Cold wave: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కోల్డ్ వేవ్.. రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువ

Cold wave: అతిశీతల గాలులు, దట్టమైన పొగమంచు మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అన్నారు.

Cold wave

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలు చలికి వణికిపోతున్నారు. రెండు రాష్ట్రాల్లోని రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ కనిష్ఠ ఉష్ణోగ్రతలు దాదాపు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలులే.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణ శాఖ హెచ్చరికలు.. రానున్న మూడు రోజుల పాటు చలి ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అతిశీతల గాలులు, దట్టమైన పొగమంచు (Fog) మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. రాత్రి ఉష్ణోగ్రతలు మరింత తగ్గే అవకాశం ఉందని అన్నారు.

Cold wave

తెలంగాణలో మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో చలిగాలులు (Cold Wave) వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పటాన్‌చెరులో అత్యల్పంగా 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత, ఆదిలాబాద్‌లో 7.2, మెదక్‌లో 7.2, హన్మకొండలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

జీహెచ్ఎంసీ పరిధిలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 – 12 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రానున్న మూడు రోజులు సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో చలి నుంచి రక్షణ కోసం జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version