Pink Basket Dating
ఫోన్ స్క్రీన్ పట్టుకుని లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ స్వైప్‌లు కొడుతూ.. అసలు అవతలి వైపు ఉన్నది అబ్బాయో అమ్మాయో కూడా క్లారిటీ లేకుండా ఫేక్ ప్రొఫైల్స్ మాయలో పడి తలలు బద్దలు కొట్టుకుంటున్న డిజిటల్ డేటింగ్ కాలానికి .. రిటైర్మెంట్ ప్రకటించే టైమ్ వచ్చేసింది. ఒంటరితనం బోర్ కొట్టి డేటింగ్ యాప్స్‌లో అకౌంట్లు ఓపెన్ చేసి, చాటింగ్‌లతో మాయలో తేలిపోతున్నారు. తీరా సీన్ కట్ చేసి తేరుకునే సమయానికి ఫైనాన్షియల్‌గా, మానసికంగా పూర్తిగా క్రాష్ అయిపోతుంది ఈ యంగ్ జనరేషన్ .
ఇన్‌స్టాలో ఎన్ని ఫిల్టర్లు అయినా వేసి, ఏఆర్ ఎఫెక్ట్స్‌తో రీల్స్ దిగొచ్చు గానీ.. రియల్ లైఫ్‌లో ఒక మనిషి కళ్ల ముందొచ్చి నిలబడి క్యూట్‌గా నవ్వి పలకరిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఆ మూమెంట్‌లో ఎవరి మైండ్‌లో అయినా వేరే లెవెల్ డ్యూయెట్స్ మోగిపోతాయి. అందుకేనేమో ఈమధ్య డిజిటల్ యాప్స్ అన్నీ పక్కన పడేసిన మనోళ్లు.. ఇప్పుడు డైరెక్టుగా సూపర్ మార్కెట్ల వైపు పరుగులు పెడుతున్నారు. కానీ అక్కడ సరుకులు కొనడానికి మాత్రం కాదు.
అవును ఇప్పుడు ఈ ట్రెండ్‌ని సోషల్ మీడియాలో గ్రాసరీ షాప్ డేటింగ్ అని పిలుస్తున్నారు. దీనిలో అసలు మ్యాటర్ ఏంటంటే.. సూపర్ మార్కెట్‌కి వెళ్లినప్పుడు ఎవరి చేతిలో అయినా పింక్ కలర్ బాస్కెట్(Pink Basket Dating) కానీ కనిపిస్తే, దానికో కోడ్ ఉంటుందట. అదేంటంటే, నేను ప్రెజెంట్‌గా టోటల్లీ సింగిల్.. ఎవరైనా వచ్చి నాతో మాట్లాడొచ్చని అవతలి వాళ్ళకి పంపించే సైలెంట్ సిగ్నల్ అన్నమాట.
ఆ హింట్ దొరికిన వెంటనే అటు నుంచి వెళ్లి ఒక స్వీట్ స్మైల్ ఇచ్చి మాట కలిపి తెగ ఫ్రెండ్స్ అయిపోతున్నారట. అయితే ఆ పరిచయం నెక్స్ట్ లెవెల్ లవ్‌గా మారుతుందో లేదో అన్న విషయాన్ని పక్కనపెడితే, ఏ ఫేక్ ఫిల్టర్లు లేకుండా ఒకరినొకరు డైరెక్టుగా చూసుకుని వైబ్స్ మ్యాచ్ చేసుకునే పక్కా నాచురల్ ఛాన్స్ అయితే మాత్రం ఇక్కడ గ్యారెంటీగా దొరుకుతుందని యూత్ తెగ మురిసిపోతున్నారు.
ఇక ఈ కొత్త ట్రెండ్‌కి యూత్ ఫిదా అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే.. ఇక్కడ అందరి అసలు మ్యానరిజమ్స్ బయటపడిపోతాయి. షాపింగ్ కార్ట్ ముందు నిలబడి ఏం కొనాలి? ఎంత కొనాలని కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేక ప్రతి ఐటమ్ ప్రైస్ చెక్ చేసుకుంటూ, పర్ఫెక్ట్ బడ్జెట్ ప్లానింగ్‌తో మ్యానేజ్ చేసే టాలెంటెడ్ పీపుల్ రకానికి చెందిన వారా అనేది తెలుస్తుంది. సూపర్ మార్కెట్‌లో కనిపించే షాపింగ్ టెక్నిక్స్ వల్ల, ఆ వ్యక్తి లైఫ్‌స్టైల్ ఎలాంటిది, మనీ మేనేజ్‌మెంట్ ఎలా చేస్తారనే విషయాలను బట్టి ఒకరిపై ఒకరికి క్లారిటీ వస్తుంది.
అయితే ఇక పింక్ బాస్కెట్(Pink Basket Dating) కనిపిస్తే చాలు, వైబ్స్ మ్యాచ్ అయిపోయాయని ఫిక్స్ అయిపోతే మాత్రం కొన్నిసార్లు సీన్ రివర్స్ అయిపోతుంది . ఇవన్నీ కేవలం ఒక చిన్న స్టార్టింగ్ పాయింట్స్ మాత్రమే. అవతలి వాళ్ల బాడీ లాంగ్వేజ్ , అసలు వాళ్లు మనతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్‌గా ఉన్నారా లేదా అనేది అబ్జర్వ్ చేయాలి. ఒకవేళ వాళ్లు అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయితే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవడమే బెస్ట్. అవతలి మనిషికి రెస్పెక్ట్ ఇస్తూ,తమ హద్దుల్లో తాముంటూ చేసే ఈ రియల్ లైఫ్ డేటింగ్ వైబ్స్‌నే అసలైన మోడ్రన్ రొమాన్స్ అంటున్నారు నేటి తరం.
