Divya : చరిత్ర సృష్టించిన దివ్య దేశ్‌ముఖ్..

Divya : 19 ఏళ్ల వయసులోనే దివ్య ఈ టైటిల్‌ను గెలుచుకోవడం చెస్ ప్రపంచంలోనే ఒక సంచలనం(Historic Win) దీంతో, చెస్ ప్రపంచ కప్‌ను గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ స్టార్‌గా ఆమె రికార్డు సృష్టించింది.

Divya : జార్జియాలోని బటుమిలో భారత చెస్ క్రీడ సరికొత్త చరిత్రకు సాక్ష్యంగా నిలిచింది. యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్, FIDE మహిళల చెస్ ప్రపంచ కప్ టైటిల్‌ను ఒడిసిపట్టి, దేశం గర్వపడేలా చేసింది. సోమవారం జరిగిన తుది పోరులో, తన తోటి భారతీయ దిగ్గజం కోనేరు హంపీని టైబ్రేకర్లలో ఓడించిన.. దివ్య ఈ అనితరసాధ్యమైన విజయాన్ని అందుకుంది.

Divya

ఫైనల్ మ్యాచ్ చివరి వరకూ ఉత్కంఠగా సాగింది. తొలి గేమ్‌ను వ్యూహాత్మకంగా డ్రా చేసుకున్న 19 ఏళ్ల దివ్య, రెండవ రాపిడ్ గేమ్‌లో తనదైన వ్యూహాలతో, కదలికలతో చెలరేగింది. బ్లాక్ పావులతో ఆడుతున్న హంపీ ఒక కీలక తప్పు చేయడంతో, దివ్య ఆ క్షణాన్నే ఒడిసిపట్టి, తనదైన మార్కు వేసింది. ఈ ఒక్క తప్పిదమే ఆమెకు విజయాన్ని చేకూర్చింది. తన కెరీర్‌లో అత్యంత విలువైన ఈ విజయం దివ్యను ఆనంద డోలల్లో ముంచెత్తింది.

ఈ విజయంతో దివ్య దేశ్‌ముఖ్(Divya Deshmukh) కేవలం ప్రపంచ కప్‌ను మాత్రమే కాదు, అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రాండ్‌మాస్టర్ (GM) టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. భారత చెస్ చరిత్రలో ఈ అరుదైన గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన నాల్గవ మహిళా క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. అంతకుముందు కోనేరు హంపీ(Koneru Humpy), ఆర్. వైశాలి, హారిక ద్రోణవల్లి మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఇప్పుడు ఆ దిగ్గజాల సరసన దివ్య దేశ్‌ముఖ్ ధీమాగా చేరింది.

కేవలం 19 ఏళ్ల వయసులోనే దివ్య ఈ టైటిల్‌ను గెలుచుకోవడం చెస్ ప్రపంచంలోనే ఒక సంచలనం(Historic Win) దీంతో, చెస్ ప్రపంచ కప్‌ను గెలిచిన తొలి భారతీయ మహిళా చెస్ స్టార్‌గా ఆమె రికార్డు సృష్టించింది. గత సంవత్సరం, దివ్య జూనియర్ ప్రపంచ ఛాంపియన్ టైటిల్‌ను కూడా గెలుచుకుంది. ఒక సంవత్సరంలోపే జూనియర్ ఛాంపియన్‌గా, ఆపై మహిళల చెస్ ప్రపంచ కప్ ఛాంపియన్‌గా నిలవడం దివ్య అసమాన ప్రతిభకు, అంకితభావానికి, అనన్య సామాన్యమైన కృషికి నిదర్శనమని సోషల్ మీడియాలో ఆమెపై ప్రశంసలు వర్షం కురుస్తోంది.

Exit mobile version