T20: ఆరంభం అదిరిందబ్బా..  తొలి టీ20లో భారత్ ఘనవిజయం

T20: భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే ఒక్కో వికెట్ పడగొట్టారు.

T20

టీ ట్వంటీ(T20) ప్రపంచకప్ కు ముందు సెమీఫైనల్ ప్రిపరేషన్ లా భావిస్తున్న సౌతాఫ్రికా సిరీస్ లో భారత్ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్ లో ఆల్ రౌండ్ షోతో అదరగొట్టి విజయం సాధించింది. టాస్ ఓడిపోవడం ఒక విధంగా భారత్ కు కలిసొచ్చిందనే చెప్పాలి. అయితే అంచనాలకు తగ్గట్టు టాపార్డర్ రాణించలేదు. మెడనొప్పి నుంచి కోలుకుని రీఎంట్రీ ఇచ్చిన గిల్ మరోసారి నిరాశపరిచాడు.

టీ20(T20) ఫార్మాట్ లో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కేవలం 4 పరుగులకే వెనుదిరిగాడు. కెప్టెన్ నూర్యకుమార్ కూడా ఫెయిలయ్యాడు. అభిషేక్ శర్మ ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. ఈ పరిస్థితుల్లో తిలక్ వర్మ, అక్షర్ పటేల్ ఆడుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ 30 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. మంచి స్కోర్ చేస్తాడనుకున్న త్విక్ వర్మ ఔటైన కా సేపటికే అక్షర్ పటేల్ కూడా వెనుదిరిగాడు. ఈ దశలో హార్దిక్ పాండ్యా మెరుపు బ్యాటింగ్ ఆదుకున్నాడు. దూబే ఔటైనప్పటకీ జితేశ్ శర్మతో కలిసి చివర్లో విధ్వంనం సృష్టించాడు.

భారీ సిక్సర్లతో నఫారీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఆసియాకప్ గాయపడిన తర్వాత పలు సిరీస్ కు దూరమైన పాండ్యా ఇటీవలే నయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీతో ఫిటినెన్ నిరూపించుకుని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఈ టోర్నీలో అదరగొట్టిన పాండ్యా కటక్ లోనూ చెలరేగాడు.

T20

కేవలం 28 బంతుల్లోనే 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 రన్స్ చేశాడు. పాండ్యా మెరుపుల తోనే భారత్ స్కోర్ 170 దాటగలిగింది. ఈ మ్యాచ్ లో పాండ్యా తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో 100 సిక్సర్ల మార్క్ అందుకున్నాడు. పాండ్యా మెరుపులతో భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 175 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, సివన్లూ 2 వికెట్లు తీశారు.

ఛేజింగ్ లో సౌతాఫ్రికా ఆరంభం నుంచే తడబడింది. రెండో బంతికే డికాక్ ను అర్షదీపి సింగ్ ఔట్ చేశాడు. ధాటిగా ఆడేందుకు మిగిలిన బ్యాటర్లకు భారత బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడ నుంచి సౌతాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పవర్ ప్లేలో దూకుడుగా ఆడడంతో మ్యాచ్ ఆనక్తికరంగా సాగుతుందని అనుకున్నారు. అయితే పవర్ ప్లే ముగిసిన తర్వాత భారత స్పిన్నర్లు కూడా తిప్పేయడంతో నఫారీల కథత్వరగానే ముగిసింది. మాక్రన్, న్దబ్స్ , బ్రెవిన్, మిల్లర్ ఫెయిలయ్యారు.

భారత పేనర్లు, స్పిన్నర్లు చెరొక ఎండ్ నుంచీ సౌతాఫ్రికాను కోలుకోకుండా దెబ్బకొట్టారు. ఫలితంగా కనీన పోటీ కూడా ఇవ్వని దక్షిణాఫ్రికా కేవలం 74 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా రెండేసి వికెట్లు తీయగా.. హార్దిక్, దూబే ఒక్కో వికెట్ పడగొట్టారు. హాఫ్ సెంచరీతో పాటు వికెట్ తీసిన హార్దిక్ పాండ్యాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. సిరీస్ లో రెండో టీ ట్వంటీ ముల్లాన్ పూర్ లో గురువారం జరుగుతుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version