Saving: 2026లో అయినా పొదుపు చేయండి.. భవిష్యత్తు కోసం బలమైన పునాది వేయండి!

Saving: మీ సంపాదనలో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పొదుపు చేయగలిగితే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు.

Saving

మీ సంపాదనలో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పొదుపు చేయగలిగితే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు. Saving చాలా మంది కొత్త ఇల్లు కొనాలని, కారు తీసుకోవాలని , పిల్లల చదువుల కోసం డబ్బు పొదుపు చేయాలని అనుకుంటూ ఉంటారు. కానీ సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోతే అవి కలలుగానే ఉండిపోతాయి.

అందుకే 2026 జనవరి నుంచి అయినా పొదుపుపై ద‌ృష్టి పెట్టండి. ఈ జనవరిలోనే మీరు మీ డబ్బును ఎలా ఖర్చు చేస్తున్నారు.. ఎంత పొదుపు చేస్తున్నారో లెక్కలు చూసుకోవడం మొదలుపెట్టాలి.

మీ సంపాదనలో కనీసం ఇరవై నుంచి ముప్పై శాతం వరకు పొదుపు(Saving) చేయగలిగితే భవిష్యత్తులో మీకు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు రావు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే పొదుపు అంటే కేవలం డబ్బును సేవింగ్స్‌లో దాచుకోవడం మాత్రమే కాదు, ఆ డబ్బును సరైన చోట ఇన్వెస్ట్ చేయడం కూడా నేర్చుకోవాలి.

మొదటగా మీరు ఒక ‘ఎమర్జెన్సీ ఫండ్’ను ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఏదైనా అనుకోని ఇబ్బంది వచ్చినప్పుడు మీరు జాబ్ మానేసినా, లేదా ఇతర ఇబ్బందుల వల్ల ఏ పని చేయకపోయినా మీకు కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన ఉండాలి. ఇది మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది.

Saving

రెండోది అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం. మనం కొనే ప్రతి వస్తువు మనకు అవసరమా లేక కేవలం మోజు కోసమో, ప్రెస్టేజ్ కోసమో కొంటున్నామా అని ఆలోచించాలి. క్రెడిట్ కార్డుల వాడకం తగ్గించి అప్పులకు దూరంగా ఉండటం మంచిది.

మూడవది మ్యూచువల్ ఫండ్స్ లేదా ఎస్‌ఐపి (SIP) లో పెట్టుబడి పెట్టడం. ప్రతినెలా ఒక నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో మీరు భారీ మొత్తాన్ని పొందొచ్చు.

నాలుగవది ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ , లైఫ్ ఇన్సూరెన్స్ ఉండటం వల్ల అకస్మాత్తుగా వచ్చే వైద్య ఖర్చుల నుంచి మీ పొదుపును కాపాడుకోవచ్చు.

ఐదవది ఇతర ఆదాయ మార్గాలను పెంచుకోవడం. ఒకే ఆదాయంపై ఆధారపడకుండా చిన్నపాటి సైడ్ బిజినెస్ కానీ పార్ట్ టైమ్ పనుల ద్వారా కానీ ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. 2026లో మీ ఆర్థిక ప్రయాణాన్ని ఒక క్రమశిక్షణతో ప్రారంభిస్తే ఆర్థిక స్వేచ్ఛను సాధించడం, మీ కలలను నిజం చేసుకోవడం అసాధ్యమేమీ కాదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version