Driving Licence
కారు కానీ బైక్ కానీ నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిందే .. అయితే ఇప్పటివరకు అందరికీ ఉండే ఒకే రకమైన డీఎల్ కార్డులు ఇకపై కలర్ మార్చుకోబోతున్నాయి. దేశవ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్సుల జారీ ప్రాసెస్‌ను మరింత కఠినతరం చేయడానికి, నకిలీ డాక్యుమెంట్లకు పూర్తిగా చెక్ పెట్టడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నడుం బిగించింది. దీనిలో భాగంగా మోటారు వెహికల్ నిబంధనలలో భారీ మార్పులను చేస్తూ ఒక కొత్త ముసాయిదా నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది.
ఈ మార్పులలో మొదటగా చెప్పుకోవాల్సింది కలర్స్ గురించి. భారత దేశ పౌరులు ఎవరో, విదేశీయులు ఎవరో ఇట్టే గుర్తుపట్టేలా వేర్వేరు కలర్స్‌లో ఇకపై డ్రైవింగ్ లైసెన్సు(Driving Licence) కార్డులను జారీ చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. అంతేకాదు, ఆ కార్డు మీద క్లియర్‌గా జాతీయతను కూడా ముద్రిస్తారు.
ఇక ఆన్‌లైన్‌లో లైసెన్స్(Driving Licence) కోసం జరుగుతున్న సేఫ్ డ్రైవింగ్ ట్యుటోరియల్ అసెస్‌మెంట్‌లో పాస్ మార్కు ఇప్పటి వరకూ 60 శాతం ఉండగా ఇప్పుడు దానిని ఏకంగా 75 శాతానికి పెంచనున్నారు. ఈ టెస్ట్ కనీసం 30 నిమిషాల పాటు సాగేలా కొత్త రూల్‌ను కూడా తీసుకువస్తున్నారు. అలాగే ప్రతీ డ్రైవింగ్ లైసెన్స్‌పై వారి బ్లడ్ గ్రూప్, మొబైల్ నంబర్, అత్యవసర సమయాల్లో సంప్రదించాల్సిన నెంబర్‌ను తప్పనిసరిగా ప్రింట్ చేయబోతున్నారు.
ఇకపై అడ్రస్ లేదా ఏజ్ ప్రూఫ్ కోసం ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్లు ఇచ్చే అఫిడవిట్లు కానీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను కానీ అస్సలు అంగీకరించబోమని స్పష్టం చేశారు. ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, ఈ-రేషన్ కార్డు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లులను మాత్రమే ప్రామాణికంగా తీసుకుంటారు.
ఒకవేళ మీరు అడ్రస్ ఛేంజ్ కోసం దరఖాస్తు చేసుకుంటే 30 రోజుల్లోగా క్లియర్ చేసుకోవాలి. లేదంటే ఆటోమేటిక్‌గా అదే అప్రూవ్ అయిపోతుంది. ప్రస్తుతం ఇదంతా ముసాయిదా దశలోనే ఉన్నా ..దీనిపై త్వరలోనే తుది నిర్ణయం వెలువడనుంది.
