Edible Camphor : పచ్చ కర్పూరానికీ, నార్మల్ కర్పూరానికీ తేడా ఏంటి ?మనం వెలిగించే కర్పూరం ప్రమాదకరమా?

Edible Camphor : అందుకే తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు కొన్ని ప్రత్యేక వంటకాలలో, ఆయుర్వేద మందుల్లో పచ్చి కర్పూరాన్ని వాడతారు.

Edible Camphor

పూజా మందిరంలో మనం ప్రతిరోజూ వెలిగించే కర్పూరం వెనుక ఎన్ని రహస్యాలు ఉన్నాయో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. అయితే మనం పూజలకు వాడే తెల్ల కర్పూర బిళ్లలు, ప్రసాదాలలో.. ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డులో వేసే పచ్చ కర్పూరం(Edible Camphor) చూడటానికి రెండు తెలుపు రంగులోనే ఉంటాయి.

కానీ వీటి తయారీ విధానంతో పాటు మన ఆరోగ్యంపై చూపించే ప్రభావం మాత్రం పూర్తిగా వేర్వేరుగా ఉంటుంది. చాలా మంది ప్రసాదాలు వంటి వాటిలో వాడే కర్పూరాన్ని పచ్చ కర్పూరం అని పిలుస్తారు. నిజానికి దానిని పచ్చి కర్పూరం (Raw Camphor / Edible Camphor) అంటారు. ఈ అసలైన కర్పూరం (పచ్చి కర్పూరం) పూర్తిగా ఒక చెట్టు నుంచి వస్తుంది.

ఆ చెట్టు బెరడు, ఆకులు, కాండం వంటి పచ్చి భాగాలను తీసుకుని, స్టీమింగ్ (Steaming) తర్వాత డిస్టిలేషన్ ప్రాసెస్ ద్వారా క్రిస్టలైజ్డ్ రూపంలోకి మారుస్తారు. అందుకే దీనిని పచ్చి కర్పూరం లేదా నేచురల్ కర్పూరం అంటారు. ఇది కంప్లీట్లీ ఎడిబుల్ అంటే తినదగినది అని అర్ధం. అందుకే తిరుమల శ్రీవారి లడ్డూతో పాటు కొన్ని ప్రత్యేక వంటకాలలో, ఆయుర్వేద మందుల్లో కూడా దీనిని వాడతారు.

ఈ కర్పూరాన్నిచ్చే చెట్టు శాస్త్రీయ నామం సినమోమం క్యాంఫోరా (Cinnamomum camphora). అంటే మనం రెగ్యులర్‌గా వంటల్లో వాడే దాల్చిన చెక్క (Cinnamon) కూడా ఇదే ఫ్యామిలీకి చెందిన చెట్టు కావడం విశేషం. ఇవి రెండూ ఒకే వంశానికి చెందినవి కావడంతోనే వాటి సువాసనలో ఆ దగ్గర తనం కనిపిస్తుంది.

మరి మనం రోజూ దేవుడి పూజకు వాడుతున్న సాధారణ కర్పూరం బిళ్లల సంగతికి వస్తే .. అవి ఎడిబుల్ కాదు, హైలీ టాక్సిక్ రకానికి చెందినవి. టర్పెంటైన్ ఆయిల్ (Turpentine Oil) అనే పెట్రోలియం బై-ప్రొడక్ట్ నుంచి ఈ కర్పూరాన్ని తయారు చేస్తారు. ఉడ్ వార్నిష్‌లకు వాడే ఈ కెమికల్స్‌తోనే ఈ సాధారణ కర్పూర బిళ్లలను తయారు చేస్తుంటారు. వీటిని వెలిగించినప్పుడు వచ్చే హారతి పొగ హెల్త్‌కు ఎంతమాత్రం మంచిది కాదు. అందుకే ఈ టాక్సిక్ ప్రభావం వల్లే ఇప్పుడు చాలా దేవాలయాల్లో కర్పూర హారతిని బ్యాన్ చేసి, కేవలం దీప హారతిని మాత్రమే ఇస్తున్నారు.

అయితే మార్కెట్లో దొరికే వాటిలో ఈ కెమికల్ కర్పూరానికి బదులు, ఆయుర్వేదంలో చెప్పిన విధంగా కానీ, పూజాపరంగా కేవలం ‘భీమసేని కర్పూరం’ (Bheemsaini Camphor / Barus Camphor) వాడటం ఆరోగ్యానికి, వాతావరణానికి చాలా మంచిది. కెమికల్స్‌తో తయారైన హారతి కర్పూరానికి చెక్ పెట్టి.. ప్రకృతి సిద్ధంగా చెట్ల నుంచి తయారయ్యే స్వచ్ఛమైన కర్పూరాన్ని ఎంచుకోవడమే మంచిది.

Ranabaali : విజయ్ దేవరకొండ మాస్ రౌద్రం.. రణబాలి ఎలా ఉందంటే..

↑
Exit mobile version