WhatsApp: వాట్సాప్‌లో రాబోయే 5 అద్భుతమైన ఫీచర్లు..ఏంటవి?

WhatsApp: ఇప్పటివరకు మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది.

WhatsApp

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాడుతున్న వాట్సాప్(WhatsApp), 2026లో తన యూజర్స్ కోసం ఊహించని మార్పులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ప్రైవసీ , ఏఐ (AI) కి ప్రాధాన్యత ఇస్తూ రూపొందిస్తున్న ఈ 5 ఫీచర్లు మీ చాటింగ్ అనుభవాన్ని పూర్తిగా మార్చేస్తాయని అంటున్నారు టెక్ నిపుణులు.

మొదటిది(WhatsApp) యూజర్ నేమ్ (Username) ఫీచర్. ఇప్పటివరకు మనం ఎవరికైనా మెసేజ్ చేయాలంటే మన ఫోన్ నెంబర్ ఇవ్వాల్సి వచ్చేది. కానీ 2026 నుంచి మనం ఇన్‌స్టాగ్రామ్ లాగా ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. దీనివల్ల మన ఫోన్ నెంబర్ తెలియకపోయినా అవతలి వారు మనకు మెసేజ్ చేయొచ్చు. ఇది ప్రైవసీకి పెద్ద ప్లస్ పాయింట్.

రెండోది ఏఐ చాట్ సమ్మరీ (AI Chat Summary). గ్రూప్ చాట్లలో వందల కొద్దీ మెసేజ్‌లు ఉన్నప్పుడు అవన్నీ చదవడం కంటే స్కిప్ చేసేయడం బెటర్ అనుకుంటారు చాలామంది.అయితే ఒక్కోసారి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. అలా అని అన్ని మెసేజెస్ చదవలేరు. అందుకే ఈ ఫీచర్ ద్వారా కేవలం ఒకే ఒక క్లిక్‌తో ఆ మెసేజ్‌లన్నింటినీ ఏఐ కుదించి, ముఖ్యమైన విషయాలను మీకు సమ్మరీలా చూపిస్తుంది.

WhatsApp

మూడవది స్టెల్త్ ఆన్‌లైన్ మోడ్ (Stealth Mode). దీని ద్వారా మీరు వాట్సాప్ వాడుతున్నా కూడా అవతలి వారికి మీరు ఆన్‌లైన్‌లో ఉన్నట్లు కనిపించదు. ఇప్పటికే ఇది ఉన్నా సరే, 2026 అప్డేట్‌లో దీనిని మరింత అడ్వాన్స్‌డ్‌గా మారుస్తున్నారు.

నాలుగవది ఇన్-యాప్ మెసేజ్ ట్రాన్స్‌లేషన్. వేరే భాషలో వచ్చిన మెసేజ్‌ను చదవడానికి కొంతమంది గూగుల్ ట్రాన్స్‌లేట్ వాడుతూ ఉంటారు. అయితే ఇకపై వాట్సాప్ లోనే ఆ మెసేజ్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే అది మీకు నచ్చిన భాషలోకి మారిపోతుంది.

ఐదవది వ్యూ-వన్స్ వాయిస్ మెసేజ్ (View-Once Voice). ఫోటోల లాగానే వాయిస్ మెసేజ్‌లను కూడా ఒకసారి విన్న తర్వాత ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయేలా సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా ఆల్రెడీ ఉన్నా అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది లేదు. ఈ కొత్త ఫీచర్లు అన్నీ వాట్సాప్‌ను మరింత సురక్షితంగా , స్మార్ట్‌గా మారుస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Exit mobile version