Self Identity
ఎవరైనా సరే తన రేంజ్, తన పర్సనల్ స్టాండర్డ్స్‌ను ఒకే రోజు అది కూడా రాత్రికి రాత్రే కోల్పోరు. అది చాలా సైలెంట్ అండ్ స్లో ప్రాసెస్‌లో జరుగుతుంది. నదిలో వెళ్తున్న బోటుకి ఎక్కడో కంటికి కనిపించని ఒక చిన్న రంధ్రం పడితే, మొదటగా లోపలికి కొద్ది కొద్దిగా నీరే చేరుతుంది. కానీ మెల్లగా అలా చేరుతూ వచ్చిన నీరే ఆ బోటును ముంచేస్తుంది. అలాగే ఎవరైనా సరే తన మైండ్‌సెట్‌లో, డైలీ ప్రవర్తనలో చేసుకునే చిన్న చిన్న కాంప్రమైజులే మెల్లగా వారి లైఫ్ స్టాండర్డ్‌ని నాశనం చేసేస్తాయి.
చుట్టూ ఉండే ఫ్రెండ్స్, సర్కిల్ ఎఫెక్ట్ మనుషుల మైండ్‌సెట్ మీద చాలా ఎక్కువగా ఉంటుంది. వారు ఎలాంటి వాళ్లతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తారో, వాళ్ల క్యారెక్టర్ అండ్ రేంజ్ కూడా అలాగే తయారవుతాయి. డిసిప్లిన్ , టార్గెట్స్ లేకుండా బతికేస్తున్న వాళ్ల మధ్య వారు ఎప్పుడూ ఉంటే, వారి ఆలోచనా విధానం కూడా మెల్లగా వాళ్ల లెవెల్‌కే పడిపోతుంది.
తమ సర్కిల్‌లో చేసే తప్పులు, లేజీ పనులు, బాధ్యతారాహిత్యం వారికి చాలా క్యాజువల్ విషయాలుగా అనిపిస్తాయి. ప్రవాహానికి ఎదురెళ్లలేక అందరూ నడిచే ఈజీ రూట్‌లోనే వెళ్దామనే థాట్ మైండ్‌లోకి వచ్చినప్పుడు, వారు తన సొంత స్టాండర్డ్స్‌కే ఫస్ట్ గండి కొడతారు.
ఫెయిల్యూర్ భయం, మైండ్‌ని కంఫర్ట్ జోన్‌కి అలవాటు చేయడమనేది దీనికి ఇంకో మెయిన్ రీజన్. నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లాలన్నా, అనుకున్నది సాధించాలన్నా ఎప్పుడూ కష్టపడాలి. రోజురోజుకూ బెటర్‌గా మారాలి. కానీ ఎప్పుడైతే ఎవరైనా సరే తన గోల్స్ రేంజ్ పెంచుకోవడానికి బదులు, ఉన్న దాంతోనే సర్దుకుపోవడానికి ఇష్టపడతారో.. అప్పుడే తన స్టాండర్డ్స్‌ని తానే తగ్గించుకున్నవారవుతారు. ఈ మెంటల్ వీక్‌నెసే వారిని యావరేజ్ లెవెల్‌లోనే ఆపేస్తుంది.
సొసైటీలో నలుగురి దృష్టిలో పడటానికి, తమ సర్కిల్‌ను ఇంప్రెస్ చేయడానికి తమ సొంత రూల్స్, విలువలను పక్కన పెట్టేస్తుంటారు. వేరేవాళ్ల అప్రూవల్ కోసం ఎవరైతే లైఫ్ రూల్స్‌ని కాంప్రమైజ్ చేసుకోవడం మొదలుపెడతారో, అప్పుడే వారి అసలైన పర్సనాలిటీ దెబ్బతింటుంది. వేరేవాళ్ల ఓపినియన్స్‌నే వారి లైఫ్ స్టాండర్డ్స్ అని ఫిక్స్ అయి బతకడం వల్ల వారి యూనిక్ క్వాలిటీని పాడుచేస్తుంది.
అంతేకాకుండా తమ తప్పులను సరిదిద్దుకోకుండా.. సాకులు వెతుక్కోవడం వారి పతనానికి మెయిన్ రీజన్. టైమ్ మెయింటెన్ చేయకపోవడం, ఇచ్చిన మాట తప్పడం, చేసే పనిలో క్వాలిటీ తగ్గించడం వంటి విషయాలను దీనిదేముందిలే అని తీసిపారేస్తే, రేపు పెద్ద పెద్ద గోల్స్ మిస్ అయిపోతారు.
అందుకే ఎవరైనా సరే తన రేంజ్ అండ్ లెవెల్‌ని కాపాడుకోవాలంటే ఎప్పుడూ కూడా క్లారిటీతో ఉండాలి. డైలీ లైఫ్‌లో వారు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్, వారు మెయింటెన్ చేసే ఫ్రెండ్‌షిప్స్, వారు చేసే పనిలో చూపించే క్వాలిటీ మాత్రమే వారి రేంజ్ ఏంటో ప్రపంచానికి చూపిస్తాయి. వేరేవాళ్ల కోసం కాంప్రమైజ్ అవ్వకుండా, తనకంటూ కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టుకున్నప్పుడే ఎవరైనా సరే తన రేంజ్ తగ్గకుండా టాప్ లెవెల్‌లో నిలబడగలరు.
Moroccan Red Clay : క్లియోపాత్రా బ్యూటీ సీక్రెట్ ఇదేనట.. ఈ నేచురల్ క్లే ఇంట్లోనే ఇలా వాడండి..
