Chicken Pickle : నెలల తరబడి పాడవని చికెన్ పచ్చడి.. ఈ 2 సీక్రెట్ టిప్స్ పాటిస్తే టేస్ట్ అదుర్స్..

Chicken Pickle : చికెన్ పచ్చడి పెట్టిన వెంటనే కంటే 2 రోజుల తర్వాత తింటే ముక్కలకు ఉప్పు,కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది.

Chicken Pickle

ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదంటే వంట చేసే ఓపిక , మూడ్ లేనప్పుడు టేస్టీగా, ఘాటుగా,కమ్మగా చికెన్ పచ్చడి ఉంటే చాలు.. ఆ పూట భోజనం అదిరిపోయినట్లే. అందులోనూ ఆంధ్రా స్టైల్‌లో పెట్టిన చికెన్ పచ్చడి నెలల తరబడి నిల్వ ఉండటమే కాకుండా రోజు రోజుకీ టేస్ట్ కూడా పెరుగుతుంది.

దీనికి నాటుకోడి కంటే కూడా బాయిలర్ చికెన్ బాగుంటుంది, అలాగే పీసులను డీప్ ఫ్రై చేయకుండా లైట్‌గా వేయిస్తే పచ్చడి జ్యూసీగా ఉంటుంది.ముక్కలు గట్టిగా రాకుండా పక్కా కొలతలతో చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.

ఈ పచ్చడి కోసం కావాల్సిన పదార్థాలు.. కేజీ చికెన్, 400 గ్రాముల నూనె, అరకప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్, 50 గ్రాముల సాల్ట్, 50 గ్రాముల పచ్చళ్ల కారం, కొద్దిగా గరం మసాలా, ఒక టీస్పూన్ మెంతి పొడి, మూడు టీస్పూన్ల నిమ్మరసం, ఒక టీస్పూన్ పసుపు.

పికెల్ తయారీ చేయడానికి చికెన్‌ను శుభ్రంగా కడిగి ఉప్పు, పసుపు కలుపుకొని కడాయిలో వేసి మీడియం ఫ్లేమ్‌ మీద ఉంచాలి. చికెన్ నుంచి వచ్చే వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. నీరు ఇంకిపోయాక వేరే కడాయిలో ఆయిల్ పోసి వేడి అయ్యాక చికెన్ ముక్కలను వేసి డీప్ ఫ్రై చేయాలి. అయితే ముక్కలు మరీ గట్టిగా కాకుండా కాస్త కలర్ మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.ఇది మొదటి టిప్ అనుకోవాలి.

మిగిలిన ఆ నూనెలోనే అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేవరకూ దోరగా వేపాలి. ఆ తర్వాత అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలను, మెంతి పొడి, ఉప్పు, కారం, గరం మసాలా వేసి బాగా కలిపి ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆపేయాలి.

Chicken Pickle

స్పైసీగా కావాలనుకుంటే ఇంట్లో రెడీ చేసిన గరం మసాలాను మాత్రమే వాడాలి. ఇది పచ్చడి టేస్టీగా రావడానికి రెండో టిప్‌గా పనికొస్తుంది. ఇది పూర్తిగా చల్లారడానికి కనీసం మూడు గంటల సమయం పడుతుంది. చల్లారిన తర్వాత ఆయిల్ పైకి తేలగానే నిమ్మరసం కలుపుకొని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

పచ్చడి పెట్టిన వెంటనే కంటే 2 రోజుల తర్వాత తింటే ముక్కలకు ఉప్పు,కారం బాగా పట్టి టేస్ట్ బాగుంటుంది. ఈ పచ్చడి ఫ్రిడ్జ్‌లో ఉంచితే మూడు నుంచి ఆరు నెలలు, బయట ఉంచితే రెండు నెలల పాటు పాడవకుండా ఉంటుంది.

Free Education : చెత్త ఇస్తే చదువు చెప్తారు.. ప్లాస్టిక్ వ్యర్థాలే స్కూల్ ఫీజు ఎక్కడో తెలుసా?

Exit mobile version