Place
ఫ్రెంచ్ స్టైల్‌ను ఇష్టపడేవాళ్లకు, బీచ్ పక్కన నిశ్శబ్దంగా గడపాలనుకునేవాళ్లకు పాండిచ్చేరి (Puducherry) ఒక అద్భుతమైన ప్రదేశం(Place). ఇది మన దేశంలో ఉన్నా, ఫ్రాన్స్‌లో ఉన్నట్టుగా ఒక కొత్త ఫీలింగ్ ఇస్తుంది. ఈ చిన్న కేంద్రపాలిత ప్రాంతాని(Place)కి ఉన్న ప్రత్యేకత ఏమిటంటే, ఫ్రెంచ్ సంస్కృతి ఇక్కడ ఇంకా సజీవంగా ఉంది.
పాండిచ్చేరిని రెండుగా విభజించవచ్చు.. ఒకటి ఫ్రెంచ్ క్వార్టర్ (French Quarter), ఇంకొకటి తమిళ క్వార్టర్ (Tamil Quarter). ఫ్రెంచ్ క్వార్టర్‌ని ‘వైట్ టౌన్’ అని కూడా అంటారు. ఇక్కడి రోడ్ల పక్కన పసుపు, తెలుపు రంగుల్లో ఉండే భవనాలు, అందమైన గులాబీ పూల తోటలు, స్టైలిష్ కేఫ్‌లు చూస్తే, మనం వేరే దేశంలోకి వచ్చామా అనిపిస్తుంది. ఇక్కడి రోడ్లకు ‘రూ డెస్ మారిన్స్’ (Rue des Marines) లాంటి ఫ్రెంచ్ పేర్లు ఉంటాయి. ఈ ప్రాంతంలో నడవడం ఒక మంచి అనుభూతిని ఇస్తుంది.
మరోవైపు ఉన్న తమిళ క్వార్టర్‌లో మన సంప్రదాయ ఇళ్లు, రంగు రంగుల అలంకరణలు, సువాసనతో కూడిన వీధులు కనిపిస్తాయి. ఈ రెండూ కలిసే ఒకే చోట ఉండటం వల్ల పాండిచ్చేరి ఒక ప్రత్యేకమైన కల్చరల్ మిక్స్ లా అనిపిస్తుంది.
పాండిచ్చేరిలో చూడాల్సిన వాటిలో ముఖ్యమైనది ప్యారడైజ్ బీచ్ (Paradise Beach). ఇక్కడికి ఫెర్రీలో వెళ్లాలి. ఇసుక చాలా తెల్లగా, నీళ్లు చాలా నీలంగా ఉంటాయి. ఇక్కడ అలలు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి. ఇక ముఖ్యమైనది ప్రొమినేడ్ బీచ్ (Promenade Beach). ఇక్కడ సాయంకాలం వాహనాలను అనుమతించరు. దాంతో ప్రజలు నడుచుకుంటూ, ఐస్ క్రీములు తింటూ, సముద్రాన్ని చూస్తూ గడుపుతారు. సముద్రం పక్కన ఉన్న ఫ్రెంచ్ స్టైల్ భవనాలు సాయంత్రం వేళ చాలా అందంగా కనిపిస్తాయి.
పాండిచ్చేరి వెళితే, ఆరోవిల్ (Auroville) ను తప్పకుండా చూడాలి. ఇది ఒక అంతర్జాతీయ పట్టణం. ఇక్కడ కులం, మతం, ప్రాంతం లేకుండా ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు కలిసి జీవిస్తారు. ఇక్కడ మధ్యలో ఉండే మాతృమందిర్ (Matrimandir) గోల్డెన్ గోళం ఆకృతిలో ఉంటుంది. దీని లోపల చాలా నిశ్శబ్దంగా మెడిటేషన్ చేసుకోవచ్చు. దీనిని ప్రశాంతతకు, మానవ ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. పాండిచ్చేరిలో ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. ఫ్రెంచ్ బేకింగ్, ఇండియన్ మసాలాలు కలిపి చేసే వంటకాలు ఇక్కడ స్పెషల్.
మొత్తంగా పాండిచ్చేరి అనేది బీచ్, కల్చర్, ప్రశాంతత, మంచి ఫుడ్ అన్నీ కోరుకునే వాళ్లకు చాలా బాగా నచ్చే టూరిస్ట్ స్పాట్.
