Citizenship: పౌరసత్వానికి బై చెప్పేస్తున్న భారతీయులు..ఎందుకిలా?

Citizenship: 2020 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో సుమారు 8.97 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని అధికారికంగా వదులుకున్నారు.

Citizenship

మన భారతదేశంలో ఇప్పుడు డేటా (Data) చూసినా, యువత మైండ్‌సెట్ (Youth Mindset) చూసినా ఒక సీరియస్ వార్నింగ్ సిగ్నల్ (Serious Warning Signal) కనిపిస్తోంది. అది ఏంటంటే, భారతీయులు పెద్ద ఎత్తున పౌరసత్వం (Citizenship) వదులుకోవడం. కేంద్ర విదేశాంగ శాఖ (MEA) లెక్కల ప్రకారం, 2020 నుంచి 2024 మధ్య ఐదేళ్లలో సుమారు 8.97 లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని అధికారికంగా వదులుకున్నారు.

2011 నుంచి 2024 వరకు చూస్తే, ఏకంగా 20 లక్షలకు పైగా ఇండియన్ పాస్‌పోర్ట్‌లు రద్దు అయ్యాయి. అంటే, ఈ కాలంలో రోజుకు సగటున 400 మందికి పైగా ఇండియన్ సిటిజన్(Citizenship) అనే ట్యాగ్‌ను వదిలేశారు. 2024 ఒక్క సంవత్సరంలోనే 2,06,378 మంది పౌరసత్వం వదిలేశారు. ఇది నెలకు దాదాపు 13,000, గంటకు 15 నుంచి 20 మంది లెక్క. ఈ వేగం మన దేశం దృష్టి సారించాల్సిన అతి ముఖ్యమైన అంశం.

ఈ నిర్ణయం ఎక్కువగా పర్సనల్ చాయిస్ (Personal Choice) అని ప్రభుత్వం చెబుతున్నా, ఆ ఎంపిక వెనుక కొన్ని క్లియర్ ట్రెండ్‌లు (Clear Trends) ఉన్నాయి. ప్రధాన సమస్య ఏమిటంటే, భారత్‌లో డ్యూయల్ సిటిజన్‌షిప్ (Dual Citizenship) లేదు. అందుకే వేరే దేశపు పౌరసత్వం తీసుకోవాలంటే, భారత పౌరసత్వాన్ని తప్పనిసరిగా వదులుకోవాలి.

చాలా మంది విదేశాలకు వెళ్లడానికి, అక్కడి పౌరసత్వం తీసుకోవడానికి బలమైన కారణాలు ఉన్నాయి. ఉద్యోగాలు, ఆర్థిక భద్రత.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, న్యూజిలాండ్‌ వంటి దేశాల్లో హై పే (High Pay), స్టేబుల్ జాబ్స్ (Stable Jobs), పర్మనెంట్ రెసిడెన్సీ, పెన్షన్, సోషల్ సెక్యూరిటీ (Social Security) వంటి బెనిఫిట్స్ అందుబాటులో ఉండటం యువతను బాగా ఆకర్షిస్తోంది.

లైఫ్‌స్టైల్, పబ్లిక్ సర్వీసుల.. మెరుగైన హెల్త్‌కేర్ (Healthcare), ఎడ్యుకేషన్ (Education), పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, మొత్తం లివింగ్ స్టాండర్డ్స్ కోసం చాలా మంది “ఆ దేశం నా హోమ్‌ (Home) అయ్యింది” అని ఫీలై సిటిజన్‌షిప్ మార్చుకుంటున్నారు.

వీసా ఫ్రీ ట్రావెల్ (Visa Free Travel).. ఇండియన్ పాస్‌పోర్ట్‌తో పోలిస్తే పాశ్చాత్య దేశాల పాస్‌పోర్ట్‌లతో ఎక్కువ దేశాలకు వీసా ఫ్రీ లేదా ఇ-వీసా సౌలభ్యం ఉండటం, బిజినెస్, స్టడీస్, టూరిజం కోసం ఈ అంశం చాలా ఇంపార్టెంట్‌గా మారింది.

దేశీయ నెగటివ్ ఫాక్టర్లు.. నిరుద్యోగం (Unemployment), స్కిల్‌కు తగ్గ జాబ్ లేకపోవడం, సిస్టమిక్ రెడ్ టేప్ (Red Tape), కొన్ని ప్రాంతాల్లో సామాజిక–రాజకీయ టెన్షన్‌లు, ఫ్రీడమ్, సేఫ్టీపై అనుమానాలు వంటి అంశాలు కొంతమందిని బయటకు నెట్టుతున్నాయి.

ఈ మైండ్‌సెట్ రూపుదిద్దుకోవడానికి లోతైన కారణాలు కుటుంబంలోనే ఉన్నాయి. ఎన్ఆర్ఐల (NRIs), గల్ఫ్–అమెరికా సెటిల్‌మెంట్ కథలు ప్రతి కుటుంబంలో ఒక సక్సెస్ మోడల్ (Success Model) లా కనిపిస్తున్నాయి. ఇక్కడ కష్టపడి 20 ఏళ్లు,అక్కడ 5–10 ఏళ్లలో సెటిల్ అన్న భావన బలపడింది.

