SA vs WI : సెమీస్‌కు చేరువలో సఫారీలు..విండీస్‌పై ఘనవిజయం

SA vs WI : టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్ కు చేరువైంది. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరిచిన సఫారీ టీం 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

SA vs WI

టీ20 ప్రపంచకప్ లో సౌతాఫ్రికా జట్టు సెమీఫైనల్ కు చేరువైంది. వెస్టిండీస్(SA vs WI )తో జరిగిన మ్యాచ్ లో అన్ని విభాగాల్లోనూ ఆధిపత్యం కనబరిచిన సఫారీ టీం 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. బౌలింగ్ లో పేసర్లు, బ్యాటింగ్ లో ఓపెనర్లు దుమ్మురేపారు. దీంతో విండీస్ ఏ దశలోనూ పెద్దగా పోటీనివ్వలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ ధాటిగా ఆడుతూనే వరుస వికెట్లు కోల్పోయింది. కేవలం 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిందంటే సఫారీ బౌలర్లు ఏ విధంగా బౌలింగ్ చేసారో అర్థం చేసుకోవచ్చు.

విండీస్ ఇన్నింగ్స్ లో బ్రాండన్ కింగ్ (21), షై హోప్ (16) పరుగులకే ఔటవగా… మిగిలిన బ్యాటర్లంతా ఇలా వచ్చి అలా వెళ్లారు. హెట్ మెయిర్ 2, పావెల్ 9 , ఛేజ్ 2 , రూథర్ ఫర్డ్ 12, మాథ్యూ ఫోర్డ్ 11 పరుగులకే వెనుదిరిగారు. దీంతో కనీసం 100 పరుగులైనా చేస్తుందా అనుకుంటున్న దశలో జాసన్ హోల్డర్ , రొమారియో షెఫర్డ్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఆదుకున్నారు. వీరిద్దరూ 8వ వికెట్ కు 89 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

సఫారీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన వీరిద్దరూ సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించారు. దీంతో వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల కు 176 పరుగులు చేసింది. హోల్డర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 49 , షెఫర్డ్ 37 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3, రబాడ 2 , బోస్చ్ 2 వికెట్లు తీశారు.

SA vs WI

అహ్మదాబాద్ పిచ్ ఫ్లాట్ వికెట్ కావడంతో సౌతాఫ్రికా ఓపెనర్లు దంచికొట్టారు. డికాక్, మార్క్ రమ్ తొలి ఓవర్ నుంచే విధ్వంకర బ్యాటింగ్ తో రెచ్చిపోయారు. స్టేడియం నలువైపులా భారీ షాట్లతో అలరించారు. వీరిద్దరి జోరుతో సౌతాఫ్రికా పవర్ ప్లేలో వికెట్ నష్టపోకుండా 69 పరుగులు జోడించింది. డికాక్ , మార్క్ రమ్ తొలి వికెట్ కు 8 ఓవర్లలో 95 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. డికాక్ 24 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 47 పరుగులకు ఔటవగా.. మార్క్ రమ్ , రికెల్టన్ జట్టు విజయాన్ని పూర్తి చేశారు.

వీరిద్దరూ రెండో వికెట్ కు అజేయంగా 82 పరుగులు జోడించారు. ఫలితంగా సౌతాఫ్రికా 16.1 ఓవర్లలో టార్గెట్ ను అందుకుంది. మార్క్ రమ్ 46 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఈ విజయంతో సౌతాఫ్రికా(SA vs WI )దాదాపుగా సెమీస్ కు చేరినట్టే. అదే సమయంలో భారత్ కు ఊరట దక్కింది. టీమిండియా రన్ రేట్ తో సంబంధం లేకుండా మిగిలిన రెండు మ్యాచ్ లు గెలిస్తే సెమీఫైనల్ బెర్త్ దక్కించుకుంటుంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version