LemonGrass Tea : లెమన్‌గ్రాస్ హెర్బల్ టీ వల్ల ఇన్ని ప్రయోజనాలా? మరి ఎవరెవరు దీనికి దూరంగా ఉండాలి?

LemonGrass Tea : లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల మాత్రమే వెయిట్ తగ్గిపోరని, దాంతో పాటు సరైన పోషకాహారం, రోజువారీ ఎక్స్‌ర్‌సైజ్‌ చాలా అవసరమని గ్రహించాలి.

LemonGrass Tea

ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన మూలికలలో లెమన్‌గ్రాస్ ఒకటిగా ఆయుర్వేద నిపుణులు చెబుతారు. దీంతో తయారుచేసే హెర్బల్ టీకి ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు ఉంది. దీనిలో కెఫిన్ అసలు ఉండదు. పైగా బోలెడన్ని యాంటీఆక్సిడెంట్లు, వృక్ష సంబంధిత ఆరోగ్యకరమైన కాంపౌండ్స్ పుష్కలంగా ఉంటాయి.

లెమన్‌గ్రాస్(LemonGrass Tea) రోగనిరోధక వ్యవస్థను స్ట్రాంగ్ చేయడంలో తోడ్పడుతుంది. దీనిలో లభించే యాంటీఆక్సిడెంట్లు శరీరంలో క్షానిక వ్యర్థాలుగా మారే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణజాలాన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.

జీర్ణశక్తిని క్రమబద్ధీకరించడంలో కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది. పొట్ట ఉబ్బరం, అజీర్తి లేదా కడుపులో అసౌకర్యం వంటి సమస్యలతో బాధపడేవారు ఆ ప్రాబ్లెమ్‌కు చెక్ పెట్టడానికి చాలామంది ఈ టీని ఆశ్రయిస్తారు. సాంప్రదాయ వైద్యంలో కూడా జీర్ణసమస్యలకు లెమన్‌గ్రాస్‌ను ఒక ఉపశమనంగా వాడతారు.

బాడీ వెయిట్‌ను అదుపులో ఉంచడానికి ఇది ఉపకరిస్తుంది. లెమన్‌గ్రాస్ టీలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. హెవీ షుగర్స్ ఉన్న కూల్ డ్రింక్స్‌కు బదులుగా, చక్కెర లేకుండా దీనిని తాగడం వల్ల బాడీకి కేలరీల భారం తగ్గుతుంది. అయితే కేవలం ఈ లెమన్‌గ్రాస్ టీ తాగడం వల్ల మాత్రమే వెయిట్ తగ్గిపోరని, దాంతో పాటు సరైన పోషకాహారం, రోజువారీ ఎక్స్‌ర్‌సైజ్‌ చాలా అవసరమని గ్రహించాలి.

స్కిన్ గ్లోను పెంచడానికి ఇది దోహదపడుతుంది. దీనిలోని యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలు ఆక్సిడేటివ్ డ్యామేజ్‌కు గురికాకుండా కాపాడతాయి. దీంతో చర్మం మెరుస్తూ, ఆరోగ్యకరంగా కనిపించే అవకాశం ఉంది.

శరీరంలో అంతర్గత వాపులను కంట్రోల్ చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పరిశోధనలలో కూడా లెమన్‌గ్రాస్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్నట్లు తేలింది. అయితే మనుషుల్లో ఇది ఏ స్థాయిలో పనిచేస్తుందో స్పష్టత రావడానికి మరిన్ని పరిశోధనలు జరగాలి.

గుండె ఆరోగ్య పరిరక్షణకు కూడా ఇది తోడ్పడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ , రక్తపోటు స్థాయులపై లెమన్‌గ్రాస్ సానుకూల ప్రభావం చూపిస్తుందని ప్రాథమిక అధ్యయనాలు వెల్లడించాయి. అయినా కూడా, దీనిని గుండె జబ్బుల వైద్య చికిత్సకు ఆల్టర్‌నేట్‌గా వాడకూడదు.

లెమన్‌గ్రాస్ టీ తయారు చేయడానికి ఒకటి లేదా 2 తాజా లెమన్‌గ్రాస్ కాండాలను బాగా శుభ్రం కడుక్కోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత టీ గిన్నెలో ఒక గ్లాసు నీళ్లు పోసి ,అందులో ఈ ముక్కలను కూడా వేసి 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. మరిగిన మిశ్రమాన్ని వడకట్టి, కప్పులోకి తీసుకుని తాగొచ్చు. రుచి కోసం కొద్దిగా తేనె లేదా నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు.

LemonGrass Tea

ఈ టీ తాగే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. గర్భధారణ సమయంలో ఉన్న మహిళలు దీనిని తీసుకునే ముందు కచ్చితంగా డాక్టర్‌ను సంప్రదించాలి. అలాగే బీపీ మందులు , మూత్ర విసర్జనను పెంచే డైయూరెటిక్స్ వాడేవారు కూడా వైద్యుల సూచనతోనే తాగాలి. ఈ టీ తాగాక బాడీపైన ఏదైనా అలర్జీ కనిపించినట్లయితే వెంటనే వాడటాన్ని ఆపేయాలి.

మొత్తంగా లెమన్‌గ్రాస్ టీ(LemonGrass Tea) అనేది కెఫిన్ లేని ఒక మంచి సువాసనభరితమైన హెర్బల్ పానీయమని చెప్పాలి. జీర్ణక్రియ, ఇమ్యూనిటీ, చర్మ సౌందర్యం, వెయిట్ కంట్రోల్‌లో ఇది ఎంతగానో సపోర్ట్ చేస్తుంది. కానీ లెమన్‌గ్రాస్ టీ పూర్తి సర్వరోగ నివారిణిగా అనుకోకూడదు. సరైన లైఫ్ స్టైల్‌, హెల్దీ ఫుడ్, ఎక్సర్‌సైజ్‌లు తోడైనప్పుడే పూర్తి ప్రయోజనాలు అందుతాయి.

Date Of Birth : ఈ నెంబర్ల వారికి తలరాత మారబోతోంది..వారికి అనూహ్య ధనయోగం..

Exit mobile version