After Retirement
ఏ కంపెనీలోనైనా ఒక ఏజ్ వచ్చాక రిటైర్మెంట్ తప్పనిసరి. అలా 25 ఏళ్ల వయసులో జాబ్‌లో చేరినప్పుడు ఎంత జోష్‌తో ఉంటున్నారో, రిటైర్ అయ్యేటప్పుడు కూడా అంతే ఫీలింగ్ ఉంటున్నారు. ఒకప్పుడయితే రిటైర్మెంట్ అవగానే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ, మనవళ్లు, మనవరాళ్లతో టైమ్ స్పెండ్ చేసేవారు.
కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. 60 ఏళ్లు దాటినా కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉందంటూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. జాబ్ నుంచి మాత్రమే రిటైర్ అయ్యాం. జీవితం నుంచి కాదంటూ తమ దశాబ్దాల అనుభవాన్నే పెట్టుబడిగా పెట్టి.. ఇతరులకు తమ స్కిల్స్‌ను నేర్పే గురువులుగా మారిపోతున్నారు.
ఇప్పుడు సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్స్‌పీరియన్స్‌కు మంచి డిమాండ్ ఏర్పడింది. ఇన్నాళ్లూ శాలరీ కోసం పనిచేసిన వాళ్లు, రిటైర్మెంట్ తర్వాత(After Retirement) తమ మనసుకు నచ్చిన వర్క్‌ను చేయడానికి ఇష్టపడుతున్నారు. కేవలం మనీ కోసమే కాకుండా, ఖాళీగా ఇంట్లో ఉండటం ఇష్టం లేక చాలామంది సెకండ్ ఇన్నింగ్స్‌లోనూ ఎంప్లాయిస్‌గా మారుతున్నారు. టీచర్లు , కలెక్టర్లు, బ్యాంకర్లు, ఇంజినీర్లు, అకౌంటెంట్లు, హెచ్ఆర్, మార్కెటింగ్, ఫ్యాక్టరీ మేనేజర్లు ఇలా అన్ని డిపార్ట్మెంట్ వాళ్లు మెంటార్లుగా తమ 30 ఏళ్ల అనుభవాన్ని పంచుతున్నారు.
మాజీ ఉన్నతాధికారులు, కలెక్టర్లు పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే వాళ్లకు ఫుల్‌టైమ్, వీకెండ్స్‌లో గైడెన్స్ ఇస్తున్నారు. ఫైనాన్స్, కెరీర్ ప్లానింగ్, స్కిల్స్ గురించి వివరిస్తున్నారు. మరోవైపు రిటైర్డ్ టీచర్లు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, జూమ్, గూగుల్ మీట్ ద్వారా ఆన్లైన్ క్లాసులను చెబుతూ వరల్డ్ వైడ్‌గా ఉన్న వాళ్లకు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, బ్యాంకింగ్, యూపీఎస్సీ, రైల్వే కోచింగ్‌తో పాటు పర్సనాలిటీ డెవలప్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తున్నారు.
చేతిలో ఖాళీ టైమ్ ఉండటంతో యోగా, మెడిటేషన్ నేర్చుకుని, పార్కుల్లో లేదంటే ఆన్లైన్లో ఉచితంగా నేర్పిస్తున్న వాళ్లూ కూడా చాలామందే ఉన్నారు. మ్యూజిక్, డ్యాన్స్‌లో పట్టు ఉన్నవాళ్లు దానిలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ముఖ్యంగా ఏఐ వచ్చాక టెక్నాలజీ అంటే ఉండే భయం సీనియర్లలో బాగా తగ్గిపోయింది.
ఏఐని అసిస్టెంట్‌లా వాడుకుంటూ స్క్రిప్ట్, వీడియో ఎడిటింగ్, ప్రజంటేషన్లు, ట్రాన్స్లేషన్ అన్నీ ఈజీగా చేసుకుంటూ తమ ఎక్స్‌పీరియన్స్‌ను వీడియోల రూపంలో అందరికీ అందిస్తున్నారు. ఏజ్‌వెల్ ఫౌండేషన్ 2025 సర్వే ప్రకారం 55 ఏళ్లు పైబడిన వారిలో ఏకంగా 73 శాతం మంది ఉద్యోగ విరమణ తర్వాత కూడా పనిచేయాలని అనుకుంటున్నారు. కాకపోతే వారిలో 23.1 శాతం మందికే అవకాశాలు వస్తున్నాయి. మొత్తంగా అనుభవం, కొత్త టెక్నాలజీ కలిస్తే రిటైర్మెంట్ తర్వాత(After Retirement) కూడా లైఫ్ ఎంతో యాక్టివ్‌గా సాగుతోంది.
