Hair Loss
జుట్టు దువ్వుకున్నాక దువ్వెనను చూసినా, నిద్రలేచాక పిల్లో వైపు చూసినా, హెడ్ బాత్ చేస్తున్నప్పుడు డ్రైనేజీ వద్ద గుప్పెడు జుట్టు కనిపించినా.. చెప్పలేని బాధ వేధిస్తుంది. అయితే జుట్టు రాలడమనేది చాలా మందిలో సాధారణంగా కనిపించే విషయమే. కానీ అది ఓ స్థాయి వరకు ఉంటే భయపడాల్సిన పనిలేదని, పరిమితి దాటితే మాత్రం హెయిర్ స్పెషలిస్ట్‌ను కలవాలని నిపుణులు అంటున్నారు.
సీజన్లను బట్టి జుట్టు రాలడమనేది సాధారణ విషయమే ఎందుకంటే.. మన తలపై ఉండే వెంట్రుకల కుదుళ్లు నిత్యం పెరగడం, విశ్రాంతి తీసుకోవడం అనే స్టేజెస్ గుండా వెళ్తుంటాయి. పగటి టైమ్ తగ్గినపుడు లేదా మనం వెలుతురు తక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రయాణించినప్పుడు, బాడీలోని హార్మోన్ల రియాక్షన్ వల్ల ఒకేసారి చాలా కుదుళ్లు రెస్టింగ్ ఫేజ్‌లోకి వెళ్తాయి.
ఆ తర్వాత కొన్ని నెలలకు ఆ వెంట్రుకలన్న కూడా ఒకేసారి రాలిపోతాయి. కాబట్టి వాతావరణం మారినప్పుడు కొద్ది రోజులు జుట్టు రాలడమనేది కేవలం శరీరంలోని హార్మోన్ల రియాక్షన్లు మాత్రమే తప్ప, అదో పెద్ద జబ్బు కాదు.
అయితే ఇలాంటి సీజనల్ హెయిర్ లాస్‌కి, టెలోజెన్ ఎఫ్లూవియమ్ అనే తీవ్రమైన మెడికల్ కండిషన్‌కి మధ్య చాలా తేడా ఉంది. ఈ రెండింటినీ టైమ్, తీవ్రత ఆధారంగా ఈజీగా గుర్తించొచ్చు. సీజనల్ షెడ్డింగ్ అనేది చాలా మైల్డ్‌గా ఉంటుంది. అండ్ రెండు నుంచి మూడు నెలల తేడాలోనే దానంతట అదే తగ్గిపోతుంది.
కానీ టెలోజెన్ ఎఫ్లూవియమ్ అనేది శారీరక ఒత్తిడి, ఏదైనా పెద్ద అనారోగ్యం, సర్జరీలు, మానసిక ఆందోళన వల్ల వచ్చే హెల్త్ కండిషన్ అని నిపుణులు చెబుతున్నారు. దీనిలో జుట్టు ఊడటం చాలా ఎక్కువగా ఉంటుంది. తలకు స్నానం చేసేటప్పుడు గుప్పెళ్ల కొద్దీ జుట్టు ఊడిరావడం, పాపిట తీసే చోట లేదంటే నుదుటి పక్క భాగాల్లో జుట్టు పల్చబడటం క్లియర్‌గా కనిపిస్తుంది. ఆరు నెలలు దాటినా ఈ సమస్య తగ్గకపోతే మాత్రం దాన్ని క్రోనిక్ కండిషన్‌గా పరిగణిస్తారు.
మీ హెయిర్ రాలేటపుడు కొన్ని లక్షణాలు కనిపిస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. జుట్టు రాలడం 3 నెలలకు పైగా నాన్‌స్టాప్‌గా కొనసాగుతున్నా, తలలో ఒకే నిర్దిష్టమైన ప్రాంతంలో జుట్టు ఊడిపోతున్నా, మాడు క్లియర్‌గా బయటకు కనిపిస్తున్నా వెంటనే మేల్కోవాలి.
అలాగే ఒత్తుగా ఉన్న జుట్టు పలుచగా అయిపోయినా, లేదా ఏదైనా ఫీవర్ వచ్చాక, క్రాష్ డైటింగ్ చేశాక, ప్రసవం తర్వాత లేదంటే విపరీతమైన ఒత్తిడికి గురైన తర్వాత జుట్టు విపరీతంగా రాలుతుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్పెషలిస్ట్‌ని సంప్రదించాలి.
అంతేకాకుండా థైరాయిడ్ సమస్యలు, ఐరన్ లోపం లేదంటే స్టార్టింగ్ స్టేజ్‌లో ఉన్న ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటే వంశపారంపర్య బట్టతల వంటి లోపాలు దీనికి కారణం కావొచ్చు. అందుకే మరీ లేట్ చేయకుండా డాక్టర్‌ని కలిసి చెకప్ చేయించుకోవడం మంచిది.
Moroccan Red Clay : క్లియోపాత్రా బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. ఈ నేచురల్ క్లే ఇంట్లోనే ఇలా వాడండి..
