Psychological Problem
ఈ రోజుల్లో ప్రతీ ఒక్కరూ కూడా పరిగెత్తే లైఫ్‌స్టైల్‌తో, వర్క్ ప్రెజర్, ఫ్యామిలీ టెన్షన్లు, డబ్బుల తిప్పలు ఇలా ఏదొక బాధ లేదా ఒత్తిడితోనే ఉంటున్నారు. రిలేషన్‌షిప్‌లోనో, డబ్బుల విషయంలోనో మనకు నచ్చనిదేదైనా జరిగినప్పుడు, లేదా అనుకున్న పనులు కానప్పుడు చాలా దిగులుగా అనిపిస్తుంది. కాస్త కోపం, ఇంకొంచెం బాధ కూడా కలుగుతాయి.
దానికే మనకేదో మానసిక రోగం(Psychological problem) వచ్చేసిందని, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయామని కంగారుపడిపోయి సైకియాట్రిస్ట్ దగ్గరకు పరుగెత్తాల్సిన అవసరం ఉండదంటున్నారు సైకాలజిస్టులు. మన బాడీకి జలుబు, తుమ్ములు వచ్చి తగ్గిపోయినట్లే.. మనసుకు కూడా ఇలాంటివి వచ్చి పోతుంటాయి.
మరి మనసు పడుతున్న వేదన హద్దులు దాటిందని, కచ్చితంగా సైకియాట్రిస్ట్‌ని కానీ సైకాలజిస్ట్‌ను కానీ ఎప్పుడు కలవాలనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తుంది. అయితే దీని కోసం ఫోర్ డీస్ (4Ds) రూల్ తెలుసుకుంటే చాలు.. మన మైండ్ హెల్త్ డేంజర్ జోన్‌లో ఉందో లేదో తెలిసిపోతుంది.
ఇందులో మొదటి ‘డి’ అంటే డ్యూరేషన్ (Duration). మీకు కలిగిన బాధ, దిగులు, విపరీతమైన టెన్షన్ అనేది రెండు, మూడు రోజులు ఉండి పోయేది కాకుండా.. కంటిన్యూగా వారాల తరబడి మిమ్మల్ని వెంటాడుతుంటే కచ్చితంగా ఆలోచించాలి. అంటే ఏ పని చేస్తున్నా ఆ బాధ మనసులోనే ఉండిపోవడం, రోజూ అదే మూడ్‌లో కంటిన్యూ అవ్వడం మొదటి పెద్ద సిగ్నల్ అన్నమాట.
ఇక రెండో ‘డి’ అంటే డిస్ట్రెస్ (Distress). ఏదో చిన్న డిస్టర్బెన్స్ కాకుండా, ఆ మెంటల్ టెన్షన్ వల్ల మీ మనశ్శాంతి పూర్తిగా నాశనం అయిపోతుంటుంది. ఆ బాధను తట్టుకోలేక రోజూ నరకం చూస్తుంటారు. అంతటితో ఆగకుండా, మీ ప్రవర్తనతో మీ చుట్టూ ఉన్న మీ పార్ట్‌నర్, పిల్లలు, పేరెంట్స్ , చివరకు ఫ్రెండ్స్ కూడా ఇబ్బంది పడుతుంటే దాన్ని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదు.
మూడోది చాలా కీలకమైన ‘డి’ అంటే డిస్ఫంక్షన్(Dysfunction) అంటారు. అంటే మీ మనసులో నడుస్తున్న ఈ గందరగోళం, టెన్షన్ వల్ల మీ లైఫ్‌లోని అసలు కెపాసిటీని, పొటెన్షియల్‌ని మీరు అస్సలు ఉపయోగించలేకపోతారు. మీ ఆకలి, నిద్ర, ఆలోచనా శక్తి కూడా పూర్తిగా చెల్లాచెదురైపోతాయి.
ఒకవేళ హోమ్ మేకర్ అయితే వంట చేయడం, పిల్లల కేరింగ్, ఇంటి బాధ్యతలను నెరవేర్చడంలో చాలా ఇబ్బందిపడతారు. ఉద్యోగులైతే ఆఫీస్ వర్క్ మీద కాన్‌సన్‌ట్రేషన్ పెట్టలేక పనులు చెడగొట్టుకుంటారు. విద్యార్థులైతే స్టడీస్‌పై ఫోకస్ పెట్టలేక మార్కులు పోగొట్టుకుంటారు. ఇలా మీ రోజువారీ నార్మల్ లైఫ్ రోటీన్ దెబ్బతింటోందంటే వారి మైండ్‌కి మానసిక నిపుణుల హెల్ప్ కావాలని అర్థం.
ఇక చివరిది, అత్యంత డేంజరస్ అయిన నాలుగో ‘డి’అంటే డేంజర్ (Danger ). ఇది వెంటనే అలర్ట్ అవ్వాల్సిన వార్నింగ్ బెల్. మైండ్ ప్రాబ్లెమ్ ఉన్న ప్రతీ ఒక్కరికీ కేవలం మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే ఉండవు. కొంతమందిలో కోపం, ఆవేశం హద్దులు దాటిపోతుంది.
దీంతో చుట్టూ ఉన్నవాళ్లపైన , తమ పార్ట్‌నర్‌పైన తీవ్రంగా దాడి చేయాలనే ఆలోచనలు (Homicidal Thoughts) వస్తాయి. మరికొందరిలో తమను తాము కోసుకోవడం, గాయపరచుకోవడం (Self-injurious behavior) లేదా ఇక నేను బ్రతకడం వేస్ట్ చచ్చిపోతాననే ఆత్మహత్య ఆలోచనలు (Suicidal thoughts) వస్తుంటాయి. ఇది మాత్రం ప్రాణాలకే ముప్పు తెచ్చే పరిస్థితి అని గ్రహించాలి.
ఇలా ఈ డ్యూరేషన్, డిస్ట్రెస్, డిస్ఫంక్షన్, డేంజర్ అనే ఈ ఫోర్ డీస్ (4Ds) కనుక మీలో కానీ, మీకు తెలిసిన వారిలో కానీ కనిపిస్తే.. అస్సలు ఆలోచించకుండా వెంటనే సైకియాట్రిస్ట్‌ని కలిసి కౌన్సెలింగ్ లేదా ఇవాల్యుయేషన్ చేయించుకోవాలి.
దీనిలో భయపడటానికి గానీ, దాచుకోవడానికి గానీ ఏమీ ఉండదు. మనం రొటీన్‌గా కంటి చూపు కోసం ఐ చెకప్‌కి ఎలా వెళ్తామో.. బాడీ హెల్త్ కోసం బ్లడ్ టెస్టులు ఎలా చేయించుకుంటామో అలాగే మన మనసు ఆరోగ్యం(Psychological problem) కోసం డాక్టర్‌ను కలవడం కూడా చాలా సాధారణమైన విషయమేనని ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలి.
Emotional Immaturity : ఎమోషనల్ ఇన్ మెచ్యూరిటీకి చెక్ పెట్టే 4 గోల్డెన్ రూల్స్
