Bhavita Mandava:న్యూయార్క్ నగరంలో హైదరాబాద్ మోడల్..మెట్రో నుంచి ఫ్యాషన్ ప్రపంచంలోకి భవితా మాండవ

Bhavita Mandava:హైదరాబాద్‌లోని JNTU నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన భవిత, ఆ తర్వాత న్యూయార్క్ యూనివర్శిటీ (NYU)లో అసిస్టివ్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లారు.

Bhavita Mandava

భారతీయ యువతరం ప్రతిభకు, పట్టుదలకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది హైదరాబాద్‌కు చెందిన భవితా మాండవ. ఆర్కిటెక్చర్ విద్యార్థినిగా అమెరికాకు వెళ్లిన భవిత, అకస్మాత్తుగా ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి, కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో ‘ఛానెల్’ (Chanel) వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ లగ్జరీ బ్రాండ్ యొక్క ప్రతిష్ఠాత్మక షోను ఓపెన్ చేసిన మొట్టమొదటి భారతీయ మోడల్‌గా చరిత్ర సృష్టించింది.

భవిత(Bhavita Mandava) ప్రయాణం.. ఒక సబ్‌వేలో మొదలైంది..నిజానికి భవితా మాండవ(Bhavita Mandava)జర్నీ సినిమా కథను తలపిస్తుంది. హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ (JNTU) నుంచి ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన భవిత, ఆ తర్వాత న్యూయార్క్ యూనివర్శిటీ (NYU)లో అసిస్టివ్ టెక్నాలజీ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ కోసం అమెరికాకు వెళ్లారు.

మోడలింగ్‌తో ఎలాంటి సంబంధం లేని ఈమె, కేవలం ఒక సంవత్సరం క్రితం, అంటే 2024 అక్టోబర్‌లో, న్యూయార్క్ నగరంలోని సబ్‌వే స్టేషన్‌లో ట్రైన కోసం ఎదురుచూస్తున్నప్పుడు అనుకోకుండా ఒక స్కౌటింగ్ టీమ్ దృష్టిని ఆకర్షించారు. సాధారణ జీన్స్, టీ-షర్ట్‌లో ఉన్న ఆమె సహజమైన ఆకర్షణను గుర్తించిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మాథ్యూ బ్లేజీ (Matthieu Blazy) ఆమెను తన మొదటి ప్రాజెక్ట్ అయిన బోటెగా వెనెటా (Bottega Veneta) స్ప్రింగ్/సమ్మర్ 2025 షో కోసం ఎంపిక చేశారు. అప్పటి నుంచి ఆమె ప్రయాణం ఊహించని వేగంతో దూసుకుపోయింది.

Bhavita Mandava

ఛానెల్ షోలో చారిత్రక ఘట్టం.. మాథ్యూ బ్లేజీ ఛానెల్‌కు క్రియేటివ్ డైరెక్టర్‌గా మారిన తర్వాత, భవిత కూడా ఆయనతో పాటు ఆ బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించడం మొదలుపెట్టింది. డిసెంబర్ 2, 2025 న న్యూయార్క్ నగరంలోని బోవరీ సబ్‌వే స్టేషన్ లో ఛానెల్ యొక్క ‘మెటియర్స్ డి’ఆర్ట్ 2026’ (Métiers d’Art 2026) కలెక్షన్ షో జరిగింది.

‘ఓపెనింగ్ వాక్’ (Opening Walk) ప్రాధాన్యత.. ఏదైనా పెద్ద ఫ్యాషన్ షోను ప్రారంభించే మోడల్‌కు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇది ఆ మోడల్ యొక్క ప్రతిభను, ప్రాముఖ్యతను అంతర్జాతీయంగా చాటుతుంది.

భవితా మాండవ మోడలింగ్ కెరీర్ ప్రారంభమైన సబ్‌వేలోనే, అదే జీన్స్, స్వెటర్ పోలిక ఉన్న దుస్తుల్లో ఛానెల్ షోను ఓపెన్ చేయడం అనేది ఒక అద్భుతమైన, చారిత్రక ఘట్టంగా నిలిచింది.

భవిత(Bhavita Mandava) ఈ విజయాన్ని తన తల్లిదండ్రులతో పంచుకున్న తీరు కోట్లాది మంది హృదయాలను కదిలించింది. డిసెంబర్ 3, 2025 న ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశారు. అందులో, ఆమె తల్లిదండ్రులు తమ కూతురు గ్లోబల్ ర్యాంప్‌పై నడుస్తుంటే టీవీలో చూసి ఉప్పొంగిపోయారు.

ఆ క్లిప్‌లో, భవిత(Bhavita Mandava) స్టేషన్ మెట్లపై దిగి ర్యాంప్‌పైకి అడుగుపెట్టగానే, ఆమె తల్లి ఆనందంతో కన్నీరు పెట్టుకుంటూ పదేపదే “మన భవిత!” అంటూ భావోద్వేగానికి లోనవడం కనిపించింది.

ఆమె తండ్రి కూడా గర్వంగా, నిశ్శబ్దంగా తమ కుమార్తె విజయాన్ని చూస్తూ ఆనందించారు.

ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా 13 మిలియన్లకు పైగా వీక్షణలు పొంది, ‘గోల్డెన్ టికెట్’ లాంటి అవకాశం వెనుక ఉన్న భారతీయ తల్లిదండ్రుల కృషి, ప్రేమ, సంతోషానికి చిహ్నంగా నిలిచింది.

ఆర్కిటెక్చర్, టెక్నాలజీ చదువుకుంటూనే, తనలోని ఫ్యాషన్ ప్యాషన్‌ను ప్రపంచానికి చూపిన భవితా మాండవ జర్నీ, ఇప్పుడు తమ కలలను సాకారం చేసుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప ఇన్‌స్పిరేషన్‌గా మారింది.

Women: అమెరికా, జపాన్ మహిళల కంటే మనవాళ్లే అందగత్తెలు..44 దేశాలను వెనక్కి నెట్టి 12వ స్థానంలో భారత్

Exit mobile version