Vijay: ఒంటరిగా వద్దు.. పొత్తే ముద్దు విజయ్ కు పవన్ సలహా ?

Vijay: ఏపీలో టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిని ఏకతాటి పైకి తెచ్చి ఘనవిజయం సాధించడంలో పవన్ దే కీరోల్. దీంతో తమిళనాడులో కూటమి పొత్తు బాధ్యతల విషయంలో బీజేపీ పవన్ నే నమ్ముకుంది.

Vijay

రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు…బద్ధ శతృవులుగా ఉన్నవాళ్ళు మిత్రులవ్వొచ్చు.. స్నేహితులుగా కలిసున్న వాళ్ళు విడిపోవచ్చు..ఎందుకంటే రాజకీయాల్లో పార్టీలన్నింటికీ అధికారమే అంతిమ లక్ష్యం.. గత కొన్నేళ్ళుగా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇది రుజువైంది కూడా.. అధికారం కావాలంటే కొన్నిసార్లు ఒంటరిపోటీతో కష్టమే.. పొత్తు పెట్టుకుంటే ఫలితాలు అనుకూలంగా మారి గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఏపీలో గత ఏడాది ఇదే తరహా పొలిటికల్ పిక్చర్ ను ప్రజలు చూశారు. ఇప్పుడు అందరి దృష్టి తమిళనాడుపై పడింది.

వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకేతో పాటు నటుడు విజయ్ కొత్తగా స్థాపించిన టీవీకే పార్టీ కూడా పోటీ చేస్తోంది. అయితే విజయ్(Vijay) ఒంటరిగానే పోటీ చేయాలని మొదటి నుంచే నిర్ణయించుకున్నారు. కానీ అన్నాడీఎంకే మాత్రం విజయ్ తో పొత్తు కోసం తీవ్రప్రయత్నాలు చేస్తోంది. ఇద్దరి ఉమ్మడి ప్రత్యర్థి డీఎంకేనే కావడంతో బీజేపీతో కలిసి విజయ్(Vijay) తో పొత్తు పెట్టుకునేందుకు ఎదురుచూస్తోంది.ఈ క్రమంలో బీజేపీ అధిష్టానం ఈ పొత్తు విషయంలో తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను రంగంలోకి దించినట్టు సమాచారం.

Vijay

ఎందుకంటే ఏపీలో టీడీపీ,బీజేపీ,జనసేన కూటమిని ఏకతాటి పైకి తెచ్చి ఘనవిజయం సాధించడంలో పవన్ దే కీరోల్. దీంతో తమిళనాడులో కూటమి పొత్తు బాధ్యతల విషయంలో బీజేపీ పవన్ నే నమ్ముకుంది.దీంతో నటుడు విజయ్ కు పవన్ ఫోన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ఒంటరిగా వెళ్ళొద్దని, పొత్తు పెట్టుకోవాలంటూ కోరినట్టు తెలిసింది. పరిస్థితులను అర్థం చేసుకోకుంటే ఒంటరిగా వెళితే రాజకీయాల్లో ఒక్కోసారి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందంటూ చెప్పినట్టు తెలుస్తోంది.

దానికి ఉదాహరణగా తన అన్న చిరంజీవి పొలిటికల్ జర్నీని వివరించినట్టు వార్తలు వస్తున్నాయి. అన్నాడీఎంకే,బీజేపీతో కలిసి పోటీచేస్తే మంచి ఫలితాలు రావొచ్చని పవన్ నచ్చిజెప్పినట్టు తెలుస్తోంది. గెలిస్తే డిప్యూటీ సీఎం లేదంటే ప్రతిపక్షంలో కీలకపాత్ర పోషించే అవకాశముందని కూడా వివరించారని విశ్వసనీయవర్గాల భోగట్టా. అటు విజయ్ కూడా ప్రస్తుతం పొత్తు విషయంలో పునరాలోచనలో పడినట్టు కథనాలు వస్తున్నాయి. కరూర్ తొక్కిసలాట ఘటనతో ఒక్కసారిగా టీవీకే పార్టీ జోరుకు బ్రేకులు పడ్డాయి. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు కారణం కాకపోయినా 41 మంది చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

ప్రస్తుతం ఈ ఘటన వెనుక కుట్ర కోణం ఉందని ఆరోపిస్తూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించి సీబీఐ విచారణను కోరింది. ఇదిలా ఉంటే ఎన్డీఎ కూటమిలో చేరితే రాజకీయంగానూ లబ్ది చేకూరుతుందన్న అభిప్రాయాన్ని కూడా పవన్ నటుడు విజయ్ ముందు ఉంచారు. పైగా ఇటీవల అన్నాడీఎంకే సభలో టీవీకే పార్టీ జెండాలు రెపరెపలాడడం కూడా హాట్ టాపిక్ గా మారింది. విజయ్ తో పొత్తు కోసం అన్నాడీఎంకే చాలా ఆతృతగా ఎదురుచూస్తోందని ఇప్పటికే తేలిపోయింది. ఈ నేపథ్యంలో విజయ్(Vijay) ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది వేచి చూడాలి.

Gold: బంగారం, వెండి ధరల దూకుడు..10 రోజుల్లో ఎంత పెరిగిందో తెలుసా?

Exit mobile version