Decision
కెరీర్‌లో ముందుకు వెళ్లాలన్నా, పర్సనల్ లైఫ్‌లో ఎదురయ్యే ప్రాబ్లెమ్స్ దాటాలన్నా సరైన టైమ్‌లో సరైన డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ చిన్న నిర్ణయానికి కూడా ..నేనేం చేయాలి అని ఫ్రెండ్స్‌కో, ఇంట్లో వాళ్లకో ఫోన్ చేసి అడిగే అలవాటు చాలామందికే ఉంటుంది.
ఇలా ప్రతిసారీ మన పక్కన ఎవరో ఒకరు ఉండరనే నిజాన్ని మనం గుర్తుంచుకోవాలి. కొన్నిసార్లు మన లైఫ్‌కు మనమే బాస్ అయి, ధైర్యంగా డెసిషన్స్(Decision) తీసుకోగలగాలి. దీనికోసం కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే ఎవరైనా ఈ డెసిషన్ మేకింగ్ స్కిల్స్(Decision Making Skill) పెంచుకోవచ్చు.
ముందుగా మన ఆలోచనలపై మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏదైనా ఇన్ఫర్మేషన్ విన్నప్పుడు గుడ్డిగా నమ్మకుండా ఒకటికి రెండుసార్లు డీప్‌గా ఆలోచిస్తే బ్రెయిన్ అనవసర ఆలోచనలను వడకడుతుంది. ఏదైనా డెసిషన్ తీసుకునే ముందు అప్పటికప్పుడు, హడావుడిగా కాకుండా కాస్త టైమ్ తీసుకోవాలి. దీనినే ‘కాగ్నిటివ్ రిఫ్లెక్షన్’ అంటారు.
కాస్త టైమ్ ఇవ్వడం వల్ల సమస్యను వేరే యాంగిల్‌లో చూసే అవకాశం దక్కుతుంది. అలాగే ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడం, ఎమోషన్స్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడం వల్ల విచక్షణ పెరుగుతుంది. ఇది టెన్షన్,హర్రీ లేకుండా సరైన డెసిషన్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది.
అలాగే మనమే తప్పులు చేసి తెలుసుకోవడమే కాకుండా, ఇతరుల ఎక్స్‌పీరియన్స్ గమనించి నేర్చుకోవడం అనేది కూడా ఒక స్మార్ట్ వర్క్ అని తెలుసుకోవాలి. ఎందుకంటే మన తప్పేంటో తెలుసుకోవడానికి సేమ్ పొరపాటు మన లైఫ్‌లో ఫేస్ చేసి నేర్చుకోవాలనుకోవడం పిచ్చితనం అవుతుంది.
ఉదాహరణకు నిప్పు పట్టుకుంటే కాలుతుందని అందరికీ తెలుసు. అందుకే నిప్పుకు దూరంగా ఉండాలి. నేను పట్టుకుని ఆ కాలడాన్ని తెలుసుకుని అప్పుడు నిప్పుకు దూరంగా ఉంటాను అని ఎవరూ అనుకోరు . అందుకే ఇలాంటివి కూడా దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకోవాలి.
అంతేకాకుండా గతంలో మనం తీసుకున్న డెసిషన్స్(Decision ఎంతవరకు వర్కవుట్ అయ్యాయి, ఎక్కడ తప్పు చేశామనేది రివ్యూ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే తప్పుల నుంచి నేర్చుకున్న లెసన్సే ఫ్యూచర్‌లో సరైన రూట్ చూపిస్తాయి.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఒక సమస్యకు పది రకాల ఆప్షన్లు పెట్టుకుంటే బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకే ఆప్షన్లు అన్నిటినీ ఫిల్టర్ చేసి కేవలం టాప్ 2 లేదా 3 ఆప్షన్లపైనే ఫోకస్ పెడితే మైండ్‌కి క్లారిటీ వచ్చి పక్కా నిర్ణయం తీసుకోగలుగుతారు.
