Romance In Relationship : రిలేషన్‌షిప్‌లో లవ్ కనిపించడం లేదా? ఎక్కడో ఆ స్పార్క్ మిస్ అవుతుందా?

Romance In Relationship : రొమాంటిక్ స్పార్క్‌ను మళ్లీ రివర్స్ చేయడానికి రిలేషన్‌లో మళ్లీ పర్సనల్ స్పేస్‌ను, కొంత డిస్టెన్స్‌ను మెయింటెయిన్ చేయాలి.

Romance In Relationship

లవ్ చేయడం చాలా ఈజీ.. కానీ ఆ ప్రేమని, దాని వెనుకున్న అట్రాక్షన్‌ని ఏళ్ల తరబడి అలాగే కాపాడుకోవడం మాత్రం నిజంగా పెద్ద విషయమే. ఎంతో ఇష్టపడి మ్యారేజ్‌ చేసుకున్న జంటలు కూడా కొన్ని ఇయర్స్ గడిచేసరికి ఒకప్పటి ఆ స్పార్క్ అలాగే ఆ ఎగ్జైట్‌మెంట్ ఇప్పుడు లేదని ఫీలవుతుంటారు.

గొడవలు పడే కపుల్స్‌లోనే కాదు, ఏ సమస్యా లేకుండా ప్రశాంతంగా జీవించే దంపతులలో కూడా రొమాన్స్ మెల్లగా మాయమైపోతుంటుంది. దీనికి కారణం వర్క్ స్ట్రెస్, ఏజ్ పెరగడం రీజన్ అని చాలామంది అనుకుంటారు. కానీ అసలు విలన్ అది కాదని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఆ పార్ట్‌నర్స్ ఇద్దరి ప్రమేయం లేకుండానే రిలేషన్‌లోకి ప్రవేశించే ఒక చిత్రమైన మెంటల్ కండీషనే దీనికి కారణమని అంటున్నారు.

సైకాలజిస్టులు ఈ పరిస్థితిని ఎమోషనల్ ఫ్యూజన్ లేదా భావావేశ విలీనమని పిలుస్తారు. అంటే ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకున్న తర్వాత, తమ సొంత ఐడెండిటీని, వ్యక్తిత్వాన్ని మరచిపోయి ఒక్కటిగా కలిసిపోతారు. తాము ప్రతీ చిన్న పనినీ కలిసే చేస్తామని, ఆలోచనలన్నీ కూడా ఒకేలా ఉంటాయని చెబుతూ ఉంటారు.

కానీ సైకాలజీ చెబుతున్నదాని ప్రకారం.. ఒకేలాంటి ఆలోచనలు, ఒకేలాంటి రొటీన్ పనులు, అస్సలు గ్యాప్ లేకుండా ఒకేచోట ఉంటే వారిలో మెల్లగా లైంగిక ఆకర్షణ లేదా మోహం తగ్గిపోతుంది. ఎదుటివ్యక్తిపై ఎప్పుడూ కూడా క్రేజ్ లేదా స్పార్క్ కలగాలంటే ఆ ఇద్దరి మధ్య కొంత స్పేస్, డిఫరెంట్ పనులు చేయడం, కొద్దిపాటి ప్రైవసీ తప్పనిసరిగా ఉండాలని సైకాలజిస్టులు చెబుతున్నారు.

మనిషి బ్రెయిన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకే వ్యక్తి నుంచి కొండంత సేఫ్టీని, అలాగే థ్రిల్లింగ్ లేదంటే ఎగ్జైట్‌మెంట్‌ను రెండింటినీ ఆశిస్తుంది. కొత్తలో ఉన్న అట్రాక్షన్‌కు ఆ థ్రిల్లే కారణం. కానీ డైలీ ఒకే లైఫ్‌స్టైల్, ఒకే ఎమోషనల్ వేవ్‌లెంగ్త్‌లో కంటిన్యూ అవ్వడం వల్ల, రిలేషన్ ఎంతో సురక్షితంగా ఉన్నా .. ఆ స్పార్క్‌ను రగిలించడానికి కావలసిన అట్రాక్షన్ మెల్లగా చల్లబడిపోతుంది.

Romance In Relationship

ఆ రొమాంటిక్ స్పార్క్‌ను మళ్లీ రివర్స్ చేయడానికి రిలేషన్‌లో మళ్లీ పర్సనల్ స్పేస్‌ను, కొంత డిస్టెన్స్‌ను మెయింటెయిన్ చేయాలి. పార్ట్‌నర్స్ ఇద్దరూ ఒకరికొకరు తమకంటూ ఒక పర్సనల్ ఐడెంటిటీ ఉన్నవారిగా జీవించాలి. పర్సనల్ హాబీలు, ఇంట్రస్ట్‌ అయిన విషయాలను ఫాలో అవ్వడంతో పాటు ప్రతీది కలిసే కాకుండా విడిగా కూడా కొంత టైమ్ స్పెండ్ చాలా ముఖ్యం. మీ పార్ట్‌నర్ మీకు కొద్ది రోజులు అయినా దూరంగా ఉన్నప్పుడు.. వారిపై మళ్లీ ఆకర్షణ , కోరిక రెట్టింపు అవుతాయి.

మళ్లీ వారిని ఫ్లర్ట్ చేయడం, ఆటపట్టించడం, ఒకరినొకరు మిస్ అవుతున్న విషయాన్ని చెప్పుకోవడం వల్ల పోయిన ఆకర్షణ మళ్లీ తిరిగి వస్తుంది. అయితే ఇదే రీజన్‌ చెప్పి దూరంగా జరగడం లేదా రిలేషన్‌ను నిర్లక్ష్యం చేయడం వంటివి చేయకూడదు. సొంత ఐడెండిటీని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం వల్ల..ఇద్దరి మధ్య హాట్‌నెస్ అండ్ అట్రాక్షన్ లాంగ్ రన్‌లో సజీవంగా ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే మీ రిలేషన్‌లో మళ్లీ లవ్ అండ్ రొమాన్స్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్లాలంటే.. అప్పుడప్పుడూ అయినా ఒకరినొకరు మిస్ అయ్యేంత స్పేస్ ఇచ్చుకోవాల్సిందే.

Decide On A Life Expectancy : మన మైండ్ సెట్టే మన ఆయుష్షును డిసైడ్ చేస్తుందా? మనం ఎంతకాలం బతుకుతామో ముందే ఊహించొచ్చా?

Exit mobile version