Smartphone:సైబర్ నేరాల నుంచి మీ స్మార్ట్ ఫోన్‌ను కాపాడుకోండి.. ఈ సెక్యూరిటీ టిప్స్ మీ కోసమే!

Smartphone: ఫోన్ సెక్యూరిటీ విషయంలో మనం చేసే మొదటి తప్పు యాప్స్ అప్ డేట్ చేయకపోవడమే అంటున్నారు టెక్ నిపుణులు.

Smartphone

స్మార్ట్ ఫోన్(Smartphone) ఇప్పుడు మనందరి జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంకింగ్ లావాదేవీల నుంచి వ్యక్తిగత ఫోటోల వరకు అన్నీ అందులోనే ఉంటున్నాయి. దీనిని ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు మన ఫోన్లను ఈజీగా హ్యాక్ చేసేస్తున్నారు.

ఫోన్ సెక్యూరిటీ విషయంలో మనం చేసే మొదటి తప్పు యాప్స్ అప్ డేట్ చేయకపోవడమే అంటున్నారు టెక్ నిపుణులు. ప్రతి అప్ డేట్ లో సెక్యూరిటీ ప్యాచెస్ ఉంటాయి. ఇవి మన డేటాను రక్షిస్తాయి.

Smartphone

అలాగే గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి కాకుండా ఇతర వెబ్ సైట్ల నుంచి ఏ యాప్ ను డౌన్ లోడ్ చేయకూడదు. వీటిని థర్డ్ పార్టీ యాప్స్ అంటారు. వీటితోనే మన ఫోన్(Smartphone) లో మాల్ వేర్‌ను ప్రవేశపెడతారు హ్యాకర్లు.

ముఖ్యంగా పబ్లిక్ వైఫై (Public Wi-Fi) వాడేటప్పుడు చాలాచాలా జాగ్రత్తగా ఉండాలి. రైల్వే స్టేషన్లు లేదా కేఫ్ లలో ఉండే ఉచిత వైఫైని వాడి బ్యాంకింగ్ పనులు మాత్రం అస్సలు చేయకూడదు. హ్యాకర్లు వీటి ద్వారా మీ పాస్ వర్డ్ లను ఈజీగా దొంగిలిస్తారు.

అలాగే ప్రతి అకౌంట్ కు టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2FA) పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. దీనివల్ల ఎవరైనా మీ పాస్ వర్డ్ తెలుసుకున్నా, మీ ఫోన్ కు వచ్చే ఓటీపీ లేకుండా లాగిన్ అవ్వలేరు.

అలాగే ఏదైనా తెలియని లింక్ కానీ మెసేజ్ లో వస్తే దానిని క్లిక్ చేయొద్దు. బహుమతులు గెలుచుకున్నారని వచ్చే ఫేక్ కాల్స్ కు కూడా స్పందించకండి. ఫోన్ కి ఎప్పుడూ బలమైన పాస్ వర్డ్ లేదా బయోమెట్రిక్ లాక్ ఉండేలా చూసుకోవాలి. అలాగే పాస్ వర్డ్‌లు కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ డిజిటల్ జీవితం సురక్షితంగా ఉంటుంది.

Smartphones: పాత స్మార్ట్‌ఫోన్‌లు అంత ప్రమాదకరమా? ఈ సమస్యలు తప్పవా?

Exit mobile version