Chanakya : బంధం మళ్లీ చిగురించాలా? చాణక్యుడు చెప్పిన 8 సూత్రాలు తెలుసుకోండి..

Chanakya : ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మనుషుల మధ్య అనుబంధాలు రోజురోజుకు బలహీనపడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం

Chanakya

ఇప్పుడున్న డిజిటల్ యుగంలో మనుషుల మధ్య అనుబంధాలు రోజురోజుకు బలహీనపడుతూ ఉండటం చూస్తూనే ఉన్నాం. చిన్నపాటి తేడాలే పెద్ద గొడవలకు దారితీసి చివరకు బంధాలు తెగిపోతున్న స్టేజికి వెళ్లిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆచార్య చాణక్యు(Chanakya)డి నీతి శాస్త్రం ఇలాంటివారికి దిశానిర్దేశం చేస్తుంది.

నమ్మకమే ఏ బంధానికి అయినా పునాది.. ఒక బంధం తిరిగి కలవాలన్నా, అసలు విడిపోకుండా ఉండాలన్నా వారిద్దరి మధ్య మొదటగా ఉండాల్సింది నమ్మకం. అనుమానం అనేది బంధాన్ని లోపలి నుంచి మెల్లమెల్లగా దెబ్బతీస్తుంది. కాబట్టి భాగస్వామి పట్ల పారదర్శకంగా ఉండటం చాలా ముఖ్యం అంటారు చాణక్యుడు.

గౌరవం లేని చోట ప్రేమ నిలవదు.. వారిద్దరి మధ్య కేవలం ప్రేమ మాత్రమే సరిపోదు, పరస్పర గౌరవం కూడా అలాగే ఉండాలి. ఎదుటివారి భావాలకు ఏమాత్రం విలువనివ్వని చోట ప్రేమ నిలబడదు. ఒకరి వ్యక్తిత్వాన్ని మరొకరు గౌరవించుకున్నప్పుడు, విలువ ఇచ్చుకున్నప్పుడు మాత్రమే ఆ బంధం పవిత్రంగా మారుతుంది.

అబద్ధాలు కాదు నిజంతోనే బంధం శాశ్వతం.. అబద్ధాలు చెప్పి తాత్కాలికంగా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు, కానీ తర్వాత వారిద్దరూ కలిసి జీవించే లాంగ్ రన్‌లో అవి బంధానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయి. బంధం బలంగా నిలవాలంటే నిజాయితీ ముఖ్యం అని చాణక్యు(Chanakya)డు చెప్పాడు. తప్పు చేసినప్పుడు మీరు నిజాయితీగా ఒప్పుకోవడం వల్ల భాగస్వామికి మీపై గౌరవం మరింత పెరుగుతుంది.

ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోవాలి.. మీ భాగస్వామి నుంచి మరీ ఎక్కువగా ఆశించినప్పుడే నిరాశ ఎదురవుతుంది. ఎదుటివారి నుంచి అంచనాలను తగ్గించుకుని, ఉన్నదానితో తృప్తి చెందడం వల్ల బంధం ప్రశాంతంగా సాగుతుంది. చిన్న విషయాల్లోనే మన ఆనందాన్ని వెతుక్కోవడం అలవాటు చేసుకోవాలి.

కోపాన్ని అదుపులో ఉంచుకుంటూ మాట జారకుండా ఉండాలి.. కోపం మనిషిలోని మంచి తనాన్ని, విచక్షణను కోల్పోయేలా చేస్తుంది. క్షణికావేశంలో అనే మాటలు ఎన్నో ఏళ్ల నాటి ప్రేమను, అభిమానాన్ని చిన్నాభిన్నం చేసేస్తాయి. అందుకే ఏదైనా మాట్లాడే ముందు లేదా రియాక్టయ్యే ముందు ఒక్క నిమిషం ఆలోచించడం మంచిది. ఒకవేళ నోరుజారినా వెంటనే రియలైజ్ అయి క్షమాపణ అడగడం నేర్చుకోవాలి.

భాగస్వామికి సమయం కేటాయించాలి..ఈ డిజిటల్ యుగంలో ఆన్‌లైన్ కనెక్షన్లు పెరిగినా, డైరెక్ట్ ఎమోషన్ ఉన్న బంధాలు తగ్గుతున్నాయి. అందుకే మీ భాగస్వామితో కలిసి గడపడానికి ప్రత్యేక సమయాన్ని కేటాయించాలి. ఫోన్లకు ఇచ్చే ఇంపార్టెన్స్ తగ్గించి, ఎదురుగా ఉన్న మనిషి మనసు విప్పి మాట్లాడటానికి సమయం ఇవ్వాలి.

Chanakya

ఎదుటివారి మనసును అర్థం చేసుకోవాలి.. మీ ఆలోచనలను , భావాలను అర్థం చేసుకునే భాగస్వామి దొరికితే సగానికి సగం సమస్యలు వాటంతట అవే తొలగిపోతాయి. భాగస్వామి పడే కష్టాన్ని , వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడం వల్ల ఆ బంధం మరింత స్ట్రాంగ్‌గా మారుతుంది.

చిన్న చిన్న పనులు.. గొప్ప మార్పులు తెస్తాయన్న విషయాన్ని గ్రహించాలి.. సంబంధం బలంగా ఉండటానికి ఎప్పుడూ పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదన్న విషయాన్ని గ్రహించాలి. ఒక చిన్న ప్రశంస, ప్రేమతో కూడిన మెసేజ్ లేదా కాసేపు మనసు విప్పి మాట్లాడుకోవడం వంటి చిన్న చిన్న పనులు బంధంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. ఎమోషనల్ అనుబంధాలే శాశ్వతమని గుర్తించినప్పుడు ఏ బంధమైనా నిలబడుతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.

Delhi Capitals : రాహుల్, నిస్సాంక ధనాధన్..రాజస్థాన్ కు ఢిల్లీ షాక్

Exit mobile version