Exercises In Old Age
అరవై ఏళ్లు దాటగానే కాళ్లు చేతుల్లో స్ట్రెంత్ తగ్గడం, నిలబడితే కాళ్లు వణకడం, కండరాలు కరిగిపోయి పట్టు కోల్పోవడం చూస్తూనే ఉంటాం. వర్కవుట్స్ చేసినా, కాసేపు నడిచినా కండరాలు గట్టిపడతాయని డాక్టర్లు చెబుతారు కానీ.. దీనికి కరెక్ట్ రీజన్ మాత్రం ఎవరికీ పెద్దగా తెలీదు.
అయితే డైలీ వ్యాయామాలు చేసినప్పుడు లోపల కండరాల కణాల్లో ఏం జరుగుతుంది? ముసలితనంలో వదులైపోయే కండరాలను వర్కవుట్ మళ్లీ ఎలా రీసెట్ చేస్తుందనే దానిపై సైంటిస్టులు కళ్లు చెదిరే ఆన్సర్‌ను కనిపెట్టారు. అమెరికాలోని ఫేమస్ డ్యూక్-ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ రీసెర్చర్స్.. మన కండరాల్లో ఉండే ఒక సీక్రెట్ జీన్ స్టోరీని బయటపెట్టారు.
బాడీలో ఉండే కండరాలు కేవలం బరువులను మోయడానికే కాదు.. మెటబాలిజంను బ్యాలెన్స్ చేయడానికి, షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్ చేయడానికి కూడా చాలా చాలా అవసరమని సైన్స్ చెబుతుంది. సాధారణంగా యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు మజిల్ సెల్స్‌లో న్యూ ప్రోటీన్ల తయారీతో పాటు, పాడైపోయిన ప్రోటీన్లను బయటకు పంపించే ప్రాసెస్ పర్ఫెక్ట్‌గానే జరుగుతుంది.
కానీ ఏజ్ పెరిగే కొద్దీ mTORC1 అనే సిగ్నలింగ్ మార్గం అవసరానికి మించి యాక్టివ్ అయిపోతుంది. దీనివల్ల సెల్స్ కేవలం కొత్త ప్రోటీన్లనే ప్రిపేర్ చేస్తూ, లోపల పేరుకుపోయిన చెత్తను, పాడైపోయిన ప్రోటీన్లను శుభ్రం చేయడం మానేస్తాయి. దీంతో ఆ మిగిలిన వేస్ట్ అంతా కండరాల సెల్స్‌లో పేరుకుపోయి, మజిల్స్ దారుణంగా బలహీనపడతాయి.
ఈ టోటల్ సిస్టమ్‌ను కంట్రోల్ చేసే మెయిన్ విలన్ DEAF1 అనే జీన్ అని సైంటిస్ట్‌లు ప్రయోగాల ద్వారా నిరూపించారు. చిన్నతనంలో ఈ DEAF1 జీన్ ఎక్కువగా పనిచేయకుండా FOXO అనే ప్రోటీన్ల టీమ్ దానిపై కంట్రోల్ ఉంచుతుంది. కానీ ఏజ్ పెరిగే కొద్దీ ఈ FOXO పవర్ తగ్గిపోయి, DEAF1 జీన్ లిమిట్‌కి మించి రెచ్చిపోతుంది. ఇది ఎంత పెరిగితే mTORC1 అంత ఎక్కువవడంతో.. మజిల్ క్లీనింగ్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అవుతుంది.
ఇక్కడే వర్కవుట్ ఒక రోబోటిక్ మ్యాజిక్‌లా పనిచేస్తుందని సైంటిస్టులు అంటున్నారు మనం ఫిజికల్ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు, అది బాడీలో కొన్ని స్పెషల్ ప్రోటీన్లను యాక్టివేట్ చేసి, ఈ అల్లరి చేస్తున్న DEAF1 జీన్ లెవెల్స్‌ను బయటకు రాకుండా తొక్కిపడేస్తుంది.
దీంతో mTORC1 మళ్లీ బ్యాలెన్స్ అవుతుంది. దీంతో మజిల్స్ తమ లోపల పేరుకుపోయిన పాయిజినస్ చెత్తను తామే క్లీన్ చేసుకుని, సెల్ఫ్ రిపేర్ మోడ్‌లోకి వెళ్తాయి. అంటే ఎక్సర్‌సైజ్ అనేది మన మజిల్స్‌కు ఒక రకమైన ఆటోమేటిక్ క్లీన్ అండ్ రీసెట్ బటన్‌లా పనిచేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు.
సైంటిస్టులు తమ రీసెర్చ్‌ను ప్రూవ్ చేయడానికి ఈగలు, ఎలుకలపై డీప్ ప్రయోగాలు చేశారు. వాటిలో DEAF1 లెవెల్స్ పెంచినప్పుడు మజిల్స్ ఫాస్ట్‌గా వీక్ అవడం, అదే DEAF1 ను తగ్గించినప్పుడు మజిల్స్ మళ్లీ స్ట్రాంగ్‌గా పెరగడం గమనించారు. అంతేకాకుండా, దెబ్బతిన్న మజిల్స్‌ను మళ్లీ కొత్తగా నిర్మించే మజిల్ స్టెమ్ సెల్స్ పనితీరుపై కూడా ఈ DEAF1 జీన్ ఎఫెక్ట్ చూపిస్తున్నట్లు తేలింది.
అయితే ఓల్డ్ ఏజ్ పీపుల్‌లో కొంతమంది ఒకే రకమైన ఎక్సర్‌సైజ్(Exercises In Old Age) చేసినా ఒకరికి బాగా మజిల్స్ పెరుగుతాయి, మరొకరికి పెద్దగా తేడా కనిపించదు. దానికి కారణం వారి బాడీలో ఈ DEAF1, FOXO లెవెల్స్ హెచ్చుతగ్గులుగా ఉండటమేనని సైంటిస్టులు గుర్తించారు. ఫ్యూచర్‌లో ఈ DEAF1 ని కంట్రోల్ చేసే టాబ్లెట్స్ లేదా మెడిసిన్స్ కనుక వస్తే.. బెడ్‌రెస్ట్‌లో ఉన్నవారు, ఆపరేషన్ అయినవారు, ఏజ్ అయిపోయి ఎక్సర్‌సైజ్(Exercises In Old Age) చేయలేని వారు కూడా ఆ బెనిఫిట్స్ పొందే అవకాశం ఉంటుంది.
అయితే ఇది ప్రస్తుతానికి ల్యాబ్ స్థాయిలో ఎలుకలు, ఈగలపై సక్సెస్ అయిన పరిశోధన మాత్రమే. మనుషుల్లో ఈ క్లినికల్ ట్రయల్స్ పూర్తై మెడిసిన్ రావడానికి ఇంకా టైమ్ పడుతుంది. మొత్తంగా ఎక్సర్‌సైజ్ అనేది కేవలం బరువు తగ్గడానికే కాదు, మీ శరీరంలోని DEAF1 జీన్‌ను సైలెంట్ చేసి, మీ మజిల్స్‌ను ఏజ్ పెరిగినా యంగ్‌గా ఉంచే రియల్ యాంటీ-ఏజింగ్ మెడిసిన్ అన్నది మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు.
AQP4 Gene : రాత్రిళ్లు నిద్ర పట్టట్లేదా?..నైట్ టైమ్‌లో బ్రెయిన్‌లో జరిగే ‘జీన్’ కథ తెలుసుకోండి..
