Mango Peels : మామిడి తొక్కలతో మెరిసే చర్మం..పార్లర్ అవసరం లేకుండా బ్యూటీ టిప్స్

Mango Peels :ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రత వల్ల వచ్చే టానింగ్, మొటిమలు, స్కిన్ డల్‌గా మారడం వంటి సమస్యలకు ఇది ఒక నేచురల్ రెమిడీగా తోడ్పడుతుంది.

Mango Peels

సమ్మర్ వచ్చిందంటే అందరికీ నోరూరించే మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. సాధారణంగా మనమంతా పండులోని తీపి గుజ్జును ఆస్వాదించి, పైన ఉన్న తొక్కలను, టెంకను పనికిరానివని పారవేస్తుంటాం. కానీ మామిడి తొక్కల్లో మన చర్మానికి మేలు చేసే ఎన్నో అద్భుతమైన పోషకాలున్నాయని చాలా మందికి తెలీదు.

మామిడి తొక్కల(Mango Peels )లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ సిద్ధమైన ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరిచి కాంతివంతంగా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తాయి. ముఖ్యంగా వేసవి ఎండల తీవ్రత వల్ల వచ్చే టానింగ్, మొటిమలు, స్కిన్ డల్‌గా మారడం వంటి సమస్యలకు ఇది ఒక నేచురల్ రెమిడీగా తోడ్పడుతుంది.

మామిడి తొక్కల(Mango Peels )లో విటమిన్ సి ఉండటంతో.. ముఖంపై పేరుకుపోయిన అలసటను వెంటనే పోగొడుతుంది. దీనివల్ల ఎటువంటి మేకప్ అవసరం లేకుండానే చర్మానికి నేచురల్ గ్లో అందిస్తుంది. దీనిలో ఉండే యాంటీ బాక్టీరియల్ గుణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సమర్థవంతంగా అడ్డుకుంటాయి.

ఇవి ఒక సహజ ఎక్స్‌ఫోలియేటర్‌లా పనిచేస్తూ చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికిని , డెడ్ స్కిన్‌ను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎండల వల్ల స్కిన్ పొడిబారిపోయి జీవం కోల్పోయినప్పుడు, మామిడి తొక్కలు చర్మానికి అవసరమైన తేమను అందించి మృదువుగా మారుస్తాయి. దీనిని ఉపయోగించడం కూడా చాలా ఈజీ కాబట్టి ఎవరైనా ఇంట్లోనే ప్రయత్నించొచ్చు.

Mango Peels

దీనిని ఎలా వాడాలంటే, మామిడి పండు తొక్క లోపలి భాగాన్ని తీసుకుని ఫేస్‌పై సున్నితంగా మసాజ్ చేయాలి. ఒక పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకుని, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే స్కిన్‌ ఎంతో స్మూత్‌గా మారుతుంది. అంతేకాకుండా, మామిడి తొక్కలను ఎండబెట్టి పొడి చేసి, ఆ పొడిని పెరుగుతో కానీ పాలతో కానీ కలిపి ఫేస్ మాస్క్‌లా కూడా వేసుకోవచ్చు.

మార్కెట్లో దొరికే ఖరీదైన కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఇలాంటి నేచురల్ చిట్కాలు చర్మానికి ఎటువంటి హాని చేయవు. అయితే ఈ చిట్కాలను పాటించేటప్పుడు ఫేస్‌పై గట్టిగా రుద్దకుండా జాగ్రత్త వహించాలి. ఇలా ప్రకృతి సిద్ధంగా లభించే వాటితో ఎంతో ఈజీగా మీ అందాన్ని కాపాడుకోవచ్చు.

Change : అక్కడ మార్పు కోరుకున్నారు..ఇక్కడ మార్పు వద్దనుకున్నారు

Exit mobile version