Chargers
టెక్నాలజీ ప్రపంచంలో మార్పులు చాలా వేగంగా జరుగుతుంటాయి. ఒకప్పుడు ఫోన్ అంటే కేవలం మాట్లాడుకోవడానికే అనుకునేవాళ్లం.. కానీ ఇప్పుడు అది మన జీవితంలోనే ఒక భాగంగా మారిపోయింది. రాబోయే 2026లో స్మార్ట్ ఫోన్ రంగంలో విప్లవాత్మకమైప మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఫోన్ ఛార్జింగ్ విషయంలో ఊహించని మార్పులు జరగనున్నాయి. ఇకపై మీ ఫోన్ ఛార్జింగ్ (Chargers)పెట్టడానికి వైర్లు, ప్లగ్ పాయింట్లు వెతుక్కోవాల్సిన అవసరం ఉండకపోవచ్చట.
ఏమిటి ఈ కొత్త టెక్నాలజీ అంటే ప్రస్తుతం మనం వాడుతున్న వైర్ లెస్ ఛార్జింగ్ లో ఫోన్‌ను ఒక ప్యాడ్ మీద పెట్టాలి.. కానీ 2026 నాటికి రాబోతున్న ‘ఓవర్ ది ఎయిర్’ (Over-the-Air) ఛార్జింగ్ టెక్నాలజీతో.. ఫోన్ మీ చేతిలో ఉన్నా, లేదా జేబులో ఉన్నా సరే ఆటోమేటిక్ గా ఛార్జ్ అయిపోతుంది. అంటే వైఫై సిగ్నల్ లా ఛార్జింగ్ సిగ్నల్స్ కూడా గాలిలోనే ప్రసారం అవుతాయి. దీనివల్ల ఫోన్లకు అసలు ఛార్జింగ్ పోర్టులు (Charging Ports) అవసరం ఉండదు. ఇది జరిగితే ఫోన్లు పూర్తిగా వాటర్ ప్రూఫ్ గా మారతాయి.
ప్రముఖ మొబైల్ కంపెనీలు శాంసంగ్ (Samsung), ఆపిల్ (Apple) వంటి కంపెనీలు ఇప్పటికే తమ బాక్సుల నుంచి ఛార్జర్లను తొలగించాయి. 2026 నాటికి ఫోన్ బాక్సుల్లో కనీసం వైర్ కూడా ఇచ్చే అవకాశం ఉండదట. శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ లో అత్యంత వేగవంతమైన ‘Qi2’ వైర్ లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకురాబోతోంది. ఇది పాత వైర్ లెస్ ఛార్జర్ల కంటే రెండింతలు వేగంగా ఫోన్ ను ఛార్జ్ చేస్తుందట.
కేవలం ఛార్జింగ్(Chargers) పద్ధతే కాదు, బ్యాటరీ లైఫ్ కూడా పెరగనుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. 2026లో వచ్చే ఫోన్లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) బ్యాటరీని కంట్రోల్ చేస్తుందట. అంటే మీరు ఎప్పుడు ఫోన్ వాడుతున్నారు, ఎప్పుడు నిద్రపోతున్నారనే దాన్ని బట్టి ఏఐ పవర్‌ను సేవ్ చేస్తుంది. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే ..మూడు రోజుల వరకు బ్యాటరీ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ‘గ్రాఫిన్ బ్యాటరీల’ వాడకం మొదలైతే, కేవలం 5 నిమిషాల్లోనే ఫోన్ ఫుల్ ఛార్జ్ అయిపోతుంది.
మొత్తానికి 2026 అనేది స్మార్ట్ ఫోన్ల చరిత్రలో ఒక కొత్త అధ్యాయం కాబోతోంది. వైర్లు లేని, ఛార్జింగ్ టెన్షన్ లేని ప్రపంచం వైపు మనం అడుగులు వేస్తున్నాం అన్నమాట.
