Ind Vs Aus: టీమిండియాకు క్లీన్ స్వీప్ టెన్షన్..  సిడ్నీలో పరువు దక్కేనా ?

Ind Vs Aus: కట్ చేస్తే సిరీస్ స్టార్ట్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. కోహ్లీ రెండు మ్యాచ్(Ind Vs Aus) లలో అసలు ఖాతానే తెరవలేదు.

Ind Vs Aus

ఆస్ట్రేలియా టూర్ లో వన్డే సిరీస్(Ind Vs Aus) కోల్పోయిన టీమిండియా ఇప్పుడు క్లీన్ స్వీప్ పరాభవం ముంగిట నిలిచింది. వరుసగా రెండు వన్డేల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా ఫుల్ కాన్ఫిడెన్స్ తో బరిలోకి దిగుతుంటే… భారత్ మాత్రం పూర్తి ఒత్తిడిలో ఉంది. ఎందుకంటే భారత జట్టు వరుసగా మూడు మ్యాచ్ లు 2021 తర్వాత ఓడిపోలేదు. నిజానికి ఈ సిరీస్ ఆరంభానికి ముందు టీమిండియాపై భారీ అంచనాలున్నాయి. కొత్త కెప్టెన్ శుభమన్ గిల్ మ్యాజిక్ చేస్తాడని, కోహ్లీ-రోహిత్ జోడీ రెచ్చిపోతుందంటూ పలువురు భారీ ఆశలు పెట్టుకున్నారు.

కట్ చేస్తే సిరీస్ స్టార్ట్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. కోహ్లీ రెండు మ్యాచ్(Ind Vs Aus) లలో అసలు ఖాతానే తెరవలేదు. రెండో వన్డేలో రోహిత్ పర్వాలేదనిపిస్తే… బ్యాటింగ్ లోనే కాకుండా కెప్టెన్ గానూ గిల్ ఆకట్టుకోలేకపోయాడు. పైగా కీలక బ్యాటర్ల వైఫల్యం.. బౌలర్ల పేలవ ప్రదర్శన కూడా తోడవడంతో మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సిరీస్ ను చేజార్చుకుంది.

Ind Vs Aus

ఇప్పుడు సిడ్నీలో జరిగే చివరి వన్డేలో గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఆసీస్ పై చివరి మ్యాచ్ లోనైనా గెలవాలంటే మొదట బ్యాటర్లు సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. రోహిత్ ఫామ్ లోకి వచ్చినప్పటకీ.. గిల్ మాత్రం ఇంకా వైఫల్యాల బాటను వీడలేదు. అలాగే కోహ్లీ, కేఎల్ రాహుల్ , శ్రేయాస్ అయ్యర్ తో పాటు నితీష్ రెడ్డి కూడా రాణించాల్సిందే. చివర్లో అక్షర్ పటేల్ బ్యాట్ తో రాణిస్తున్నాడు. వాషింగ్టన్ సుందర్ మాత్రం పెద్దగా ఆడింది లేదు. దీంతో బ్యాటర్లు చెలరేగడంపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.

ఇదిలా ఉంటే బౌలింగ్ పరంగా చూస్తే సిరాజ్ పేస్ ఎటాక్ ను లీడ్ చేస్తుండగా.. అర్షదీప్ లైన్ అండ్ లెంగ్త్ తో ఆకట్టుకుంటున్నాడు. కానీ హర్షిత్ రాణా మాత్రం పెద్దగా రాణించలేకపోయాడు. గంభీర్ శిష్యుడన్న ఒకే ఒక కారణంతోనే అతన్ని జట్టులోకి తీసుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. గత మ్యాచ్ లో బ్యాట్ తో 24 రన్స్ చేసినప్పటకీ… హర్షిత్ రాణా తన బౌలింగ్ రోల్ లో మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. దీంతో చివరి వన్డేలో ప్రసిద్ధ కృష్ణకు అవకాశమివ్వాలని పలువురు కోరుతున్నారు.

Ind Vs Aus

అలాగే జట్టులో స్పెషలిస్ట్ స్పిన్నర్ లేకపోవడం భారత్ ఓటములకు కారణమవుతోంది. కుల్దీప్ యాదవ్ ను తీసుకోవాలని పలువురు మాజీలు సూచిస్తున్నా గంభీర్ మాత్రం అతన్ని పట్టించుకోవడం లేదు. పదే పదే వాషింగ్టన్ సుందర్ కే అవకాశాలిస్తున్నాడు. దీంతో సిడ్నీలోనైనా కుల్దీప్ ను ఆడించాలని పలువురు కోరుతున్నారు. తుది జట్టులో కుల్దీప్ ను ఆడించడం తప్పిస్తే పెద్దగా మార్పులు జరగకపోవచ్చు.

మరోవైపు మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్ (Ind Vs Aus)ను క్లీన్ స్వీప్ చేయాలని ఆసీస్ భావిస్తోంది. ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న సిడ్నీలో భారత్ కు అత్యంత చెత్త రికార్డుంది. గత తొమ్మిదేళ్ళుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ కూడా భారత్ గెలవలేదు. ఇప్పటి వరకూ ఇక్కడ 19 మ్యాచ్ లు ఆడిన టీమిండియా కేవలం రెండింటిలోనే గెలిచింది. 16 మ్యాచ్ లలో ఓడిపోగా.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు. కాగా సిడ్నీ పిచ్ సహజంగా బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. మ్యాచ్ సాగే కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారు.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version