Katuruva
వర్షాలు ప్రారంభం కాగానే యూపీలోని మార్కెట్లలో ఒక అరుదైన అడవి వెజిటబుల్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతుంది. లోకల్‌లో దీనిని కటరువా అని పిలుస్తారు. దీని ధర వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే.
నిజానికి దీని ధర మటన్ కంటే కూడా చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయినా సరే, ప్రజలు దీనిని కొనడానికి మార్కెట్ల వద్ద పెద్ద ఎత్తున క్యూలు కడుతూఉంటారు. ముఖ్యంగా శాకాహారులకు ఇది ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయంగా, సూపర్ ఫుడ్‌గా నిలుస్తోంది.
మార్కెట్‌లో ఈ కటరువా ధర కిలో రూ. వెయ్యి నుంచి రూ. పన్నెండు వందల వరకు పలుకుతుంది. కొన్నిసార్లు దీని రేటు మరింత పెరిగినా జనాలు మాత్రం ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. వర్షాకాలంలో మాత్రమే దొరికే ఈ కూరగాయ రుచిలో నాన్ వెజ్ వంటకాలకు గట్టి పోటీ ఇస్తుంది.
కటరువాలో ప్రోటీన్లు చాలా ఎక్కువగా ఉండటం వల్ల మాంసాహారం తినని వారంతా దీనినో వరంగా అనుకుంటారు. అందుకే ప్రతి ఏటా దీని ధర ఆకాశాన్ని తాకుతున్నా కూడా కొనేవారి సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.
పోషకాల విషయానికి వస్తే ఈ వెజిటబుల్‌లో శరీరానికి అవసరమైన విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బాడీకి కావాల్సిన శక్తి అందుతుంది. ముఖ్యంగా కొంతమంది రోజంతా అలసట, నీరసం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటివారికి ఇదొక మెడిసిన్ వంటిది.
శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి కటరువా(Katuruva) ఎంతో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులే చెబుతుంటారు. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచడానికి, గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉండటం వల్లే ఈ ఫారెస్ట్ వెజిటబుల్‌కు మార్కెట్‌లో అంత డిమాండ్ ఉంటుందంటారు కటరువా లవర్స్.
Abhishek Banerjee : గంటలో రాజీనామా చేస్తా ..రెబల్స్‌కు మమత మేనల్లుడు సవాల్
