Machilipatnam Hospital
జీవితం కోసం పరీక్ష చేయించుకుంటున్నాం గానీ… బ్రతకలేకపోతున్నాం గౌరవం లేకపోవడం వల్ల…ఇది మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రి( Machilipatnam Government Hospital)లో ఒక మహిళ వేసిన ప్రశ్న..కాదు అందరి ముందు బయటపెట్టిన ఆవేదన. బహుశా శరీర సంబంధిత పరీక్ష అయిన 2D ఎకో కోసం, ఆమె ఎదుర్కొంటున్న వేదనను వివరించడానికి ఇది తక్కువే కావొచ్చు కూడా.
ఆసుపత్రిలో (Machilipatnam Hospital) ఆ పరీక్ష చేసే ఒక్కటే టెక్నీషియన్ .. అదీ మగవాడు. హృదయ సంబంధిత సమస్యల నిర్ధారణ కోసం చేసే ఈ ఎకో 2D పరీక్షలో, జాకెట్, చీరలపై భాగాలు తీయాల్సి వస్తుంది. అందుకే చాలా మంది మహిళలు అనారోగ్యంతో ఉన్నా పరీక్షకు వెనుకాడుతున్నారు.
ఆయనకు ఇది రోజువారీ పని కావచ్చు. కానీ మాకు కాదు. ఆయన ఎదుట జాకెట్ తీసి, ఎద చూపించాలంటే మేమెంత భయపడుతున్నామో ఆయనకు అర్థం కావడం లేదు. దయచేసి మాతో కనికరంగా ఉండండి, అంటూ కన్నీళ్లతో అడుగుతున్నారు బాధితులు.
ఒకటి కాదు… పదుల సంఖ్యలో మహిళలు ఈ దుస్థితిని తట్టుకుంటున్నారు. కొందరు పరీక్షకి రాకుండానే వెనుదిరిగారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితులకు తలొగ్గి అవమానంగానే పూర్తి చేయించుకుంటున్నారు.
సమస్య చాలా చిన్నదిగా కనిపించవచ్చు. కానీ మహిళా టెక్నీషియన్ లేకపోవడం, ఒక ఆడవారి దృష్టిలో ఎంత పెద్ద అవమానంగా మారుతుందో ఇప్పుడు అధికారులు, ప్రభుత్వం ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అవమానానికి ఇది కేంద్రం కాదు కదా..ఎందుకు ఇన్నాళ్లూ మహిళల గురించి ఆలోచించలేదు అని ప్రశ్నించుకోవాల్సిన టైమ్ వచ్చింది.
“నమస్తే సార్, మేము బ్రతికే ఉన్నాం… కానీ ఈ పరిస్థితుల్లో బ్రతికుండగలగడం కష్టం. మాకు కనీస గౌరవం ఇవ్వండి. మగవారి ముందు ల Shame ను భరిస్తూ పరీక్ష చేయించుకోవడం మాకు శిక్షలా మారుతోంది. మచిలీపట్నం ఆసుపత్రిలో ఒక్క మహిళా టెక్నీషియన్‌ని 2D ఎకో కోసం నియమించండి. మేము వైద్యం కోరుతున్నాం, అవమానం కాదు అని ఓ మహిళ కలెక్టర్ గారికి తన బాధను విన్నవించుకుంది.
2D ఎకో అంటే టూ డైమెన్షనల్ ఎకోకార్డియోగ్రామ్(2D Echo Test) ఇది గుండె బీట్ ఎలా పనిచేస్తోందో, గుండె కండరాల లోపాలు ఉన్నాయా లేదా అన్నదాన్ని తెలుసుకునే పరీక్ష. ఛాతీపై గెల్ రాసి, ఓ ప్రత్యేకమైన పరికరం ద్వారా గుండెను స్కాన్ చేస్తారు. శరీరంలోని పైభాగాలను చాలావరకు బయల్పరచాల్సి ఉంటుంది.
ఇలాంటి పరీక్షల కోసం మహిళా టెక్నీషియన్ ఎందుకు అవసరం అంటే..ఒక మహిళగా, మరొక మహిళ ముందు పరీక్ష చేయించుకోవడంలో కనీస భద్రత, గౌరవం ఉంటుంది. ఇది కేవలం సిగ్గు విషయం కాదు – మన మానసిక స్థితి, విశ్రాంతి, శారీరక భద్రతకి సంబంధించింది. ఆసుపత్రిలో ఈ సౌకర్యం లేకపోవడం వల్ల వెనుకడుగు వేసి.. చాలా మంది తమ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు.