Mentality : ఎదిగేవారిని తొక్కే మనస్తత్వం.. అలాంటివారికి మీరిచ్చే సమాధానం ఇలా ఉండాలి..

Mentality : తోటి మనిషి ఎదుగుదలను చూసి ఆనందించే గుణం కంటే, ఓర్వలేక వారిని కిందకు లాగాలనే మనస్తత్వమే సొసైటీలో ఎక్కువగా కనిపిస్తోంది.

Mentality

బంధువులు, ఆఫీస్ కొలీగ్స్, ఆఖరికి మనం ప్రాణంగా అనుకునే ఫ్రెండ్స్..పక్కవారు సాధారణంగా ఉన్నంతవరకు ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కానీ, వారు స్వశక్తితో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయం వైపు వెళ్తుంటే మాత్రం, వారిలోని నిజమైన మనస్తత్వం(Mentality) బయటపడుతుంది.

తోటి మనిషి ఎదుగుదలను చూసి ఆనందించే గుణం కంటే, ఓర్వలేక వారిని కిందకు లాగాలనే మనస్తత్వమే ఈ సొసైటీలో ఎక్కువగా కనిపిస్తోంది. సైకాలజీలో ఈ ప్రవర్తనను పీత మనస్తత్వం (Crab Mentality) అంటారు.

ఒక గంపలో పడిన పీతలు తమలో ఒకటి పైకి పాకి బయటపడాలని ప్రయత్నిస్తుంటే, మిగిలినవన్నీ కలిసి దాన్ని కిందకు లాగేస్తుంటాయి. దీనినే క్రాబ్ al మెంటాలిటీ అంటారు. సరిగ్గా కొంతమంది వ్యక్తులు కూడా అంతే. తమను దాటి వేరే వాళ్లెవరైనా సరే ముందుకు వెళ్తుంటే సహించలేరు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొని, పరిమితులకు అతీతంగా (Limitless) ఎదగడానికి సైకాలజీ మనకు కొన్ని సూత్రాలను చెబుతోంది.

ముందుగా మనం ఎదుటివారి జెలస్ వెనుకున్న సైకాలజీని బాగా అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా తొక్కి పెట్టాలని చూస్తున్నారంటే, వారు మీ సామర్థ్యాన్ని గుర్తించారని గ్రహించాలి. ఇలాంటి వారి అసూయ వెనుక ముఖ్యంగా రెండు కారణాలు ఉంటాయి.

మొదటిది రిలేటివ్ ఇన్‌సెక్యూరిటీ (Relative Insecurity). అంటే మీ విజయం వారిలోని ఇన్‌ఫిరియారిటీ కాంప్లెక్స్‌ను బయటపెడుతుంది. మీరు సాధిస్తున్న ప్రోగ్రెస్ చూసి, తాము వెనుక బడిపోయామనే అభద్రత వారిలో కోపంగా మారుతుంది.

రెండోది ప్రొజెక్షన్ (Projection). వారి జీవితంలో సాధించలేని లక్ష్యాలను మీరు ఈజీగా అందుకుంటూ ఉంటే, వారిలోని నిరాశను, ఆక్రోశాన్ని మీపై పగ రూపంలో చూపిస్తారు. కాబట్టి, వారి ప్రవర్తనకు మీ క్యారెక్టర్ కారణం కాదు, వారిలోని ఇన్‌సెక్యూరిటీ ఫీలింగే కారణమని తెలుసుకోవాలి.

ఒకవేళ మీరు పడిపోయినా మరలా లేచి నిలబడటానికి, ముందుకంటే మరింతగా ఎదగడానికి సెల్ఫ్ కంట్రోల్ (Self Control) మొదటి ఆయుధం అని గుర్తించాలి. గోల్ రీచయ్యే సమయంలో ఎవరైనా మిమ్మల్ని కావాలని రెచ్చగొట్టటానికి ప్రయత్నించినప్పుడు, మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు వెంటనే రియాక్ట్ అవకూడదు. సైకాలజీలో దీనిని రియాక్టివ్ లూప్ అంటారు. మీరు ఆవేశపడితే వారి ప్లాన్ పండినట్లే అవుతుంది. ప్రతి విమర్శకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదని..మీ చేతలే వారికి సమాధానం అని తెలుసుకోవాలి.

మీరు ఎదగాలనుకుంటే ముందుగా మిమ్మల్ని మీరు నమ్మాలి. ఈ స్వీయ నమ్మకం (Self-Belief) మీ మైండ్‌సెట్‌ను ఒక కోటలా మారుస్తుంది. ఎదుటివారు మిమ్మల్ని తొక్కేయాలనుకున్నప్పుడు మొదట మీ కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారు.

అందుకే మీ ఆలోచనలను, ఫ్యూచర్‌ ప్లాన్‌ను అసూయపడే వ్యక్తుల ముందు అస్సలు బయటపెట్టకండి. మీరు ఏం చేయబోతున్నారో ఎవరికీ తెలియకూడదు. కానీ రిజల్ట్ వచ్చాక అందరూ ఆశ్చర్యపోవాలి. అందుకే మిమ్మల్ని కిందకు లాగే వారి మధ్యే టైమ్ వేస్ట్ చేయకుండా.. మీ ఎదుగుదలను చూసి నిజంగా హ్యాపీగా ఫీలయ్యే ఒక్కరిద్దరు మంచి వ్యక్తులనైనా మీ చుట్టూ ఉంచుకోవడం చాలా అవసరం.

Mentality

మొత్తంగా మీ ఎదుగుదలను ఆపే శక్తి ఏ ఒక్కరికీ ఉండదు.. ఒక్క మీ ఆలోచనలకు తప్ప అన్నది గుర్తు పెట్టుకోవాలి. చుట్టూ ఉన్నవారు మీ మార్గంలో రాళ్లు విసిరితే.. వాటితోనే మీ విజయానికి బాటను నిర్మించుకోండి.

కష్టాలు, కుట్రలు, అసూయలు మిమ్మల్ని ఆపడానికి ఏమాత్రం పనికిరావని..మీరు ఎంత బలమైన వారో అన్నది ఎదుటివారికి చూపించడానికే వస్తాయని గుర్తు పెట్టుకోవాలి. మిమ్మల్ని తొక్కేయాలనుకున్న వారే, ఒకరోజు మిమ్మల్ని చూసి తలదించుకునేలా ఎదగడమే మీరు వారికిచ్చే కరెక్ట్ రిప్లై అని గుర్తుపెట్టుకోవాలి.

Rashi Phalalu : ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఈ రాశుల వారికి అదృష్టం..వీరికి ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం

Exit mobile version