Summit
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో(Summit) పెట్టుబడులపై సెషన్లు విజయవంతంగా ముగిసిన వెంటనే, ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం కల్పించింది. సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన అత్యాధునిక స్టాల్స్ , భవిష్యత్తు ప్రణాళికల ప్రదర్శనను ప్రజలు మూడు రోజుల పాటు ఉచితంగా చూసేందుకు తెలంగాణ సర్కార్ ఏర్పాట్లు చేసింది.
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీ అంటే కందుకూరు వద్ద గ్లోబల్ సమ్మిట్ వేదికకు డిసెంబర్ 10 నుంచి డిసెంబర్ 13 వరకు.. అందరికీ ఈ నాలుగు రోజులూ ప్రవేశం ఉచితమే. తెలంగాణ భవిష్యత్తు ప్రణాళికలు, గ్లోబల్ విజన్‌ను దగ్గరగా చూసేందుకు ఇది ఒక అద్భుత అవకాశం.
ఈ ప్రదర్శనలో కింది అంశాలు అందుబాటులో ఉంటాయి:
- భవిష్యత్తు ప్రాజెక్టులపై సెషన్లు.. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాబోయే ప్రాజెక్టుల గురించి వివరాలు.
- ప్రభుత్వ నిపుణులతో సంభాషణలు.. ప్రభుత్వ శాఖల్లోని నిపుణులతో నేరుగా మాట్లాడే అవకాశం.
- ప్రభుత్వ శాఖల స్టాల్స్.. ప్రభుత్వ శాఖలు సాధించిన ప్రగతి, అందించే సేవలను ప్రదర్శించే స్టాల్స్.
- సాంస్కృతిక కార్యక్రమాలు.. తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రతిబింబించే ప్రత్యేక కార్యక్రమాలు.
Summit - సామాన్య ప్రజలు కూడా ఈ చారిత్రక కార్యక్రమాన్ని తిలకించేందుకు, ప్రభుత్వం కీలకమైన కేంద్రాల నుంచి ఉచిత బస్సు సేవలను ఏర్పాటు చేసింది.
- ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్పల్లి, చార్మినార్, ఎల్బీ నగర్ వంటి నగరంలోని ప్రధాన ట్రాన్స్పోర్ట్ హబ్‌ల నుంచి ఉచిత బస్సులు అందుబాటులో ఉంటాయి.
- వెళ్లేందుకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు..తిరిగి వచ్చేందుకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు బస్సులు అందుబాటులో ఉంటాయి.
