Air Pollution:దేశంలో అత్యంత కలుషితమైన నగరం అదేనట.. మరి ఏపీ, తెలంగాణ పరిస్థితి ఏంటి?

Air Pollution:తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) విడుదల చేసిన '2025 క్లీన్ ఎయిర్ సర్వే' నివేదిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది.

Air Pollution

సాధారణంగా గాలి కాలుష్యం(Air Pollution) అంటే మనకు ఢిల్లీ, ముంబై నగరాలు గుర్తుకొస్తాయి. కానీ, తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ , వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (MoEF&CC) విడుదల చేసిన ‘2025 క్లీన్ ఎయిర్ సర్వే’ నివేదిక ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. దేశంలో పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో చెన్నై అత్యంత తక్కువ గాలి నాణ్యతను కలిగి ఉంది. ఈ నివేదికలో 41 పెద్ద నగరాలను సర్వే చేయగా, చెన్నై అట్టడుగున 41వ స్థానంలో నిలిచింది.

ఈ సర్వేలో చెన్నై కేవలం 115.3 పాయింట్లను మాత్రమే సాధించింది. చెన్నైలో వాహనాల ఉద్గారాలు, భారీ నిర్మాణ పనుల వల్ల వచ్చే ధూళి, రోడ్డు దుమ్ము, వ్యర్థాల నిర్వహణలో లోపాలు వంటివి గాలి నాణ్యతను గణనీయంగా తగ్గించాయి. పారిశ్రామిక ప్రాంతాల్లోని ఉద్గారాలు కూడా ఈ సమస్యకు తోడయ్యాయి.

Air Pollution

మరోవైపు, దేశంలో అత్యంత స్వచ్ఛమైన గాలి ఉన్న నగరంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నిలిచింది. ఇది పూర్తి 200 పాయింట్లను సాధించి, మొదటి స్థానంలో నిలిచింది. ఇండోర్ తో పాటు జబల్‌పూర్, ఆగ్రా, సూరత్ వంటి నగరాలు కూడా మొదటి మూడు స్థానాల్లో నిలిచి ‘నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ’ బిరుదును దక్కించుకున్నాయి. ఈ నగరాలు ఘన వ్యర్థాల నిర్వహణ, వాహన ఉద్గారాల నియంత్రణ, ప్రజా అవగాహన వంటి అంశాల్లో మెరుగైన పనితీరు కనబరిచాయి.

Air Pollution

చెన్నై అత్యంత దారుణమైన స్థానంలో ఉన్నా కూడా.. తమిళనాడులోని ఇతర నగరాలు మెరుగైన పనితీరు కనబరిచాయి. తిరుచ్చి (తిరుచిరాపల్లి) 186 పాయింట్లతో టాప్ 10 నగరాల్లో (9వ స్థానం) చోటు సంపాదించింది. దక్షిణ భారతదేశం నుంచి ఈ జాబితాలో నిలిచిన ఏకైక నగరం ఇదే. అయితే, మధురై మాత్రం 116.1 పాయింట్లతో 40వ స్థానంలో నిలిచి, చెన్నైకి కొద్దిగా మెరుగ్గా ఉంది.

మరోవైపు దేశంలోని ప్రధాన నగరాల గాలి(Air Pollution) నాణ్యతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు సంబంధించిన వివరాలను చూస్తే..విశాఖపట్నం (AQI: 235) గాలి నాణ్యత అత్యంత పేలవంగా ఉంది. పరిశుభ్రతలో ముందున్నా, పారిశ్రామిక కాలుష్యం కారణంగా ఈ పరిస్థితి నెలకొంది. విజయవాడ (AQI: 63) తిరుపతి (AQI: 42) గాలి నాణ్యత సంతృప్తికరంగా ఉంది. తిరుపతి ‘గుడ్’ కేటగిరీలో ఉంది. గుంటూరు టాప్ 10 క్లీన్ సిటీస్‌లో ఒకటిగా ఉంది.

Air Pollution

తెలంగాణలోని హైదరాబాద్‌లో (AQI: 78) గాలి నాణ్యత మధ్యస్థంగా ఉంది. ఇక్కడ వాహనాల కాలుష్యం సమస్యగా ఉంది. వరంగల్, నల్గొండ, నిజామాబాద్ వంటి నగరాల్లో గాలి నాణ్యత సాధారణ స్థాయిలో ఉంది.

మొత్తంగా నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ (NCAP)’ కింద ఈ సర్వే నిర్వహించారు. దీనికోసం జనాభా ఆధారంగా నగరాలను మూడు వర్గాలుగా విభజించి, మొత్తం 130 నగరాల్లో గాలి నాణ్యతను పరీక్షించారు. ఈ సర్వేలో గాలి నాణ్యతతో పాటు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రజల అవగాహన కార్యక్రమాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. ఈ నివేదిక, నగరాలు గాలి కాలుష్యా(Air Pollution)న్ని తగ్గించడానికి ఇంకా చాలా కృషి చేయాలని సూచిస్తోంది.

No rain ఈ ప్రదేశంలో ఎప్పుడూ వర్షం పడదట తెలుసా?

Exit mobile version