Belief : మైండ్ అండ్ రిలేషన్‌షిప్స్..పార్ట్‌నర్స్ మధ్య నమ్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అంత ముఖ్యమా?

Belief : మన పార్ట్‌నర్‌కు ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు. నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమ మనసును బలంగా చేస్తే.. నమ్మకం ఆ బంధాన్ని బలంగా మారుస్తుంది.

Belief

ప్రేమలో ఉన్నా, పెళ్లి బంధంలో ఉన్నా.. ఒక రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా నిలబడటానికి అత్యంత ముఖ్యమైన పునాది నమ్మకమే(Belief) అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు తమ జీవితాన్ని పంచుకుంటున్నప్పుడు ఇద్దరి మధ్య ఆకర్షణ, ఇష్టాలు ఎంత ముఖ్యమో.. ఒకరిపై ఒకరికి ఉండే అచంచలమైన నమ్మకం అంతకంటే వెయ్యి రెట్లు ముఖ్యం అంటారు .ఇదే విషయాన్ని సైకాలజీ కూడా అంగీకరిస్తుంది.

సైకాలజీ చెబుతున్న దాని ప్రకారం.. మనుషులు ఏ రిలేషన్‌ లోనైనా వెతుక్కునే మొదటి విషయం ఎమోషనల్ సేఫ్టీ లేదా మానసిక భద్రత. ఎదుటి వ్యక్తి తనను ఏ పరిస్థితిలోనూ మోసం చేయడు, నా పక్కన కొండంత అండగా ఎప్పుడూ ఉంటాడనే ధైర్యం పార్ట్‌నర్‌కు కలిగినప్పుడు మాత్రమే ఆ బంధం చాలా కాలం పాటు సంతోషంగా సాగుతుంది. ఆ నమ్మకానికి ప్రాణం పోసేదే పార్ట్‌నర్ ఇచ్చే మాట అలాగే దాన్ని నిలబెట్టుకునే ఆ వ్యక్తి వైఖరి.

ఈ నమ్మకాన్ని సైకాలజిస్టులు ఒక ఎమోషనల్ బ్యాంక్ అకౌంట్‌తో పోలుస్తారు. మనం భాగస్వామికి ఇచ్చే ప్రతి చిన్న మాటను నిలబెట్టుకున్నప్పుడు ఆ అకౌంట్‌లో నమ్మకం అనే డిపాజిట్ పెరుగుతూ ఉంటుంది. అది టైమ్‌కి ఇంటికి వస్తా, లేదంటే ఫలానా టైమ్‌కు కాల్ చేస్తా అని చెప్పే చిన్న చిన్న విషయాలైనా కావొచ్చు. లేదంటే జీవితాంతం తోడుంటా అని ఇచ్చే పెద్ద మాటైనా కావచ్చు.

ఇచ్చిన మాట ప్రకారం నడుచుకున్నప్పుడు పార్ట్‌నర్ మెదడులో ఆందోళన తగ్గి.. ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అదే పదేపదే చిన్న చిన్న విషయాల్లో కూడా మాట తప్పుతుంటే, వారి మనసులో తెలీకుండానే ఒక రకమైన భయం, అభద్రతాభావం మొదలయిపోతుంటాయి.

ప్రేమలోనూ, పెళ్లిలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే కాదు.. అది అవతలి వ్యక్తి తాలూకా నిజమైన క్యారెక్టర్‌ని చూపిస్తుంది. ఒకసారి కనుక ఆ బంధంలో నమ్మకం దెబ్బతింటే, దాన్ని మళ్లీ సరిచేయడం చాలా కష్టమైన పని. పదే పదే మాట తప్పడం వల్ల పార్ట్‌నర్‌కి కలిగే బాధ కేవలం కోపంతో ముగిసిపోదు, అది వారిని తీవ్రమైన మనోవేదనకు గురి చేయడమే కాక, బంధం దూరం అయ్యే అవకాశం కూడా ఉంటుంది.

ఎందుకంటే నిలకడ లేని మాటలు, నెరవేర్చని వాగ్దానాలు భాగస్వాముల మధ్య ప్రేమను తగ్గించడమే కాదు.. మెల్లమెల్లగా వారిద్దరి మధ్య మాటలను, చనువును కూడా తగ్గిస్తాయి. ఎప్పుడైతే ఎదుటివ్యక్తి మాటల మీద నమ్మకం పోతుందో, అక్కడ అతిగా ఆలోచించడం, రోజువారీ గొడవలు ఎక్కువ అవడం కామన్‌గా జరుగుతుంటాయి.

అందుకే ఒక మంచి రిలేషన్‌షిప్‌ని కాపాడుకోవాలంటే మాట ఇచ్చే ముందే ఆలోచించుకోవాలి. ఒకసారి కమిట్ అయ్యాక ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నించాలి. ఒకవేళ అది సాధ్యం కాదు అనుకుంటే ముందే ఓపెన్‌గా, నిజాయితీగా చెప్పడం కూడా నమ్మకాన్ని పెంచే ఒక మంచి మార్గమే అవుతుంది.

Belief

మాటల కంటే మనం చేసే పనులే ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడతాయన్న విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి.మాటలు ఎన్నయినా ఈజీగా చెప్పేయొచ్చు. అది ఆచరణలో చూపించడమే పార్ట్‌నర్‌లోని నిజాయితీని ప్రూవ్ చేస్తుంది. అలాగే అండగా ఉంటామని చెప్పడమే కాదు, మన ప్రవర్తనలో కూడా దాన్ని చూపించినప్పుడే బాండింగ్ స్ట్రాంగ్ అవుతుంది.

నిజాయితీ, మాట నిలబెట్టుకునే గుణమే ఏ జంటనైనా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంచే అసలైన సీక్రెట్ అంటారు మానసిక నిపుణులు. చివరిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే మన పార్ట్‌నర్‌కు ప్రేమను మాత్రమే ఇస్తే సరిపోదు. నమ్మకాన్ని కూడా ఇవ్వాలి. ఎందుకంటే ప్రేమ మనసును బలంగా చేస్తే.. నమ్మకం ఆ బంధాన్ని బలంగా మారుస్తుంది.

Date Of Birth : నెంబర్ వారికి కొత్త అవకాశాలు తలుపు తడతాయి.. వీరికి మాత్రం ఆటంకాలు

Exit mobile version