Jubilee Hills Bypoll: బైపోల్ ఫలితంపై ఇన్ని కోట్ల బెట్టింగా ? జూబ్లీహిల్స్ పై సర్వత్రా ఉత్కంఠ

Jubilee Hills Bypoll: ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడే కొద్దీ పెరుగుతున్న బెట్టింగులు జోరు పెరుగుతోంది.ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే ఉండటంతో , ఆ పార్టీ మెజారిటీపైని ఎక్కువ బెట్టింగులు కాస్తున్నారు.

Jubilee Hills Bypoll

ఆ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) ఫలితంతో ప్రభుత్వం ఏమీ పడిపోదు.. రాష్ట్ర రాజకీయాల దశ, దిశను కూడా మార్చే పరిస్థితి లేదు.. అయినా కూడా సర్వత్రా ఉత్కంఠ.. రాజకీయ పార్టీ నేతలకు ఒక టెన్షన్… మరోవైపు బెట్టింగ్ రాయుళ్ళ హడావుడి.. ఇదంతా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills Bypoll) ఫలితంపైనే నెలకొంది. నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి ఒక హడావుడి..ప్రచారం మరో హడావుడి.. పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ మరింత ఉత్కంఠ పెంచేశాయి. ఇదే అదునుగా బెట్టింగ్ రాయుళ్లు రెచ్చిపోతున్నారు.

ఓట్ల లెక్కింపుకు సమయం దగ్గర పడే కొద్దీ పెరుగుతున్న బెట్టింగులు జోరు పెరుగుతోంది.ఎగ్జిట్ పోల్స్ అన్ని కాంగ్రెస్ వైపే ఉండటంతో , ఆ పార్టీ మెజారిటీపైని ఎక్కువ బెట్టింగులు కాస్తున్నారు. కాంగ్రెస్ కి 15 వేల ఓట్లకు పైగా మెజారిటీ వస్తుందని రూపాయికి రూపాయి బెట్టింగ్ కడుతున్నారు.

కాంగ్రెస్ కి 40 వేల కు పైగా మెజారిటీ వస్తుందని… రూపాయికి మూడు రూపాయలు బెట్టింగ్,బిఆర్ఎస్ గెలుస్తుందని పందెం కాస్తే రూపాయికి పది రూపాయలు,.బిజెపి కి డిపాజిట్ కూడా రాదని పందెంకోస్తే రూపాయికి రెండు రూపాయలు,.బిజెపికి పదివేల ఓట్లు కూడా రావని బెట్ కాస్తే రూపాయికి మూడు రూపాయలు, ఇలా రకరకాలుగా జూబ్లీహిల్స్ ఫలితాలపై బెట్టింగులు నడుస్తున్నాయి. ఏపీ నుంచి కూడా హైదరాబాద్ వచ్చి బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయుళ్లు.జూబ్లీహిల్స్ పై 500 కోట్ల రూపాయల వరకు బెట్టింగ్ జరుగుతున్నట్టు సమాచారం.

Jubilee Hills Bypoll

ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఏ ఎన్నికకు జరుగని బెట్టింగ్‌ జూబ్లిహిల్స్‌పై 500కోట్ల బెట్టింగ్‌ జరిగింది. తొలి నుంచి బెట్టింగ్‌ లో హాట్‌ఫెవరెట్‌గా కాంగ్రెస్‌ ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్దికి 32వేల మెజారిటి వస్తుందని ప్రారంభమైన బెట్టింగ్‌ ప్రస్తుతం15 వేల నుంచి 23వేల మెజారిటిపై కొనసాగుతోంది. బిఆర్‌ఎస్‌ గెలిస్తే మూడు రేట్లు ఇస్తున్నారు. బెట్టింగ్‌లో భూములు, ఖరీదైన విల్లాలు, ఇల్లు కూడా పందెం కాస్తున్నారు బెట్టింగ్‌ రాయుళ్లు.

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు అన్ని కలిసి 200కోట్లు ఖర్చు చేస్తే బెట్టింగ్‌లు మాత్రం 500కోట్లపైనే ఉన్నాయి.జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills Bypoll)ను అన్ని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హోరాహోరీగా ప్రచారం చేశాయి. ఆయా పార్టీల్లోని హేమా హేమీలు ప్రచారంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం వ్యక్తిగత విమర్శలతో యుద్ధాన్ని తలపించింది. ఇక, అధికార పార్టీ నుంచి మంత్రులతో పాటు ముఖ్యమంత్రి కూడా ప్రచారంలో పాల్గొన్నారు.

ఇంత హోరా హోరీగా ప్రచారం, పోలింగ్‌, పోల్‌మెనేజ్‌మెంట్‌ జరిగిన ఈ ఉప ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల చరిత్రలోనే ఇంత భారీ స్థాయిలో ఏ ఉప ఎన్నికకు జరుగలేదని తెలుస్తోంది. ఇటు కాంగ్రెస్‌ విజయంపై ధీమాతో ఉండగా, తాము గెలుస్తామనే విశ్వాసంతో బిఆర్‌ఎస్‌ ఉంది. బిజెపి గౌరవప్రదమైన ఓట్లు రాకపోతాయా? అన్న అంచనాలతో ఉంది. దీంతో బెట్టింగ్‌లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ విజయం, మెజారిటిపై బెట్టింగ్‌ కాసినవాళ్ల శాతం ఎక్కువగా కనిపిస్తోంది. బిఆర్‌ఎస్‌ గెలిస్తే మూడు రేట్లు అధికంగా ఇచ్చే విదంగా బెట్టింగ్‌లు కాశారు.

మరిన్ని పొలిటికల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version