఖ్యమంత్రికి తామంతా సహకరిస్తామని తేల్చి చెప్పడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇంతకుముందు ఎక్కడ కృషి ఉంటుందో అక్కడే ఫలితం ఉంటుంది అంటూ ఆయన చేసిన ‘మర్మమైన ట్వీట్’ వెనుక ఉన్న ఉద్దేశంపై చర్చ జరిగినా, ఆయన తాజా ప్రకటనతో ప్రస్తుతానికి వివాదం సమసిపోయినట్లుగా కనిపిస్తోంది.

అయితే, డీకే శివకుమార్(D.K. Shivakumar) వర్గం నాయకత్వ మార్పు డిమాండ్‌కు పూర్తిగా ఒప్పుకుంటుందా, లేక రాబోయే రోజుల్లో మళ్లీ అసంతృప్తి జ్వాలలు రగులుతాయా అన్నది రాజకీయ పరిశీలకుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతానికి మాత్రం కర్ణాటక రాజకీయ వాతావరణం కూల్ అయినట్లు కనిపిస్తోంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version