Glowing Skin
మిర్రర్ ముందు నిలబడి ఫేస్ మీద పడిన చిన్న గీతలను చూసుకుంటూ చాలాసార్లు బాధపడిపోతుంటాం. అయితే ఏజ్ పెరుగుతున్న కొద్దీ స్కిన్ తన షైనింగ్‌ను, టైట్నింగ్ను ఎందుకు కోల్పోతుంది? మార్కెట్లో దొరికే వందల రకాల క్రీములు రాసినా ఆ మచ్చలు, ముడతలు ఎందుకు తగ్గవనే ప్రశ్నలకు చాలామంది సరిగ్గా సమాధానాలు చెప్పలేరు.
నిజానికి మన స్కిన్‌కు ప్రాణం పోసే ఆ అసలు రహస్యం కొల్లాజెన్ చుట్టూనే తిరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మన స్కిన్‌లో నేచురల్‌గానే ఎక్కువగా ఉండే ఈ ప్రోటీన్… ఎముకలకు, కణజాలాలకు ఒక బలమైన పిల్లర్‌లా నిలబడుతుంది. చిన్న ఏజ్‌లో స్కిన్ అంత టైట్‌గా, నిగనిగలాడుతూ ఉండటానికి కారణం ఇదే అని అంటున్నారు.
కాలం గడుస్తున్న కొద్దీ, మన బాడీ ఆ కొల్లాజెన్ తయారీని మెల్లమెల్లగా తగ్గిస్తుంది. దీంతోనే అసలైన సమస్య మొదలవుతుంది. చర్మం లూజ్ అవడం, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ రావడం, ముడతలు పడటం అప్పుడే కనిపిస్తాయి. అయితే ఇలాంటి వృద్ధాప్య ఛాయలను ముందే పసిగట్టి, ఆ కొల్లాజెన్ క్షీణించకుండా అడ్డుకోవడానికి కొన్ని ఈజీ దారులు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
రంగుల మాయలో పడిపోయే బదులు, ముందుగా విటమిన్ సి, అలాగే నాణ్యమైన సన్‌స్క్రీన్ వాడటాన్ని అలవాటు చేసుకోవాలి. ఇవి స్కిన్‌లో ఉన్న కొల్లాజెన్‌కు ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇక కొత్తగా కొల్లాజెన్ తయారవ్వాలంటే మాత్రం రెటినాయిడ్స్, పెప్టైడ్స్ వంటి పదార్థాలు అద్భుతంగా పనిచేస్తాయి.
అందుకే రోజూ కాస్ట్లీ క్రీములు పూయడం కాకుండా, మనం రోజూ తినే ఫుడ్‌లో ప్రోటీన్ శాతం సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ . ఎందుకంటే కొత్త కణాలు తయారవ్వడానికి కావాల్సిన ఇంధనం అదే కాబట్టి తప్పనిసరిగా ప్రోటీన్ ఫుడ్ తినాలి.
అలాగే కొంతమంది మైక్రోనీడ్లింగ్ వంటి లేటెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకుంటారు. ఇది కూడా మంచి ఫలితాలనే ఇస్తుందని అంటున్నారు. అలా అని మార్కెట్లో దొరికే కొల్లాజెన్ సప్లిమెంట్ల మీద విపరీతంగా డిపెండ్ అవడం కూడా కరెక్ట్ కాదని, అవి కేవలం పైపైన తేమను ఇస్తాయి. అంతే తప్ప అవేమీ అద్భుతాలు చేయలేవని నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు.
వీటన్నింటికీ మించి మన లైఫ్ స్టైల్‌ని కాస్త మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. రోజూ గంట సేపు కష్టపడి ఎక్సర్సైజ్ చేయడం, ముఖ్యంగా వెయిట్స్ ఎత్తే వెయిట్ లిఫ్టింగ్ వంటి వ్యాయామాలు చేయడం వల్ల శరీరంలో కొత్త కొల్లాజెన్(Glowing Skin) అద్భుతంగా ఉత్పత్తి అవుతుందని ఇటు రీసెర్చ్‌లు కూడా చెబుతున్నాయి. అలాగే చిన్న ఏజ్ నుంచే చర్మాన్ని కాపాడుకోవడం మొదలుపెడితే ..ముసలితనం ఛాయలు దగ్గరకు రావు.
The Silence Of Men : ఐ యామ్ ఫైన్ వెనుక దాగున్న మగవారి సైలెన్స్..సైకాలజీ ఏం చెబుతోందో తెలుసా?
