Sambrani For Hair
ఇప్పుడంతా హెడ్ బాత్ చేయగానే జుట్టును ఆరబెట్టడానికి హెయిర్ డ్రయర్లు, హీట్ స్టైలింగ్ టూల్స్ వాడుతున్నారు. దీని వల్ల జుట్టు దెబ్బతిని ఊడిపోవడం, చుండ్రు రావడం వంటి సమస్యలు ఫేస్ చేస్తున్నారు.
కానీ నానమ్మలు, అమ్మమ్మల కాలంలో ఎలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ లేకపోయినా.. జుట్టును ఒత్తుగా, నల్లగా ఉంచుకోవడానికి తలస్నానం చేసిన తర్వాత జుట్టుకు సాంబ్రాణి ధూపం వేసుకునేవారు. మళ్లీ ఇప్పుడు అలాంటి మ్యాజిక్‌ను ఫాలో అవమని చెబుతున్నారు హెల్త్ ఎక్స్‌పర్ట్స్.
ముఖ్యంగా వర్షాలు పడుతున్న సమయంలో.. గాలిలో తేమ వల్ల హెడ్ బాత్ చేశాక జుట్టు త్వరగా ఆరకపోవడంతో.. మాడుపై ఫంగల్ ఇన్ఫెక్షన్లు, చుండ్రు వస్తుంటాయి. అందుకే ఆ సమయంలో సాంబ్రాణి ధూపం వేసుకోవడం వల్ల ..అది జుట్టులోని తేమను పీల్చుకుని, తలను పొడిగా ఉంచుతుంది.
ఈ సాంబ్రాణి ధూపంతో పాటు దానిలో వేప, తులసి వంటి మూలికలు వాడటం వల్ల యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు మాడుకు అంది బ్యాక్టీరియాను నశింపజేస్తాయి. సాంబ్రాణి పొగలోని వేడి తలలో రక్తప్రసరణను పెంచి కుదుళ్లను బలంగా మారుస్తుంది.
వానా కాలంలో జుట్టు నుంచి వచ్చే ఒక రకమైన స్మెల్‌ను పోగొట్టడానికి ఇది ఒక నేచురల్ పర్ఫ్యూమ్‌లా పనిచేస్తుంది. అంతేకాకుండా దీని సువాసన మైండ్‌ను రిలాక్స్ చేసి, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇటు ఇళ్లంతా కూడా ఈ ధూపం పట్టి స్వచ్ఛమైన పరిమళంతో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తుంది.
అయితే సాంబ్రాణి ధూపం జుట్టుకు(Sambrani For Hair) మంచిదే అయినా కూడా, ప్రతిరోజూ కాకుండా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు, మూడు సార్లు మాత్రమే వేసుకోవాలి. దీనిని అతిగా పొగ పీల్చడం ఊపిరితిత్తులకు మంచిది కాదని.. కాబట్టి తక్కువ సార్లు వాడుతూ అద్భుతమైన ఫలితాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు.
Vishwanath And Sons : విశ్వనాథ్ అండ్ సన్స్ ఎలా ఉంది? వెంకీ అట్లూరి మ్యాజిక్ వర్కవుట్ అయిందా?