విదేశాల్లో చదవడానికి వెళ్లిన చాలా మంది స్టూడెంట్ వీసా , వర్క్ వీసా ,పీఆర్ , సిటిజన్‌షిప్ అనే క్లియర్ ట్రాక్‌నే లక్ష్యంగా పెట్టుకుని వెళ్తున్నారు. మిడిల్ క్లాస్ దృష్టిలో ఇక్కడ అనిశ్చితి (Uncertainty), అక్కడ స్పష్టమైన రూల్స్–పాలసీలు అన్న కంపారిజన్ (Comparison) ఎప్పటికప్పుడు జరుగుతోంది. హై ట్యాక్స్ అయినా, ఎక్స్‌చేంజ్ రేట్, సేవింగ్స్, సోషల్ బెనిఫిట్స్ చూసి వారు లాభంగా భావిస్తున్నారు.

ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే, భవిష్యత్‌లో దేశానికి బ్రెయిన్ డ్రెయిన్ (Brain Drain) సమస్య మరింత పెరుగుతుంది. టాలెంట్, స్కిల్డ్ (Skilled) మానవశక్తిని మనం కోల్పోతాం. హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకుని, స్కిల్స్ డెవలప్ చేసుకున్న బలమైన వర్గం బయటికి పోతే, స్కిల్డ్ ఇండస్ట్రీల గ్రోత్ స్లో అయ్యే ప్రమాదం ఉంది.

Citizenship

యువ ఆరోగ్యకర వర్గం బయటికి వెళ్లి, లోపల వృద్ధుల వాటా పెరిగితే, ఇన్నోవేషన్ (Innovation), స్టార్టప్ ఎకోసిస్టంపై కూడా ప్రభావం పడుతుంది. పెద్ద సంఖ్యలో పౌరసత్వం వదిలేయడం దేశంలో పాలన, అవకాశాలు, సిస్టమ్స్‌పై ఒక రకమైన నమ్మక లోపాన్ని సూచించే సిగ్నల్‌గా గ్లోబల్‌గా చూడబడే ప్రమాదం కూడా ఉంది.

ప్రభుత్వం చేయాల్సిన కీలక పనులు..ప్రస్తుతం ప్రభుత్వం పౌరసత్వం మార్చుకోవడం వ్యక్తిగత నిర్ణయం అని చెప్తున్నా, ఈ డేంజర్ సిగ్నల్‌కి చెక్ పెట్టాలంటే కొన్ని సీరియస్ పాలసీ స్టెప్పులు (Policy Steps) అవసరం.

దేశంలోనే వరల్డ్‌క్లాస్ అవకాశాలు.. హైటెక్, రీసెర్చ్, ఆరోగ్యం, ఉన్నత విద్య, డీప్‌టెక్ స్టార్టప్స్‌లో గ్లోబల్ లెవల్ ప్యాకేజీలు, ఫెసిలిటీస్ ఇస్తే ఇక్కడే ఉండాలి అనిపించే టాలెంట్ నిలుస్తుంది. స్కిల్డ్ ఉద్యోగాల సృష్టి (Job Creation), ఫ్లెక్సిబుల్ లేబర్ పాలసీలు బ్రెయిన్ డ్రెయిన్‌ తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

సిస్టమ్‌(Citizenship)పై నమ్మకం పెంచడం.. వ్యాపారం ప్రారంభించడానికి, ఇన్నోవేషన్ చేయడానికి, ప్రాపర్టీ, ట్యాక్స్, లీగల్ వ్యవస్థలలో క్లీన్, ఫాస్ట్, ట్రాన్స్‌పరెంట్ (Transparent) ప్రాసెస్‌లు ఉంటే బయటికెళ్లే సైకాలజీ తగ్గుతుంది. లా & ఆర్డర్, ఫ్రీడమ్, సోషల్ హార్మనీ (Social Harmony)పై క్లియర్ మెసేజ్ ఇవ్వడం ముఖ్యం.

డయాస్పోరా (Diaspora)ను వాడుకోవడం.. పౌరసత్వం (Citizenship)వదిలేసినా, ఆర్థిక–సాంస్కృతిక బంధం కొనసాగేలా O.C.I, డయాస్పోరా బాండ్స్ (Diaspora Bonds), స్పెషల్ ఇన్వెస్ట్‌మెంట్ రూట్లు పెంచితే, వెళ్లిన వాళ్లు కూడా భారత్ గ్రోత్‌లో భాగమవుతారు. విదేశాల్లో చదివి తిరిగి వచ్చేవారికి ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇవ్వడం ద్వారా గ్లోబల్ ఎక్స్‌పోజర్ + దేశ సేవ రెండూ కలిపే ట్రాక్ క్రియేట్ చేయొచ్చు.

ఓవరాల్‌గా, పౌరసత్వం వదిలేయడం ఒక వ్యక్తి లెవెల్‌లో బెటర్ లైఫ్ కోసం తీసుకున్న టఫ్ నిర్ణయం.. కానీ ఇంత పెద్ద సంఖ్యలో అదే దిశలో మూవ్ అవుతుంటే, అది సిస్టమ్‌కి వచ్చిన ఫీడ్‌బ్యాక్ అవుతుంది. దేశం ఈ సిగ్నల్‌ను సీరియస్‌గా తీసుకుని, ఇక్కడే డిగ్నిటీ (Dignity)తో, సెక్యూరిటీ (Security)తో, ప్రాస్పెరిటీతో (Prosperity) జీవించే ఎకోసిస్టమ్ బలంగా క్రియేట్ చేస్తేనే ఈ ట్రెండ్ స్లో అయ్యే అవకాశముంది.

మరిన్ని నేషనల్ న్యూస్అప్ డేట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version