Hopelessness:అదృశ్య సంకెళ్లు ఆపేస్తున్నాయా? నిస్సహాయత మిమ్మల్ని డామినేట్ చేస్తుందా?

Hopelessness: ఒక బిజినెస్‌లో నష్టం వచ్చినా, ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా.. ఇక మన జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతుంటాం.

Hopelessness

కొన్నిసార్లు ఒక పనిని చేయగల సామర్థ్యం మనకు ఉన్నా కూడా మన వల్ల కాదని ఆగిపోతాం. ఎందుకంటే మన గతం మనల్ని వెనక్కి లాగుతుంటుంది. రెండో వ్యక్తి ప్రమేయం లేకుండా మనకు మనం వేసుకునే ఈ మానసిక సంకెళ్లనే సైకాలజీలో నేర్చుకున్న నిస్సహాయత(Hopelessness )అని పిలుస్తారు.

దీనికోసం ఒక ఉదాహరణగా ఒక కథను చూస్తే.. ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో కుమార్ అనే వ్యక్తి పనిచేసేవాడు. నిజానికి అతను చాలా తెలివైనవాడు, కానీ కొత్త ప్రాజెక్ట్ ఏదైనా వస్తే మాత్రం విపరీతంగా భయపడిపోయేవాడు. దానికి కారణం కుమార్ గతమే.

కాలేజీ రోజుల్లో ఒక స్టార్టప్ ఐడియాతో ముందడుగు వేసిన కుమార్‌కు..దురదృష్టవశాత్తూ అది విఫలమవడం షాక్‌ను ఇచ్చింది. ఆ తర్వాత అటెండ్ అయిన ఒక ఇంటర్వ్యూలో కూడా అతను సరిగ్గా సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డాడు. ఈ రెండు సంఘటనల వల్ల కుమార్ మనసులో తాను దేనికీ పనికిరాను, తాను ఏం చేసినా ఫెయిల్ అవుతాననే నిస్సహాయత(Hopelessness )బలమైన ముద్రను వేసేసింది.

ఇప్పుడు అతని మేనేజర్ కుమార్‌కు ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడంతో ఆలోచనలో పడ్డాడు. కిరణ్‌కు ఆ పని ఎలా చేయాలో తెలుసు, కావాల్సిన స్కిల్, ట్యాలెంట్ ఉంది. కానీ అతని అంతరాత్మ మాత్రం ప్రయత్నించి ఏం లాభం? ఎలాగూ ఓడిపోతావు కదా అని హెచ్చరించడం మొదలుపెట్టింది.

Hopelessness

దీనివల్ల కుమార్ అసలు ప్రయత్నమే చేయకుండా ఆ అవకాశాన్ని వదిలేశాడు. దీనివల్ల కొలీగ్స్ అంతా కుమార్‌ను బద్ధకస్తుడిలా ట్రీట్ చేస్తారు. అయితే నిజానికి కుమార్ తన గత అనుభవాలు నేర్పిన నిస్సహాయత అనే జైలులో బందీ అయ్యాడన్న విషయాన్ని వారు గుర్తించలేకపోయారు.

మనం కూడా సేమ్ ఇలాగే జీవితంలో కొన్నిసార్లు ఆగిపోతుంటాం. ఒక బిజినెస్‌లో నష్టం వచ్చినా, ఒక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినా.. ఇక మన జీవితం ఇంతే అని ఫిక్స్ అయిపోతుంటాం. కానీ సైకాలజీ ప్రకారం, మన మెదడుకు మనమిచ్చే సిగ్నల్స్ బట్టి మన ఫ్యూచర్ ఉంటుంది. గతంలోని ఫెయిల్యూర్ ఒక అనుభవం మాత్రమే, అది మీ సామర్థ్యానికి మెజర్మెంట్ కాదు. ఆ అదృశ్య సంకెళ్లను తెంచుకుని మనంతట మనం ముందడుగు వేసినప్పుడే అసలైన విజయాన్ని చూడగలం.

Rashid Khan : తిప్పేసిన రషీద్ ఖాన్..గుజరాత్ చేతిలో రాజస్థాన్ చిత్తు

Exit mobile version