Psychology : మనల్ని ఇష్టపడని వారిని కూడా దోస్తులుగా మార్చుకోండి.. ఆ 3 సైకలాజికల్ సీక్రెట్స్ ఇవే

Psychology : మన చుట్టూ ఉన్నవాళ్లలో మనల్ని ఇష్టపడని వారి మనస్తత్వాన్ని మార్చడం అనేది ఒక అద్భుతమైన కళ

Psychology

జీవితంలో అందరూ తమను ఇష్టపడాలని.. అందరితోనూ తాము మంచిగా ఉండాలనే ఆలోచిస్తారు . కానీ కొన్నిసార్లు ఏ తప్పు చేయకపోయినా సరే కొంతమందికి అవతలివాళ్లు అంటే అస్సలు నచ్చరు. అలాంటి వాళ్ల మనసును మార్చడమే కాకుండా వారు ఇష్టపడేలా చేసుకునేందుకు సైకాలజీ(Psychology)లో కొన్ని అద్భుతమైన చిట్కాలు ఉన్నాయంటున్నారు మానసిక నిపుణులు.

మన చుట్టూ ఉన్నవాళ్లలో మనల్ని ఇష్టపడని వారి మనస్తత్వాన్ని మార్చడం అనేది ఒక అద్భుతమైన కళ. దీనికోసం సైకాలజీ(Psychology)లో బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఎఫెక్ట్ అనే ఒక పవర్‌ఫుల్ పద్ధతి ఉంది. దీని ప్రకారం, మనకు నచ్చని వారి నుంచి కానీ మనల్ని ఇష్టపడని వారి నుంచి కానీ ఏదైనా ఒక చిన్న సహాయం అడగాలి.

ఉదాహరణకు మీరే వారి దగ్గరకు వెళ్లి ఒక పెన్ను ఇవ్వమని కానీ, ఒక చిన్న సలహా చెప్పమని కానీ అడగండి. మీరు అలా అడిగినప్పుడు అవతలి వ్యక్తి సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక విజువల్ కనిపిస్తుంది. సాధారణంగా నచ్చని వాళ్లకు ఎవరూ సాయం చేయరు కాబట్టి..తాను వీరికి సాయం చేశాను అంటే వీరు మంచివాళ్లే అయి ఉంటారనే ఆలోచన వారి బ్రెయిన్‌లో తెలీకుండానే స్టార్టవుతుంది. ఈ చిన్న ట్రిక్ వల్ల వారిలో మనపై ఉన్న నెగిటివిటీ మెల్లగా తగ్గిపోతుంది.

ఇలాంటి వాళ్లని మన వైపు తిప్పుకోవడానికి ఉన్న మరో మార్గం వారిని నిజాయితీగా అభినందించడం. తమను పొగిడినప్పుడు ఎవరైనా సరే ఎంతటి కోపాన్నైనా మర్చిపోతారు. మనమంటే పడని వ్యక్తిలో ఉన్న ఏదైనా ఒక మంచి టాలెంట్‌ను కానీ వారు వేసుకున్న డ్రెస్ బాగుందని కానీ అందరి ముందు నిజాయితీగా మెచ్చుకుంటే, వారి మనసులోని ద్వేషం మెల్లగా కరిగిపోతుంది.

అలాగే వాళ్లతో మాట్లాడేటప్పుడు వాళ్ల పేరును ఎక్కువగా పిలిచినట్లుగా చెప్పడం , వాళ్లు చెప్పే విషయాలను ఎంతో శ్రద్ధగా వినడం చేయాలి. సైకాలజీ(Psychology) ప్రకారం ప్రతి ఒక్కరికీ తమ పేరు వినడం, తమ మాటలకు ఎదుటివారు విలువ ఇవ్వడం ఇష్టపడతారు. మనం వారిని గౌరవిస్తున్నామనే ఫీలింగ్ కలిగినప్పుడు, వారు కూడా మనల్ని ఇష్టపడటం స్టార్ట్ చేస్తారు.

Psychology

చివరగా, మనల్ని ద్వేషించే వాళ్ల ముందు మనం ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ ఉండటం చాలా ముఖ్యం. వాళ్లు మనపై నెగిటివిటీ చూపించినా సరే, మనం తిరిగి అదే కోపాన్ని చూపించకుండా కూల్‌గా సమాధానమిస్తే వాళ్ల అహంకారం దెబ్బతింటుంది. తాము ఎంత తప్పుగా ప్రవర్తిస్తున్నా అవతలి వ్యక్తి ఇంత మంచిగా ఉన్నారేనన్న పశ్చాత్తాపం వారికి తెలీకుండానే మొదలవుతుంది.

బలవంతంగా ఎవరినీ కూడా ఏమాత్రం మార్చలేం కానీ, మన ప్రవర్తనలోని మంచితనం,ఇలాంటి చిన్న చిన్న సైకలాజికల్ పద్ధతుల ద్వారా శత్రువులను కూడా మనకు నచ్చేలా, మనల్ని ఇష్టపడేలా ఈజీగా మార్చుకోవచ్చు.

Libra :ఈ రాశివారిది శాంతిని కోరుకునే హృదయం..నిర్ణయాలు తీసుకోవడంలో తడబాటు

Exit mobile version